జనులారా తెలుసుకొనురి..

(అంశం:” ప్రమాదం”)

జనులారా తెలుసుకొనురి..

రచన::రమణ వి.వి

అధిక జనులతో
అవని తల్లి రోదిస్తోందిప్పుడు
అక్షరాస్యత అగమ్యగోచరమై
నిరక్షరాస్యత పరిఢమిల్లుతున్న వేళ
బాల్య వివాహాలే
భారమవుతాయి దేశాభివృద్ధికి!

అధిక సంతానానికి ఆశపడితే
జన గణాంకాలు పెరిగి
కనీస అవసరాలు కానరాక
ఆహార కొరతతో అల్లాడుతూ
నిరుద్యోగం నేర ప్రవృత్తిగా మారి
దారిద్ర్యం పురుడు పోసుకుంటే
కుటుంబ నియంత్రణకు నీళ్ళొదిలేసిన
తప్పిదం మనదే కదా!

జనులారా తెలుసుకొనురి…
ఏ దేశ ప్రగతికైనా
అధిక జనాభానే అవరోధం
నివురుగప్పిన భయంకర ప్రమాదం!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!