సత్యోక్తుల సమాహారం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: కొల్లూరు వెంకటరమణమూర్తి
నీ కోసం పరితపించే నా ఆరాధనే భక్తి
నీ సహచర్యానికై నేను చేసెటిది యుక్తి
నీ సన్నిధిలో దొరికిన ఉత్సాహమే శక్తి
నీ సాంగత్యంలో కలుగును నాకు రక్తి
నీ అనుభూతులు మిగిలించును భుక్తి
నీ తలంపులేనిదే కలగదు నాకు ముక్తి
నీ యెడబాటు కలిగిస్తాది నాకు విరక్తి
నీ మందహాసానికై నేను చేసేది ఛలోక్తి
నీ మెప్పునకై నేను పన్నేదిలేదు కుయుక్తి
నీ కోసమే నేను జీవించడమనేది లోకోక్తి
నీ నుండి పొందకూడదెపుడూ విముక్తి
నీ అనుగ్రహం కలిగిస్తాది నాకు అనురక్తి