మధురమైన అనుభవం

అంశం: విడిపోయిన బంధం మళ్ళీ ఎదురైతే..

మధురమైన అనుభవం

రచన: కవిత దాస్యం

కాలేజీ రోజులు కొంతమందికి సరదాగా ఉంటే, మరికొంతమందికి బాధ్యతల బరువు తో ,మధ్యతరగతి వారికి మధ్యస్తంగా గడిచేవి. దేనికైనా పెట్టి పుట్టాలి అంటారు .
కాలేజీ నుంచి ఒకరోజు ఎక్సకర్శన్ కై బస్సు బయలుదేరుతుండగా లాస్ట్ మినిట్ లో వచ్చాడు హీరో. తను వచ్చిందే హీరోయిన్ లాంటి కావ్యను ప్రేమలో పడేయడానికి ,ఎప్పుడు ఫ్రీ సమయం దొరుకుతుంద మాట్లాడడానికి అని వేచి చూసి, తను ఒంటరిగా ఉన్నది చూసుకొని తన మనసులోని మాటలన్ని చెప్పేస్తాడు . నేను నీ కొరకు ఎంతగా ప్రేమించానో ఎంతగా తపిస్తున్నానో రక్తంతో తో లెటర్ రాశాను వీలు ఉన్నప్పుడు చదువు, అప్పుడైనా నా ప్రేమ నీకు అర్థమవుతుంది .అది విని వెంటనే కావ్య కోపంతో నీకేమైనా పిచ్చా ,ఇది కరెక్ట్ కాదు, ఆలోచన లేకుండా పుట్టే ప్రేమ ప్రేమ కాదు .ముందుగా చదువు ,సెటిల్ కావడం జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సమయాన్ని వృధా చేసుకొని ,ప్రేమలవెంట పరిగెడితే నష్టపోవాల్సింది మన జీవితమే ,ఆలోచించు నా కొరకు అయితే టైం వేస్ట్ చేసుకోకు ,మాది కష్టపడితే కాని గడవని కుటుంబం .
మా నాన్నగారు ఎంతో ప్రయాసతో నన్ను చదివిస్తున్నారు. నేను తగినట్టుగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి, కొడుకులా చేదోడువాదోడుగా సహాయపడాలి .అప్పటివరకు నా పెళ్లి ఆలోచన లేదు. ఎంత చెప్పినా సతీష్ మనసు అంగీకరించట్లేదు.తనకే తెలియకుండా పుట్టిన ప్రేమ కదా అతడు మాత్రం ఏం చేస్తాడు. కావ్య తో నాదొక చిన్న రిక్వెస్ట్ ,మనం కలిసి చదువుకున్నన్ని రోజులు నాకోసం స్నేహితం గా మెలు గు, ఎన్నటికీ నన్ను సైడ్ చేయకు, కోపగిoచుకోకు, నిన్ను ప్రేమిస్తూనే చదువుకుంటాను అంటాడు .ఇలా అంటూనే చదువు పూర్తయింది. ఎవరికి వారు అన్నట్టుగా దూరం పెరిగింది. వయసు బాధ్యతను గుర్తు చేసింది. కావ్య బి.ఈ. డి కంప్లీట్ చేసి టీచర్ జాబ్ సంపాదించింది. తండ్రితగిన వరుణ్ణి చూసి పెళ్లి చేస్తాడు. మనసులో సతీష్ అంటే ఇష్టం ఉన్న చెప్పలేని మధ్యతరగతి అమ్మాయిల తన ఆశను మనసులోనే దాచుకుని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిoది .
ఎక్కడో ఏదో చిన్ని నిరాశ వెంటాడుతూనే ఉంది . అతనిని చూడాలని ఒకే ఒక్కసారి మనసు విప్పి తనివితీరా మాట్లాడాలని, ఆలోచిస్తూనే తన పిల్లలకి పెళ్లీడు రానే వచ్చింది. సతీష్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఎలా కలవాలో తెలియదు కానీ కలవాలి. తనను మాటలతో ఎన్ని విధాలుగా తూట్లు పొడిచిందో ,సమాధానం చెప్పుకోవాలి అనే ఆరాటం మనసులోనే గూడుకట్టుకొని తపిస్తుంది. కావ్య కూతురు కాలేజ్ వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్ కి వెళ్లారు .సతీష్ వాళ్ల నాన్నకి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో జాయిన్ చేశారు. విధి విచిత్రం అన్నట్టు అనుకోకుండానే సతీష్ కావ్య ఎదురుపడ్డారు. కావ్య పరుగున వెళ్లి సతీష్ చేతుల్ని దగ్గరకు తీసుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. సతీష్ కావ్య ని గుర్తుపట్టలేదు .పెళ్లైన ఆడవాళ్ళు మారతారు కదా!
నీ ప్రేమను ఆ రోజున చులకన చేశాను .ఈరోజు ఆ ప్రేమకై ఎదురుచూస్తూ బతుకుతున్నాను. అన్న ఆమెమాటలు విని గొంతు గుర్తు పట్టి సారీకావ్య గారు బాగున్నారా !
అన్నoతలో కావ్య తమాయించుకుని గడ్డం పెంచుకుని పూర్తిగా మారిపోయిన సతీష్ ని తదేకం గా చూస్తూ, బాగున్నావా,పెళ్లయిందా, పిల్లలు ఎంతమంది ప్రశ్నల వర్షం కురిపిస్తుండడంతో సతీష్ ఫక్కున నవ్వాడు .ఏంటి కావ్యనేన ఇంతల మాట్లాడేది ఆశ్చర్యపోయాడు. ఇద్దరు వెళ్లి పార్కులో కూర్చొని 20 సంవత్సరాల వెనక్కి వెళ్లారు. తమ మనసులోని భావాలను ఒకరికొకరు పంచుకున్నారు. కావ్య భర్త కంపెనీ లో పని చేస్తాడు .బాగ కోపిష్టి, అవసరానికి ఆడది అన్నట్టు చూస్తాడు .ఇంక ప్రేమ అంటే అతని నుంచి వెతుక్కోవాల్సిందే !అప్పుడు అర్థమైంది కావ్యకి ,మనిషికి తిండి ,బట్ట తో పాటు ప్రేమ అనేది ఎంత అవసరమో! ఏదేమైనా విడిపోయిన బంధం తిరిగి ఆత్మీయ స్నేహం లా కలిసినందుకు ,లోలోపల తీన్మార్ డాన్స్ వేసింది .మనసు కొత్తగ రెక్కలొచ్చేన అనే ఆనందం లొ ఉక్కిరి బిక్కిరి అయ్యింది.
ఆడవారికి ఏది వచ్చిన తట్టుకోలేo, అంతా గమనిస్తున్న సతీష్ సరదాగా నవ్వుకున్నాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!