ప్రేమామృత పారవశ్యంలో!!

ప్రేమామృత పారవశ్యంలో!!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కొత్తపల్లి ఉదయబాబు

ఏ అమృత క్షణం రెండుచూపుల /
సంగమానికి బీజం వేసిందో…/
శ్వేతవర్ణపు హృదయంపై/
నీ ఆకృతి అప్రయత్న ముద్రితమైంది./
దూరం తరిగి సమీపిస్తున్నావన్న భావన/
దీర్ఘ ఉచ్వ్వాస నిశ్వాసాల వేగానికి/
ఆజ్యంపోస్తూ గాలి సహకరించిన వేళ../
ఏదో తెలియని ఉద్విగ్నతకు/
రొమాంచిత తనువులో
ప్రకంపనల సరోవరం/ ఆద్యంతమూ
అదురుతున్న ఆధారాల/ కదలికలలో
అస్పష్ట శబ్దాలమధ్య/ అల్లాడుతున్న
పదాలతో నిన్ను/ పిలవాలన్న తపన
అంతలో నన్ను తాకిన నీ స్పర్శ/
ఉత్తుంగతరంగమై ఆవహించిన అనుభూతి/
ఆ తమకపు మమేకంలో/ నీలో
నన్ను దాచుకుంటూ నేను/
యుగాల పర్యంతమూ
ప్రేమవాహినిలో!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!