ప్రియమైన వంటిల్లు 

ప్రియమైన వంటిల్లు 

అంశం ::నిన్ను దాటి పోగలనా

నిను వీడి నేనుండగలనా?
ఉందామన్నా ఎవరు ఉండనిస్తారు నన్ను.

కనీసం ఆదివారం అయినా నిను చూడకుండా ఉండేందుకు అవకాశమే లేదాయే

పండగొస్తే అందరికీ సెలవులు….
నాకు, నీకు  మాత్రం ఆరోజే తీరికలేని పనులు.

పుట్టింటి నుంచి అత్తింట్లో అడుగు పెట్టి , కొత్త కోడలిగా పాలు పొంగించడంతో మొదలైంది కదా! మన అనుబంధం.

ఆనాటి నుండి మొదలైన బంధం నేను అత్తనైనా నను వీడలేదు.

ఓ నా ప్రియమైన వంటిల్లా
నీతో పెనవేసుకున్న నా ఈ అనుబంధాన్ని  ఎంత  వర్ణించినా తక్కువే  కదా సఖి

గృహలక్ష్మిగా నావారందరి ఆలనా,పాలనా చూచుటలో…

అన్నపూర్ణనై కోరినవన్నీ వండి,వడ్డించే సమయాన
నీవే నాతోడు.

ఓ నా ప్రియసఖి తరాలు మారినా విసుగు,విరామం లేకుండా మహిళా లోకానికి అండగా నిలిచావు

నా సంతోషంలో భాగం నీవు

నా కన్నీటిని దాచే నెచ్చెలి నీవు

అలాంటి నిను దాటి పోగలనా…..

నేను ఏమిటి ఏ మగువా నిను వీడి మనలేదులే.

రచయిత :: నాగమయూరి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!