స్వాధీనపతిక

(అంశం: ” పెంకి పెళ్ళాం”)

స్వాధీనపతిక

రచన :: పొర్లవేణుగోపాలరావు

porlavenugopalara

మూడుముళ్లుపడినరోజే మూడు నాది మార్చివేసె
తనదు వలపుగాలములో చేపలాగ చిక్కిపోతి..

పెదవి విప్పుదామంటే తనపెదవితోతాళమేయు
అడుగుబయట పెట్టనీదు నడకతోనే నాట్యమాడు..

అర్ధరాత్రి తిరుగుడంతా అతివరాకతో ఆగిపోయే
రెండోయాట సినిమాలు రమణివలన రద్దుయాయే..

అమ్మ నాన్న కట్టుబాట్లు హాలువరకె పరిమితము
ఆడపడుచు,మరిది మనసు లామెకెంతో యవగతము…

మతిపోయే అందం.. మకరందపు చందం
విడివడని బంధం..విరిసిన అరవిందం..

వంటయింటి వైనమంత తానె చక్కబెట్టునంట..
ఒక్కదినుసు తక్కువైన తగవులేక పెట్టుమంట..

అత్తమామ దైవమనుచు వంగివంగి దండమెట్టు..
అలగకుండ కసరకుండ అన్నపానమయితే ఒట్టు..

సరసమైన విరసమైన తానె తొలుత మొదలుపెట్టు..
గోలకాని..గొడవకాని.. గతముచదువు గొలుసుకట్టు…

ఇరుగుపొరుగు చెంతచేర ఇనుపపెట్టె నింటిగుట్టు
పడకగదిన పతినిగూడ పరువమంత ఒలిచిపెట్టు…

నాపెళ్లాం కాదపుడు పెంకి! నండూరి వారి ఎంకి!!

You May Also Like

One thought on “స్వాధీనపతిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!