తీరం చేసిన గాయం

తీరం చేసిన గాయం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన :⁠ మాధవి కాళ్ల

ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు కానీ
కొన్ని పరిస్థితులు మనల్ని మార్చేస్తాయి
ఆ పరిస్థితులకి తగ్గట్టుగా మనం మెలగాలి
తప్పించి కాలాన్ని తిట్టకూడదు
నేను చేరే గమ్యానికి మెట్లు
వేసుకుంటూ వెళ్తున్నాను
ఆ గమ్యంలో నాకు తీరం చేసిన
గాయాలు ఎన్నో ఉన్నాయి
ఆ గాయాలను తట్టుకుంటూ ఆ గమ్యాన్ని చేరాలని నా ప్రయత్నం ఫలించాలని ఆరాటపడుతున్నాను.
మన మీద మనకి నమ్మకం ఉంటే ఏ గమ్యమైనా ఎంత దూరంలో ఉన్నా సాధించగలం
అనే నమ్మకం ఉంటే చాలు
ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ సాధించాలనే పట్టు ఉంటే నీ ధైర్యం నీకు ఎల్లప్పుడూ
తోడుగా ఉంటుంది
మన అనే వాళ్ళు మన పైన నమ్మకంతో ఉంటే ఆ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయకూడదు
సముద్రంలో ఎన్నో కెరటాలు వస్తూ ఉంటాయి
ఆ కెరటంలో కొన్ని మాత్రమే తీరం దాటుతాయి తీరం దాటిన గమ్యాలు ఎన్నో
తీరం చేసిన గాయాలు మరెన్నో

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!