ప్రతిమ

ప్రతిమ

రచయిత :: నారు మంచి వాణి ప్రభాకరి

రంగు రంగుల ముగ్గులతో అకు పచ్చిని మామిడి తోరణములతో స్వాగతం పలికింది సంతోష మనస్సుతో లోపలికి నడిచింది ఒక ప్రక్క పొడుగ్గా బిల్డింగ్ ఉంది లైన్ గా గదులున్నయి రెండవ వైపు రకరకాల పూల మొక్కలు.,గులాబీ ముద్ద మందారం బంతి ,జాజి మల్లె కనకాంబరాలు విర బూ సి ఉన్నాయి  ఇది పువ్వుల కాలం కనుక కృష్ణ బంతి మొక్కలు కుంకుమ ఆరబోసి నట్లు ఉన్నాయి పసుపు బంతి పసుపు అరబెట్టునట్లు ఉన్నాయి ప్రకృతి అక్కడ రమ్యంగా ఉంది ఇంకొంచెం ముందుకు వెడితే వంగకాయాలు నీలం రంగు బంతుల్లో వెలడుతున్నాయి

సన్నని బెండ ,టమోటలు పచ్చి మిర్చి తోటకూర నిగనిగాలాడుతు స్వాగతం పలుకుతున్నాయి గెట్ కి లోపలికి వెడుతుంటే కుడివైపు పెద్ద గాంధీ విగ్రహం బంగారు రంగులో మెరుస్తూ ఉంది దానికి వెనుక స్టేజ్ కట్టి మేష రూం ఉంది లోపలి వేపు వినాయకుడు విగ్రహం చక్కగా బట్టలు కట్టి మకర తోరణం అర్చి పెట్టీ మందార పుల్తో అలంకరించి ఉన్నాయి.

ప్రశాంతము గా ఉంది   ఒక ప్రక్క ప్రశాంత వాతావరణం అనుకూలంగా భక్తి తత్వం ఉట్టి పడుతున్నాయి

రా రా అమ్మ రా అని ఒక ఆత్మీయ వచనం వినిపించి న వైపు చూసింది

తెల్లని ఖద్దరు చీర నల్లరంగు పై జరి అంచు పచ్చని చాయ చిరు నవ్వుతో పిలిచారు ప్రక్కనే మరో అమే అదేవిధంగా ఉన్నారు అవిడ అక్క అయి ఉంటుంది.

చరణ్ కారు పార్క్ చేసి వస్తాను మీరు డైనింగ్ హాలు దగ్గరికి వెళ్ళండి అక్కడ.విరజ అంటి ధీరజ్ ఆంటీ ఉన్నారు కదా అన్నాడు

ప్రగతి వడి వడిగా .బ్యాగ్ తీసుకుని నడుచుకుంటు వెళ్లినది ఆత్మీయపూర్వకంగా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లారు

ప్రతిమ

ప్రతిమ ఒక పరిశోధన విద్యార్థి గాంధీ గారి జీవితం పై పరిశోధన నిమిత్తము గాంధీ ఆశ్రమాలు అన్నివెళ్లీ చూసి తన  థిసిస్ సబ్మీట్ చెయ్యాలి అందుకు ఆనంద ఆశ్రమంకి బయలు దేరింది విజయవాడ నుంచి  రావడానికి బస్సులో బయలు దేరింది కూడా పళ్ళు బిస్కట్లు  శానిట్ రై జర్ పట్టుకుని వాటర్ సీసా పట్టుకుని బస్ దిగింది  చల్లనీ గాలి రివ్వున వచ్చింది పంట పొలాల పచ్చని పరిశుభ్ర గాలీ అన్నట్లుగా ప్రశాంతంగా ఉంది

డైనింగ్ హాల్లో ఒక ప్రక్క పూజ మందిరం చక్కగా పూలతో అలంకరణ చేసి వినాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామి అలమేలుమంగ పద్మావతి శ్రీ సత్య నారాయణ స్వామి  శ్రీ కాళహస్తీశ్వర స్వామి  శ్రీ ఆంజనేయుడు పటా లు పువ్వులతో అందంగా ఉన్నాయి దీపాలు వెలుగుతున్నాయి కొబ్బరి చెక్కలు అరటి పళ్ళు పెట్టే ఉన్నాయి. భక్తిగా నమస్కారం పెట్టీ  కూర్చుంది అంతా కలసి ఇడ్లి గారే తిని కాఫీ తాగారు.

ఈ లోపల చరణ్ వచ్చి వారితో కలసి టిఫిన్స్ తిన్నారు

తెల్లగా పొడుగ్గా ఉన్న  కుర్రాడు వచ్చి అక్క మీరేనా విజయ వాడ నుంచి వచ్చిన రీసెర్చి స్కాలర్ అన్నాడు .

నుదుటన బొట్టు ప్రశాంత వధనము చూడగానే అర్థం అయ్యింది అతనే చరణ్ అని గ్రహించించింది

తెల్ల షర్టు బ్లూ ప్యాంట్ వేసుకుని టకే చేసుకుని ఉన్నాడు విద్య వంతుని కళ ఉట్టి పడుతోంది

అవును తమ్ముడు నేను ప్రగతిని అని చెప్పింది .

మేడమ్. చరణ్ నీ పంపుతానని చెప్పింది

పచ్చని పొలాలు పిల్ల గాలి రోడ్డు మీద కారు స్పీడ్ గా దూసుకు వెడుతోంది..ట్రాఫిక్ లేదు ఎదురు వాహనాలు రావు సింగ్లే డారి కనుక వేగంగా వెడుతోంది. అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు స్వాగతం పల్కుతున్నయి

దారిలో కొన్ని చోట్ల కాడ మ ల్లి చెట్లు నుంచి రాలిన కాడ మ ల్లి పూలు గుప్పు మని సువాసనలు వెదజల్లు తున్నాయి ఏమైనా పల్లే వాతా వరణం లో ఎన్నో అందాలు ఆనందాలు ఓ అరగంట పొలాల మధ్యనుంచి. స్వచ్ఛ మైన గాలి వె లుతురు సువాసనలు పీల్చుతూ ఆహ్లాద వాతావరణంలో ఓ మెడ ముందు  కారు ఆగింది

అందరికీ  టిఫిన్స్  తిన్నాక బ్యాగ్ తీసుకుని మెడ మీద రూంకి వెళ్ళి అక్కడ ఉంచ మన్నర్ ఒక అమ్మయి వచ్చి అవి పట్టు కెళ్ళక ఆశ్రమం అంతా చూపించారు  వెనుక వైపు గోశాల ఉంది అక్కడ గోవులకు పూజలు చేసేవారు కొందరున్నారు

గోవులకు పసుపు కుంకుమ పెట్టీ మెడలో గంటలు కట్టి ఉన్నాయి .ఎక్కడ కక్కడ శుచి శుభ్రముతో ప్రకృతి అందాలు ప్రతిబింభిస్తున్నయి  అన్ని చూసుకుని వృద్ధులను చూసి వచ్చే టప్పటికి 12 గంటలు  అయింది బెల్ మోగింది భోజనాన్ని తినడానికి కొందరికి గదిలోకి పంపారు కొందరు డైనింగ్ హాలుకి వచ్చి తిన్నారు అందరికీ అయ్యాక ప్రగతి చరణ్ ఇద్దరు అంటిలు బోజనం చేశారు .గుత్తి వంకాయ కూర మా మామిడి కాయ పప్పు కొబ్బరి పచ్చడి చారు వడ్డించారు తృప్తిగా తిన్నది. చాలా బాగుంది వంట అన్నది.

రోజూ ఇలాగే రుచి గా పెడతాము పెద్ద వాళ్ళు కదా వాళ్ళకి కి మెత్తగా రుచిగా వండి పెడతాము కనుక ఇప్పుడు ఐదు ఊళ్లలో మాకు ఆశ్రమాలు పెట్టమని ఇళ్లు ఇచ్చి అడుగుతున్నారు మా ఆశ్ర్ర మాలో డబ్బు ఉన్న లేక పోయిన ఒకరకం భోజనం పెడతాము ఆదరణగా చూస్తాము.

డబ్బు కట్టిన వాళ్ళు సింగిల్ రూమ్ లో ఉంటారు టీవీ ఫ్రిజ్ పెట్టు కుంటారు

కామన్ రూం లో ఐదు అరుగురు ఉంటారు. రూమ్ సైజ్ నీ బట్టి ఆరెంజ్ మెంట్ ఉంటుంది.

పిల్లలున్న చూడని వాళ్ళు నిరాదరణ కలవారు రకరకాల జీవితాలు వారు అందరూ కూడా కుటుంబ భాధలు పడలేక చూసే వాళ్ళు లేక ఇలా ఆశ్రమాలు చేరుతున్నారు .

కుటుంబాల్లో సుఖము ప్రశాంతత లేక తనవంతు సొమ్ము తీసుకుని ఆస్తులు అప్పచెప్పి ఆశ్రమాలకు వచ్చి చేరు తున్నారు ఒక్కొక్కల్ది ఒక్కొరకం జీవితము..

ఎవరు ఎవరి సమస్యను తీర్చలేరు ఏ మనిషికైనా ఆహారం ఆవాసం ముఖ్యము అందుకు సరి అయిన ఆదరణ లేక ఇలా బయట పడి ప్రేమాభిమానాలు కోసం ప్రాకులాడి చేరుతున్నారు ,కొందరు జీవితాలు రాసుకుంది

అంటీ గురించి ఎక్కువ రాసుకుంది పెద్ద ఆంటీ సరొడే రాష్ట్ర సెక్రెటరీ  చిన్న ఆంటీ మహిళా శాఖ జిల్లా ప్రసిడెంట్  ప్రగతి అక్కడ వారం రోజులు ఉండి బుక్ కావల్సిన వన్ని రాసుకుంది వాళ్ళ ఐదు సంస్థలు చూసి మెచ్చుకుంది

ఆమె అక్కడే ఉండగా వారు తల్లి తండ్రి పుట్టినరోజు ఘనంగా చేశారు ప్రముఖులకు సన్మానాలు చేశారు ఒక ప్రముఖ దంపతులకు తల్లితండ్రుల పేర అవార్డ్ కూడా ఇచ్చి సత్కరుంచారు తల్లి తండ్రి గాంధేయ వాదులు

వీరు వారి అడుగు జాడల్లో తమ వంతు సేవ చేస్తున్నారు. ముఖ్యంగా వారు అవివాహితులు వృద్దులు సేవలో తరిస్తున్నారు.

ప్రగతి వెళ్ళేటప్పుడు  ఆమెకు ఒక శాలువా గాంధీ గారి ఫోటో ఇచ్చి దీవించి పంపారు .

ఎన్నో సిటీస్ లొ గాంధీ ఆశ్రమం చూసి రాసింది , కాని ఇక్కడ ఓ ప్రేమ అభిమానం ఆత్మీయత ఆదరణ పొంది వాటిని భద్రంగా తీసుకు వెడుతున్న నని చెప్పి దండం పెట్టింది

చరణే కారు తెచ్చి ఎక్కమని తీసుకెళ్ళాడు మౌ నంగా కారు ఎక్కి చెయ్యి ఊపింది . కారు బస్టాండ్ వేపు వేగంగా వెళ్లి పోయింది.

చరణ్ బస్సు ఎక్కించాడు బస్సు దుమ్ము లేపుతు విజయ వాడ వైపు వెళ్లి పోయింది.

నేల తరువాత ఈ సబ్జెక్ట్ అంతా డీ టీపీ చేసి పంపింది. చదువుకుని ఆనంద పడ్డారు

ఆ తరువాత ఏడాదికి ఆమెకి దాక్టర్టే వచ్చింది.

జీవితం అనేది ఒక వింత నాటకము మనం అందులో మన పాత్రలు పోషిస్తాయి

శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన సారం తెలుసుకుని జీవిస్తే సుగమనముగా తృప్తి గా జీవితం గడుస్తుంది

ఆ పరిశోధనాత్మక  గ్రంథంలో ఓ  వంద పేజీల ప్రత్యేకంగా మల్లవరం గాంధీ ఆశ్రమం గురించి రాసింది అది చదివిన ప్రముఖులు గాంధేయ  వాదులు కొంత మంది చూడటానికి వచ్చారు అది చూసి ఆనంద పడి ఆశ్చర్య పడి వారూ వాళ్ళ అభిప్రాయాలు ఒక్ బుక్ గేట్ రిజిస్టర్ లో రాయడమే గాక పేపర్లో కూడా వారి అభిప్రాయాలు చెప్పారు అలా అలా వారి కృషి కేంద్ర మంత్రులకు తెలిసింది వారు కూడా ఎంతో మెచ్చుకుని తెలుసు కొని వీరికి పద్మ భూషణ్ ఇవ్వ  నిచ్ఛ ఇంచరు

అపూర్వ సోదరిమణుల కృషి అని తెలుగు ఇంగ్లీష్ పేపర్స్ నిండా వీరిదే విన్నూత్న విషయాలు ప్రగతి మెచ్చుకుంటూ వారు అమే పరిశోధన ద్వారా తమకు ఈ పద్మ భూషన్ వచ్చిందని తెలిపారు తాము ఎప్పటి నుంచో కృషి చేస్తున్నాము కానీ ఎవటినుంచి ఏ అవార్డ్స్ ప్రశంసలు ఆశించ లేదు వారు  వారు మటల్ ద్వారా విని మాకు అవార్డ్స్ నిచ్చారు ఇప్పుడు కూడా ఈ అవార్డ్స్ మాకు అలాగే వచ్చింది సేవ భగ వంతిని రూపంగా మేము చేశాము దానికి భగవంతుడు మెచ్చి ఈ అవార్డ్ నిప్పించాడు. అని తృప్తిగా మాట్లాడారు ఆ అపూర్వ అద్భుత సోదరీమణులు  ఫలితం ఆశించకుండా సేవ చెయ్యడం మా జీవిత ధ్యేయంగా జీవితము గడుపుతున్నారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!