సమాజం మారాలి 

సమాజం మారాలి 
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత కోకిల.

మానవత్వం మరిచి మృగంలా మారుతూ
కట్టుబాట్లను మరిచి విలువలను మర్చిపోయి
మృగంలా సమాజంలో బ్రతుకుతూ
ఏమి సాధిస్తావని
సమాజంలో ఉన్నామని మర్చిపోయి కట్టుబాట్లను విడిచి నువ్వు ఒక తల్లి కడుపులోనే పుట్టావని తెలిసి ఇలా ప్రవర్తించావెే నీకు సమంజసంగా ఉందా మానవత్వమే లేని నువ్వు
ఈ ఆక్రందన ఏం వింటావు
ముక్కుపచ్చలారని పసికందులు ఏమి చేశారని
ఎందుకా వారికి ఈ శిక్ష ఓ దేవుడా నీవు ఉన్నావా
ఆ తల్లిదండ్రుల ఆవేదన బాధ వినేది ఎవరు
అభంశుభం తెలియని పిల్లలపై
ఎందుకురా ! ఈ దుర్బుద్ధి
రక్షకులే భక్షకులైతే కాపాడేది ఎవరు సమాజ విలువ ఏంటి మానవత్వం లేని మృగాలను శిక్షించాలి
తప్పు చేసిన వారికి రక్షణ ఏమీ చేయని వారికి శిక్ష
యుగ యుగాలనుండి నుండి ఇదే సమాజం
సమాజంలో బ్రతుకుతున్నామని తెలుసుకోండి
మీరు మృగాలకు రక్షణగా ఉండి
వినోదం చూస్తున్నారు
ఆ మృగాలను సమాజానికి అప్పగించండి?
ఆ సమాజమే చూసుకుంటుంది
ఒక తల్లి ఆవేదన
రక్షతో రక్షితః మనం మారాలి
సమాజాన్ని మార్చాలి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!