ఆఖరి మజిలి (సంక్రాంతి కథల పోటీ)

ఆఖరి మజిలి
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ – 2022)

రచన: తాడూరి సుమతి

కదిలే కాలమ కాసేపు ఆగవమ్మ, జరిగే వేడుక కళ్లారా చూడవమ్మా, పెగే కదలగ, శ్రీమంతమాయనే ప్రేమ దేవతకు.
అనే పాట వింటూ, పాడుకుంటు, అప్పుడే కాలేజీ బస్సు దిగి వస్తుంది, రాధిక. రాధికాకి పాటలంటే చాలా ఇష్టం.
కళ్ళలో నీరు, నిరాశతో, తెలియని బాధ గూడు చెదిరిన పక్షిల, రోడ్డు పక్కనే కూర్చోని ఉంది ఆరు పదులున్న ఒక ఆవిడ, వేంటనే సాంగ్స్ ఆపేసి, ఎయిర్ ఫోన్స్, తీసేసి ఆవిడ దగ్గరికి వెళ్ళింది.
అమ్మా… ఎటు వెళ్ళాలి నువ్వు, ఇక్కడేందుకు కూర్చున్నావు. ఎందుకు ఆలా ఉన్నావు, ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా! అని రాధిక అడగానే…
లేదమ్మ, నాకు అందరూ ఉన్నారు కానీ నాకోసం ఎవరు రారు, నాకు నలుగురు పిల్లలు, ఇద్దరూ కొడుకులు, ఇద్దరూ బిడ్డలు, అందరికి పెళ్లిలు అయ్యాయి, పట్నంలో ఉంటున్నారు, నేను మా ముసలోడు ఇక్కడే ఉంటున్నాము, కానీ మా ముసలోడు బాగా తాగి నన్ను కొట్టి వెళ్లగొట్టాడు అమ్మ, అందుకే ఇక్కడ కూర్చున్న. ఈ ముసలితనములో, బుక్కెడు తిని, ఉండక, ఈ గొడవలేంటి అని చచ్చిపోవాలని ఉందమ్మా అంటూ ఏడ్చింది రాజమ్మ.
ఊరుకోమ్మ ఏడవకు, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు నేను మాట్లాడతాను, తాతతో అంది రాధిక.
సరే అమ్మా అంటూ రాధికని ఇంటికి తీసుకెళ్ళింది రాజమ్మ.
**********
ఒసే రాజమ్మ, ఎక్కడికెళ్ళావే, నేనేదో కోపములో ఇంట్లోనుంచి, పో అంటే నిజముగానే ఎల్లిపోతావా! నువ్వు లేకపోతే, ఈ ముసలి ప్రాణం ఉంటుందా అని ఏడ్చుకుంటూ, వచ్చాడు రాజమ్మ భర్త.
చూసావా అమ్మా, తాతకి నువ్వంటే ఎంత ప్రేమ, అని రాధిక అనగానే అవునమ్మా అంది రాజమ్మ.
అవును తాత నీకు అమ్మమ్మ అంటే అంత ప్రేమ ఉన్నపుడు తనని ఎందుకు కొడతావు!అని రాధిక అడిగింది.
అది కదమ్మా నేను మాట్లాడే ప్రతి మాటకి అడ్డముగా మాట్లాడుతుంది, దాంతో నాకు కోపం వచ్చి కొడతాను, ఇంకా తాగుడు అంటావా, పిల్లలు గుర్తొచ్చి బాధతో తాగుతాను, దాని కొట్టి నేనే దాని కన్న ఎక్కువ బాధ పడతాను.. అని తాత చెప్పగానే
మరి మీ ఇద్దరూ ఇక్కడ ఒంటరిగా ఉండపోతే మీ పిల్లల దగ్గరకు ఉండొచ్చు కదా!అంది రాధిక.
లేదమ్మా ఆ సిటీ పల్లెటూరులో అలవాటైనా మా ప్రాణాలు, ఆ సిటీ లో ఉండలేము, ఇంట్లోనుండి బయట్టు వెళ్లొద్దు, ఎవరు మాట్లాడరు, పొద్దంత తలుపులు వేసుకొని, ఉండాలి, అక్కడ ఉంటే మాకు జైల్లో పెట్టినట్టే ఉంటుంది, అయినా ఈ పచ్చని చెట్ల గాలికి అలవాటైనా, మేము ఆ ఏసీ గాలిలో ఉండలేము, చేతనైనా, కాకపోయినా ఇక్కడే బుక్కెడు ఓండుకొని తింటేనే మాకు తృప్తిగా ఉంటుంది.
ఇంకా మా పిల్లలు అంటావా, వాళ్ళ ఉద్యోగాలు, పిల్లల చదువులు , వదిలేసి వాళ్ళు ఇక్కడ ఉండలేరు, వాళ్ళు అక్కడే, మేము ఇక్కడే, మా ముసలి బతుకులు ఇంతే అమ్మ అన్నాడు తాత.
అవును తాత, ఇంత తెలిసిన నీకు, మరి అమ్మమ్మ ను ఎందుకు బాధ పెడతావు, రెక్కలు వచ్చిన పక్షులు గూడు వదిలి పోయినట్టు, పిల్లలు పెద్దయి, పెళ్లిలు అయ్యాక అమ్మ, నాన్నలను వదిలేసి దూరముగా వెళ్తారు, ఇక ఉండేది రెండు ముసలి పక్షులే, అంటే మీరే, యవ్వనంలోంచి ముసలి దశకు వచ్చాక , పిల్లలు, అమ్మ నాన్నలు ఇలా ఎవరూ తోడుండరు,భార్యభర్తలు, మాత్రమే ఒకరికొకరు ఐచ్చికముగా ఉండాలి, అప్పుడే పిల్లలు లేరన్న బాధ మర్చిపోయి సంతోషముగా ఉంటారు.
ఒక మనిషి పుట్టగానే, అమ్మ నాన్న, అక్క చెల్లి, పిల్లలు ఎన్నో బంధాలు వస్తాయి కానీ, ఆ బంధాలన్నీ మధ్యలోనే దూరమౌతాయి, ఒక్క, భార్య, భర్త, బంధం తప్ప, అందుకే ఈ ఆఖరి మజిలీలో మీకు మీరే తోడుగా ఉండాలి, అని రాధిక చెప్పగానే..
అవునమ్మా నువ్వు చెప్పింది, నిజం ఇంకెప్పుడు, నా భార్యను కొట్టను, బాధపెట్టను అని రాజమ్మను దగ్గరికి తీసుకున్నాడు.
చావాలనుకున్న నన్ను, తీసుకొచ్చి నా భర్తని మార్చి, నా కళ్ళు తెరిపించావు ఇంతకీ ఎవరమ్మా నువ్వు అని అడిగింది రాజమ్మ.
నా పేరు రాధిక, నేను హోల్డజిహోమ్ లో, అంటే పిల్లలు వెళ్లగొట్టిన, తల్లితండ్రులు, ఏ దిక్కు లేని ముసలివాళ్ళు వుండే ఇల్లు అన్నట్టు, నేను అక్కడే పని చేస్తుంటాను, అని చెప్పి వెళ్ళిపోయింది రాధిక..

*****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!