వివాహబంధం

వివాహబంధం

రచన: సుశీల రమేష్

అన్ని బంధాలలోకి ప్రాముఖ్యమైనది వివాహ బంధం.

పరిచయం లేని ఇద్దరి జీవితాలను ముడి వేస్తుంది వివాహ బంధం.

అప్పటివరకు జీవితం అంటే ఏంటో తెలియని నాకు

అసలు ప్రేమ అంటూ ఒకటి ఉందా అని తెలియని నాకు

ఆటపాటలతో అల్లరి కోయిల లా పాటలు పాడుతూ తిరిగిన నాకు

వివాహమన్నది జీవిత ఖైదు అనుకున్న నాకు

నా జీవితం ఇంతటితో ముగిసింది అనుకున్న నాకు

తాళిని కట్టి ఆలిని చేసుకుని, అన్ని సమయాలలో,

నీ తోడుగా ఉంటానని ప్రమాణం చేసి,

పసిపాప లాంటి నా పంతాన్ని నీ నిస్వార్ధ ప్రేమతో,

నన్ను నీ వైపు కు ఆకర్షించి

నా ఆనంద సమయంలో సంతోషమై

నా దుఃఖం లో ఓదార్పు వై

నీ సహనంతో శిలలాంటి

నన్ను ప్రేమ దేవతగా

మలచినా నీ తోడు ఏ దేవుని వరమో!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!