అలుపెరుగని పోరాట యోధులు

అలుపెరుగని పోరాట యోధులు

రచన: దొడ్డపనేని శ్రీ విద్య

ఉక్కు మనిషి  వల్లభాయ్ పటేల్ గారు
భారత దేశ సమగ్రతకు
మార్గ నిర్దేశం చేసినవారు

సమైక్య మంత్రమే జపించినారు

దృఢ సంకల్పం తో ఎదిగిన  వీరులు వీరు
సంస్థనాల విలీనం లో ఉక్కు సంకల్పం వీరిది

నిజాలను నిర్లక్ష్యం చేయొద్దన్నారు

ఉప ప్రధాని అయిన బర్దోళీ  వీరులు
గొప్ప స్వాతంత్ర్య సమర యోధులు

ప్రజలంతా ఒక్క తాటి పై నిలవాలని సూచించిన కిసాన్ వీరులు
బ్రిటీష్ పాలకుల అణిచి వేతకు  వ్యతిరేకంగా ఉద్యమించారు

అలు పెరగని పోరాట యోధులు
సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన ధృడ చిత్తులు

భరత మాతకు ప్రాణం ఇచ్చిన మహనీయులు

నిజాం పాలనకు చరమగీతం పాడారు

శాంతి భద్రతలను పరిరక్షించి లౌకిక దేశాన్ని పునర్నిర్మించారు

దేశానికి ఎన్నో సేవలు అందించిన నాయకులు

స్వతంత్ర్య భారతావనిని ఏకం చేసిన ధీశాలి

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్  మన అందరికీ ఎంతో  ఆదర్శప్రాయు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!