(అంశం:” ప్రమాదం”)
అతిపెద్ద ప్రమాదం
రచన::వెలపర్తి వేంకటరమణ
ఎన్నడూ ఇంకిపోని సజీవనదిలా
స్వార్ధాన్ని తనువంతా ప్రవహింపజేసుకుంటూ
వెల్లువలా ముందుకు పరిగెత్తడానికి
ప్రక్కవారిని సుడిగుండాల్లో ముంచేదెవరు..??
పచ్చగా నవ్వే ప్రాణాధారమైన చెట్టుని,
రక్కసి కెరటాల నుంచో, గాలుల నుండో
రక్షించే కొండలనీ, పర్వతాలనీ
తిండిని పెట్టే మట్టిని,
త్రాగే చెఱువుని
ప్రేమసుమాలను పూయించే
అనుబంధాల్ని, రక్త సంబంధాలనీ
దేన్నీ వదలకుండా మింగేస్తున్న
రాక్షసత్వం ఎవ్వరిది..?
ఊహించనివో, ముందు తెలుసుకున్నవో
అపాయలన్నీ తోటివారి
మస్థిష్కానికి చిగురించే తలపులే కదా..
అందుకే
భ్రమింపచేసే నవ్వుల ముసుగుల చాటున
మాలిన్యాల మనసును దాచి సంచరించే
మనిషే ఓ నిలువెత్తు ప్రమాదం..!!
