ఎందుకని?

(అంశం:” ప్రమాదం”)

ఎందుకని?

రచన::జయ

నీ కనులలో కనిపించే వెలుగు నిజంకాదు.
నీ పెదవి అంచులో కనిపించే నవ్వు నిజంకాదు.

అసలు నేను చూసిన నువ్వు.
నువ్వు కాదు ఎందుకని?

నీ కనుల వెనుక తీరని ఆవేదన.
నీ పెదవులు చిందించిన నవ్వులో
నీ మాటలో..
నీ అక్షరాల్లో..
నీ ప్రతికదిలిక లో
మనస్సు ముక్కలైన ఆనవాళ్ళు.
ఎందుకని?

నాకు తెలుసు నీ నుంచి సమాధానం రాదు అని.

నీకు ఏమి కానీ నేను.
నాకు అన్ని నీవే అని
నీలో  అనువంత నిరాశ అయినా
నా మనసుకు అది కొండంత బాధ.
అది నీకు తెలుసా.

ప్రమాదం అంటే అందరు
వంటికి అయిన గాయాన్నే చూస్తారు.
మనస్సు కు అయిన గాయాన్ని
చూడరు ఎందుకని?

వంటికి అయిన గాయం
కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది.
మరి మనస్సుకు అయిన గాయం
మన తుది శ్వాస వరకు మనతో ఉంటుంది.

అది నాకు తెలుసు.!

కానీ ఒక విషయం.

ప్రతి గాయానికి మందు ఉంటుంది.
అలాగే మది గాయానికి మందు ప్రేమ.
అది తెలుసుకో.
నిన్ను కాదు అన్న ప్రేమ కోసం.
నిన్ను కోరి వచ్చిన ప్రేమను
కాదు అనుకోవడం కూడా ఒక ప్రమాదమే.
అది తెలుసుకో మనసా.
*********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!