హాస్యానందం

హాస్యానందం

రచన: దొడ్డపనేని శ్రీ విద్య

నవ్వడం ఒక భోగం
నవ్వించటం ఒక యోగం
నవ్వలేక పోవటం ఓ రోగం
అన్నట్లుగా

నవ్వు నాలుగు విధాలుగా లాభం
హాస్యం ఓ ఆనందకర హృదయభావం

శృతి మించితే అది వెటకారం
హద్దుల్లో ఉండాలి హాస్యం
అప్పుడే అందరికీ ఆరోగ్యదాయకం

హాస్యం లో సమయస్పూర్తి అవసరం
భావాన్ని వ్యక్త పరిచే సమయం

ఆహ్లాదకరం కావాలి అనునిత్యం
బాధల్లోంచి బయట పడే సాధనం

నాయకత్వం లో ఉండాలి హాస్య చతురత్వం
అదే అందరూ ఇష్టపడే అంశం

జీవితంలో ప్రధానమైనది హస్యానుభవం
సాహిత్యంలోను పండించాలి హాస్యరసం

వినోదం తో కూడిన దృక్పధం అవసరం
ఎదుటి వారిని కించపరిచేలా హాస్యమాడితే
అది అవుతుంది అపహాస్యం

You May Also Like

One thought on “హాస్యానందం

  1. నిజం నవ్వటమే ఆరోగ్యమ్
    ఆనందం
    👌👌👌👌👍✒️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!