నీకో దండం

నీకో దండం

రచయిత :: మీసాల చిన గౌరినాయుడు

 ఓ పానమా
సురాపానమా
మా దీపం ఆర్పకుమా
మా బతుకును నలపకుమా….

ఆ పగలు ఎప్పుడు చీకటి దుప్పటి కప్పుకుంటుందా అని అదునుచూసి
శ్రమగొంతుకలో విషమౌతావు….

కష్ట కాయపు కరెన్సీని చిత్తుచేసి బానిసత్వపు మత్తును ఎక్కించి
ముసుగేసిన దీపానికి వత్తువౌతావు…..

కనికరం లేని కళ్ళల్లో
మమకారం మాయమై
కాఠిన్యపు మృగత్వాన్ని కసిదీరా నింపుతావ్….

నిషారాజ్యానికి విచక్షణ లేని పశురాజుని చేసి వావివరుసలను మంటగలిపి విలువల వలువలను పెరికిస్తావ్…..

బంధాల బలం తరుగుతున్న అనుబంధాలలో జీవన
సంబంధపు గొలుసును కొట్టి కొట్టి పగలగొడతావ్…..

ఆవరించిన మత్తుపొగలలో
నిలువెత్తు నిగ్రహాన్ని నశింపజేసి
శాశ్వత విగ్రహంగ మార్చేస్తావ్…..

తల ఎత్తిన పౌరుషాన్ని
తనువునేమో నిలవకుండ
తలదించుక చేయునటుల తరిమితరిమికొడతావ్…….

నీకో దండం కాస్త కనికరించు
మన’సారా’ విముక్తుల గావించు…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!