ఆయుధాలు ధరిద్దాం..!

ఆయుధాలు ధరిద్దాం..!

రచన: లోడె రాములు

మనలో అజ్ఞాతవాసం చేస్తున్న ఆయుధాలను బయటకు తీద్దాం
ఆ ఆయుధాలను ధరించకపోతే మనం అందరికీ రాక్షసుల్లా, భూతాల్లా, రౌడీల్లా అగుపిస్తాం..
తెలిసో తెలియకో అజ్ఞానం వల్లనో
ఇప్పటికీ వాటిని వాడకపోతే వెంటనే వాడుదాం..
మహాభారతంలో జమ్మిచెట్టు మీదున్న ఆయుధాల్ని దసరా రోజే పాండవులు ధరించారు..
అప్పటి దాకా బృహన్నాలగా ఉన్న అర్జునుడు గాండీవాన్ని ధరించి
ఉత్తర గోగ్రహణంలో కౌరవుల్ని చిత్తుచేశాడు..
విజయం కోసమే ఆయుధ పూజలు
ఏ వృత్తి చేసే వాళ్ళైనా మన జీవనాధారమైన పనిముట్లకు కృతజ్ఞతగా మొక్కడం సంప్రదాయం
బయటికి కనిపించే ఆయుధాలే కాదు
మనలో కూడా అంతర్గతంగా ఆయుధాలు ఎన్నో ఉన్నాయి
వాటిని ధరిద్దాం..మనలో శక్తిని నింపుకుందాం
సహనం, అణకువ, ప్రేమ, కరుణ, సత్యం ఇవి పంచ పాండవుల్లాంటి ఆయుధాలు
ఇవి దగ్గరుంటే అందరి
ఆత్మీయతను గెలవవచ్చు మనం
మన పై మనమే సాధించవచ్చు విజయం..
సర్వే జనా సుఖినోభవంతు.. కోరుకుందాం..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!