గురుభ్యోనమః

గురుభ్యోనమః

రచయిత :: రాజ్

భాస్కరుని నులి వెచ్చని చూపులతో..
చలించిన మా మది గదిలో…

గుడి లాంటి….
బడి గంట మృోగించి
ప్రార్ధన వినిపించి
దేశభక్తి ని మాలో పెంచి

పీరియడ్ మొదలైంది..మొదలు
మాకై ఆలోచించి..
మా బాగును ఆశించి..
మా బాధను ఆలకించి

మాకై శ్రమించి…
మా టాలెంట్ ను గుర్తించి
మమ్ముత్సాహ పరచి…
అవసరార్థం దండించి
మాలో పట్టుదల పెంచి

ముందుగా మీరాచరించి
మమ్మెంతగానో ప్రేమించి
బుర్రకెక్కే వరకు బోధించి

మా తల్లిదండ్రులను మించి…
మా భవిష్యత్ కోసం శోధించి
మంచి దారి చూపించి…

విశ్రమించక…అలుపెరుగక..
విసుగు చెందక..విద్యా దానం చేస్తూ
ఇంకెందరికో దిక్సూచి అవుతున్న…

ఓ…గురువర్యా…
నీకు సాటి లేరయ్యా…

నీవు లేని సమాజం…
తోక తెగిన గాలిపటం లా..
పల్టీలు కొడుతూ…
ముళ్ల పొదల్లో చిక్కు కొని…
చిరిగి పోతుంది..

భవన నిర్మాణానికి…
కావాల్సిన..బలమైన ఇటుకుల్లా..
సమాజ నిర్మాణానికి…
కావాల్సిన దృఢమైన..
యువత మదిని..
ఆశలతో కాల్చి
మెదడును..ఆలోచనలతో రగిలించి
తనువును విల్లు లా…వంచి…

జ్ఞానం..
మానవత్వం..
నైతిక తత్వం
ప్రేమ తత్వం..
అనే…అత్యద్భుత అస్త్రాలను
యువత అమ్ముల పొదలో…
నింపుతున్న….నీ రూపం
నాకే…కాదు..
సమాజ స్థితగతులకు ప్రతి రూపం
మానవ జీవన గతికి బ్రహ్మ రూపం

అందుకే… అందుకో…
మా ప్రణామాల ధూపం!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!