గతి ఎరిగిన మనిషి

గతి ఎరిగిన మనిషి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బండారు బాజీబాబు

ఆ మనిషి మనసు సముద్రం
నదుల ప్రవహంలా కలిసే ఆలోచనలు
ఎగసిపడే అలలా ఆవేశం
మారిపోని ఉప్పతనంలా గుణం
ఆటుపోట్లులా గమ్యం
వాయుగుండంలా గండం
వర్షంలా పడే వ్యవస్థల ప్రభావం
లోతుకు పోతే తెలిసే అద్భుతం
అయిన ఆ మనిషి మనసు సముద్రం
దగ్గరగా చూడరే
దూరంగా ఉన్న నీడనే చూస్తారే
ఓ మనిషి నీలో ఉన్న మనసుతో చూడు
ఆ మనిషిని….
నిర్లిప్తంగా ఉన్న ఆ మనిషిని
క్లుప్తంగా అర్థంచేసుకో
ప్రశ్నగా కాదు సమాధానంగా ఉన్న
ఆ మనిషిని.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!