నాలో నువ్వే
అంశం : నిన్ను దాటి పోగలనా
నాలోనే ఉంటావు
నాతోనే నువ్వంటావు
నేను లేకపోతే నువ్వు లేవంటావు
నువ్వు ఉంటేనే నేనంటావు
ఎవ్వరికీ కనిపించవు
నాకే ఒక్కమారు కానరావు
ఎవ్వరితో మాట్లాడవు
నేనుంటే చాలంటావు
నువ్వు చెప్పింది వినమంటావు
వినకపోతే బుర్ర తొలిచేస్తుంటావు
ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూనే ఉంటావు
నోటికి తాళమే ఎరగవు
బాధలో ఓదార్పునిస్తావు
సంతోషంలో పొంగిపోతావు
కన్నీటిని ఆపేయమంటావు
కష్టాలను మరచిపోమంటావు
ధైర్యంగా ఉండమని హితవు చెబుతావు
తప్పు చేస్తే మందలిస్తావు
నన్ను ఒంటరిగా ఎప్పుడూ వదలవు
నా నుండి ఎన్నడూ దూరం కావు
నువ్వే నా చిరకాల నేస్తం
నువ్వే నా ‘అంతరంగం’
నిన్ను దాటి పోగలనా?
నువ్వు లేక ఉండగలనా??
రచయిత ::మంజీత కుమార్
Nice medam…👌👌👌👌