గుడిమెట్టే ఆధారం

గుడిమెట్టే ఆధారం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : కందర్ప మూర్తి

                గుడిమెట్టే ఆధారం నగరంలో పెద్దమ్మ గుడి పెద్ద మెట్టు కాడ కూకునే బిక్షగాడు సైదులు బ్యాంకులో బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇంటి రుణాలకు డబ్బు ఇస్తున్నారని తెలిసి పేరున్న ప్రభుత్వ బ్యాంకు కొచ్చి మానేజర్ని కలిసాడు. బిక్షగాడు సైదులు వాలకం చూసి బ్యాంక్ మానేజర్ “నువ్వు ఇల్లు ఎలాకడతావు? ఆధార్ కార్డు, రుణానికి హామీ ఉందా?” ప్రశ్నల వర్షం కురిపించారు. వెంటనే సైదులు తన భుజాని కున్న గుడ్డ సంచిలోంచి ఇంటి రిజిస్టర్డు డాక్యుమెంట్లు తీసి “సారూ, ఇదిగో నానుంటున్న ఇంటి కాయితాలు, ఆధార్ కార్డు, తెల్ల రేషనుకార్డు.
ఇప్పుడు ఈ ఇంటి పైన మరో మిద్ది కట్టి కిరాయి కివ్వాల నుంది. తమరు ఋణం డబ్బులు ఇప్పిస్తే పని మొదలెడతా. నాను చిన్నగా ఉన్నప్పుడు మా నాయన పెద్దమ్మ గుడి పెద్ద మెట్టు కాడ కూకుని వచ్చిన పైసలు కిస్తీ(వడ్డీ)ల కిచ్చి ఆ డబ్బుతో బస్తీలో గుడిసె తీసి డాబా కట్టించిండు.
మా అమ్మ ముసిల్ది గుడి కాడ పువ్వులు, టెంకాయలు అమ్మి ఇల్లు గడుపుతాది. నాయన సచ్చి పోయినాక నాను పెద్దమ్మ తల్లి పెద్ద మెట్టు. కాడ కూకుని ఇంటికి కరెంటూ పంకాలు ఏయించినా.” తన స్లాబ్ ఇంటి కథ ఏకరువు పెట్టేడు బిక్షాటన చేసే సైదులు. ఇంటి స్థలం డాక్యుమెంట్లు మా ఆఫీసర్లు తనిఖీ చేసిన తర్వాత బ్యాంకు ఋణం ఇచ్చే విషయం తెలియ చేస్తామని చెప్పి పంపేసారు బ్యాంకు మానేజరు.
మీరే నయం, చీకూ చింతా లేని బతుకులు. ఉన్నదాంతో తృప్తి పడతారు. మాలాంటి ఉధ్యోగస్థులం ఒత్తిళ్లు ఆందోళన భయంతో జీవితాలు గడుపుతున్నాం.’ అని మనసుల అనుకున్నారు మానేజర్.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!