భయంతో ప్రయాణం

కథ అంశం: మిరాకిల్స్
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

భయంతో ప్రయాణం

రచన: వి వి పద్మనాభ రావు

అది 1982 సంవత్సరం అంటే నాకు పన్నెండేళ్ళ వయసు. చైత్ర మాసం. ప్రయాణ సౌకర్యాలు, వార్త సాధనాలు కూడా సరిగ్గా లేని రోజులు. అందులోనూ మాది కోనసీమలో వానపల్లి అనే ఒక గ్రామం. మేము మా తాతగారి అన్నదమ్ములు, వారి పిల్లలు అంతా కలిసి ఒక పెద్ద ఇంట్లో ఉండే వాళ్ళం. అంతా విడిగా ఉండే ఓ ఉమ్మడి కుటుంబం. అంతా సమిష్టి గా ఉండే ఎవరి వాటాలు వారివి. రోజూ పండుగ వాతావరణమే మాకు. ఎప్పుడూ పిల్లా పాపలు అంతా కలిసి ముప్పై మంది పైగానే ఉండే వాళ్ళం.
పెళ్ళిళ్ళు, ఇతర కార్యాలకు వెళ్లాలంటే మాకు ఎడ్ల బండ్లే రవాణా సదుపాయం. రోడ్లు కూడా అంతంత మాత్రంగానే ఉండేవి. మా తాత గారి అన్నదమ్ములు ఐదుగురులో ముగ్గురు ఇక్కడే ఉండేవారు. ఒకరు దొడ్డవరం అని అమలాపురం దగ్గర బోడశకుర్రు గోదావరి రేవు దాటి ఆవలి వైపు అక్కడ ఉండేవారు, వారి పిల్లలతో. మాకు దసరా, సంక్రాంతి లేదా వేసవి సెలవులకు అక్కడకే వెళ్ళే అలవాటు. అదీ కాక మాకు అక్కడ, మా ఇలవేల్పు అయినా శ్రీ వేంకటేశ్వర స్వామి సమేత శ్రీదేవి, అలిమేలు మంగ దేవాలయం ఉంది. మా తాత గారి ఇంటి ఆవరణలోనే గుడి. ప్రతి ఏటా శ్రీరామ నవమి తరువాత దశమి నాటి రాత్రి వార్షిక కళ్యాణం, తీర్థం తో ఉత్సవాలు నిర్వహించడం మాకు ఆనవాయితీ. ఇప్పటికీ మేము అదే సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తున్నాం.
ఎక్కడెక్కడ నివాసమున్న వారైనా ఆ సమయంలో తప్పకుండా కలిసే నియమం తో ఆ దేవుని ఆశీస్సుల తో మేమంతా ఉంటాం. ఇప్పుడైతే కార్లు, బస్సులు వగైరా రవాణా మార్గాలు ఉన్నాయి, రోడ్లు అవీ వచ్చాయి. గోదావరి నదికి వంతెన కూడా నిర్మించడం జరిగింది. కానీ ఇందాక చెప్పినట్టు ఆ రోజుల్లో అంటే మా చిన్నతనంలో మా ఊరి నుంచి బోడశకుర్రు దాకా బండి మీద రావడం రేవు దాటాక నడక దారిన వెళ్ళడం లేదా అక్కడ మరో బండి మీద వెళ్ళడం మా సహజమైన ప్రయాణం. మనకి తెలుసు కదా సాయంత్రం సూర్యాస్తమయం అయితే ఇక అక్కడ ఎవరూ నడిచే వారు కాదు. పొలం పనులు ముగించుకుని ఇళ్ళకి చేరి విశ్రమించడమే. ఇంకా అప్పట్లో కరెంటు సౌకర్యం కూడా లేదు.
ఇలాంటి ప్రయాణంలో ఒకసారి మా బాబాయి, పెదనాన్నలు అందరూ ఈ ఉత్సవం కోసం ముందే ఆ ఊరికి చేరుకున్నారు. మాకు పరీక్షలు ఉండడంతో స్కూల్ అయ్యాకా నేను, వరుసకి తమ్ముడు, అన్న అయిన ముగ్గురం ఆలస్యంగా బయలు దేరాం. మాలో పెద్ద వాడు అన్న, వాడి వయసు అప్పుడు 18 ఏళ్ళు. సైకిల్ పై గోదావరి రేవుకు చేరే సరికి చాలా ఆలస్యం అయింది. రేవు దాటడానికి ఆఖరి పడవ బయలు దేరుతుండగా వచ్చాం. సైకిల్ ని అక్కడ సైకిల్ స్టాండులో పెట్టి పడవ ఎక్కి రేవు దాటాం. అప్పటికే బాగా చీకటి పడింది. పడవలో మేము కాక ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వారు దిగాక ఎవరి తోవన వారు వెళ్లిపోయారు. మేము ముగ్గురం నడక ప్రారంభించాము. అసలే చీకటి, పైగా అవన్నీ రహదారులు సరిగ్గా లేని ప్రాంతం. కొబ్బరి తోటల గుండా వెళితే తొందరగా చేరవచ్చని అలా బయలు దేరాం. అంతా చీకటి, మనుష్య సంచారం లేదు. కుక్కలు, విష సర్పాల భయం. చెప్పాలంటేనే ఎంతో భయం ఆ పై చిన్న వయసు. అప్పుడు దారి తప్పాం మేము. ఇక చూడండి ఎంత తిరిగినా ఎటు తిరిగినా ఏమీ కనిపించదు, దారి చెప్పే వారు ఎవరూ కనరారు. ఇక మొదలైంది మాలో ఆందోళన. అలా అటూ ఇటూ నడుస్తూనే ఉన్నాం. చిమ్మ చీకటి ప్రయాణం. ఇక మా దైవం ఆ వేంకటేశ్వర స్వామి మీద భారం వేసి వేడుకుంటూ ఉన్నాం. ఎలాగా అని భయమే భయం. మామూలుగా అయితే ఓ పదిహేను ఇరవై నిమిషాల నడక. అప్పటికే గంటన్నర పైగా తిరుగుతూనే ఉన్నాం. ఏ దారి లేని దీనులకు భగవంతుడే దిక్కు అని అలా అటూ ఇటూ చూస్తుండగా ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు ఓ రైతు వచ్చి మా పరిస్తితి గమనించి రోడ్డు దాకా దారి చూపించి వెళ్లి పోయాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ మెల్లిగా మా తాతగారి ఇంటికి చేరుకున్నాము. హమ్మయ్య అనుకుంటూ. జరిగినదంతా విని మా పెద్దవాళ్ళు అంతా ఊపిరి పీల్చుకుని మా స్వామియే మాకు దారి చూపించాడని పరి పరి విధాల స్తుతించారు. అప్పటికి అర్ధరాత్రి కావడంతో యధావిధిగా స్వామి వారి కళ్యాణం, పూజాధికాలు మొదలు అయ్యాయి. ఇక్కడ మేము ఎప్పుడూ కళ్యాణం చేసేది రాత్రి ఈ సమయంలోనే.
చదివారు కదా ఇదండీ మా భయంతో కూడిన ప్రయాణం. స్వానుభవము. ఇప్పటికీ ఎప్పుడు ఆ ఊరు వెళ్ళినా ఓ సారి ఈ సంఘటన మదిలో మెదులుతుంది.
—–

You May Also Like

71 thoughts on “భయంతో ప్రయాణం

  1. Naa katha “Bhayam thoo Prayanam” ku mii amulyamaina comments ichhina andarikii peru perunaa dhanyavadaalu.
    Post Cheesina Admin Team ki naa krutajnatalu.

  2. మీ స్వానుభవ ప్రయాణం వేరొకరికి ప్రేరణ

  3. Chala sulabha saili lo andhari ki ardham ayye reethilo, entho chakkaga rachayita akattukunevidham ga, chinna nati anubhavanni entho chakkaga kadha rupam lo andhincharu. Ilanti enno kadhalu maku andhinchalani asistunnanu.

  4. చాలా సంఘటనలు ఉన్నాయి స్వామి అనుగ్రహం చాలా ఉంది బాగా raasaavu

  5. చాలా బాగుంది. మీ కథనం దృశ్యరూపంగా కళ్ళకు కట్టినట్లు ఉంది.

  6. చాలా బాగుంది సహజంగా ఉన్న కధ లో సరళoగా ఉన్న పదాలతో చాలా బాగుంది 👌👌👌👌

  7. చాలా సహజంగా ఉన్న కథ లో సరళoగా ఉన్న పదాలతో చాలా బాగుంది👌👌👌

  8. చిన్ననాటి జ్ఞాపకం.. అదో భయానక అనుభవం.. దేవుడి మీద పెంచిన నమ్మకం.. దైవమే దీపమై దారి చూపిన వైనం.. ఒక మంచి కథాంశంగా కూర్చిన మీ నైపుణ్యం.. చదివే అవకాశం కలగడం తెలుగు భాషా ప్రియులకి ఆనంద దాయకం

  9. మమ్మల్ని కూడా భయపెట్టారు కదండీ బాబూ

    గోవిందాయ నమః

  10. మీతో మేమూ ప్రయాణం చేసి భయపడ్డాం. . శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం వల్ల. చాలా బాగా వ్రాసారు

  11. Super nice ..meeru chadivinanduku maku kuda chinnanati gnyapakalu gurthostunnai

    Ma ammavaru kuda maku nidarsanam chupistaru

  12. చిన్ననాటి జ్ఞాపకం …ఆవయసులో భయంకరమైనదే ….ఇప్పుడొక తీపి కథ…చాలా బాగుంది …

  13. జ్ఞాపకాల పుస్తకంలో ఒక పేజీ,
    రచనా శైలి బాగుంది

  14. బావుంది చెప్పేవిదానం- చదవాలనిచివరిదాకా అనిపిస్తోంది – అదే రైటర్ కువుండేలక్షణం

  15. కథ కూర్చిన విధానం బాగుంది.ఒక మరపు రాని చిన్ననాటి జ్ఞాపకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!