అనుబంధము

అంశం: విడిపోయిన బంధం మళ్ళీ ఎదురైతే..

అనుబంధము
రచన: నారు మంచి వాణి ప్రభాకరి

సూర్యునితో పాటు పని మొదలు పెట్టిన కామాక్షి పిల్లలని ఒక్ పద్దతి గా బుద్దిగా పెంచింది భర్త రమణ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి బాగానే వస్తుంది కానీ క్యాంపు లు ఉంటాయి.పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అత్త మామని తెచ్చి పెట్టుకున్నాడు మధ్యలో బావ మరుదులు వచ్చి పోతు ఉండేవారు. రమణ ఎప్పుడు పెళ్ళాం కామాక్షి లెక్కలు అడగ లేదు, అయిన అమె పుస్తకం పెట్టీ రాసు కొనేది చూపిస్తే నాకు ఎందుకు? అనేవాడు. నీ అంతరాత్మ నీకు సాక్షి అనేవాడు

కామాక్షి ఇద్దరు ఆడపిల్లలు పెద్దవాళ్ళు తరువాత ఇద్దరు మగ పిల్లలు అందులో చిన్నవాడు నిఅడబడుచు పెంచుకుంటూ ఉన్నది. ఇంకా ఒక కొడుకు లెక్కగట్టి చూస్తే శ్రీ నివాస్ ఒక్కడే కొడుకు అని చెప్పాలి , బావకి అస్తి ఉన్నది కనుక ఇబ్బంది లేకుండా చిన్న పిల్లాడు పెరుగు తాడు అని కామాక్షి నమ్మకము. అంతా తన వాళ్ళే వచ్చి తిని వెడతారు రమణ తాలూకు పెద్దగా ఎవరూ రారు పిల్లలు ఎదుగుతున్నారు ఆడ పిల్లల పెళ్ళిళ్ళు చెయ్యాలి కదా డబ్బు ఏ దైన దాచు తున్నవా అని కామాక్షి నడిగ్ తే అంతా ఎత్తు ఎగిరి పడేది కాఫీలు టీలు మానేసి కడుపు కట్టుకుని పిల్లలకి పెళ్లి కోసం ఉంచాలా? అది ప్రశ్న ?
ఎంత మంచి సంబంధం వచ్చినా ా ఆ అదిలెదు ఇది లేదు అని వంకలు పెట్టీ పంపేది, ఆడపిల్లలు ఇద్దరు డిగ్రీ లు చదివారు అంతకు తగ్గ సంబంధం చూసి చెయ్యండి అని అందరూ చెప్పే వారు.

ఆ కంగారు ఏమిటి? కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అనేది కొన్ని జాతకాలు మరి కొన్ని నక్షత్రాలు కుదర లేదు అనేది శ్రీ నివాస్ ఒక సాఫ్టు వేరే కంపెనీ లో చేస్తున్నాడు అతని ఫ్రెండ్ ను చూసి సంబంధం చెప్పాడు

ఆ వాళ్ళు మన శాఖ కాదు అని వద్దు అన్నది రమణ జాతకం చూసి కుదరలేదు అన్నాడు, ఇంకో పెళ్లి కొడుకు నల్లగా లావుగా ఉన్నాడు అన్నారు. ఇంకొంపెళ్ళి కొడుకు తల్లి వృద్ధురాలు నా పిల్లలు చాకిరీ చెయ్యి లేరు అన్నది. ఇంకా చూడండి సంభందాలు ఎంత పాతిక దాటింది అంతే అంటూ వచ్చిన ప్రతి సంబంధం తిరగ కొట్టింది ఇంకో బ్యాంక్ ఆఫీసర్ కి ఎనిమిది మంది అక్కలు అందరి పెళ్ళిళ్ళు అయ్యి నేను చేసుకుంటాను అంటే నీ ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసినా సరే ఓ నలభ్ట్ మంది ఇంట్లో వాళ్ళే ఉంటారు నా కూతురు కాఫీ లు కలిపి ఇవ్వలేదు వద్దు అంటూ చెడ కొట్టింది

ఇద్దరు ఆడపిల్లలు పెళ్లికి ఉన్నారు అంటూ శ్రీనివాస్ కి సంభందాలు రావడం లేదు. ఆడపిల్లను పెళ్లి కాని వారి ఇంట్లో పెళ్లి చేస్తే కూతుర్ని సుఖ పడనివ్వరు అని పెద్దలు అంటారు అందుకే పెళ్ళిళ్ళు చాలా మందికి జరగడం లేదు. మొత్తానికి తండ్రి క్యాంప్ లకి వెళ్లి నప్పుడు ఒక ఫ్రెండ్ కూతుర్ని చూసి శ్రీ నివాస్ పెళ్లి కుదురచుకోవడం చేశాడు. ఇది కామాక్షి కి మంచి కోపం తెచ్చింది . చేసేది లేక వప్పుకున్నాడు, కానీ తల్లి పెంకిధి భార్యను బాధిస్తుంది అని తెలుసు . భార్య కోమలి మంచి సున్నిత మైన మనిషి పని పాట వచ్చును . కానీ తల్లికి నచ్చదు పెళ్లి అయి వచ్చాక ఆమె తమ్ముళ్లు ఇతర బంధువులు వచ్చి ఇదేమిటి?
కామాక్షి ఆడపిల్లల పెళ్లి కాకుండా పిల్లాడు పెళ్లి చేసి పిల్లను తెచ్చారు ఇంకా నీ కొడుకు అక్కల పెళ్లి చేస్తాడా
నీ మొగుడు నువ్వు తొందర పడాలి లేక పోతే వాడికి పిల్లలు పుట్టుకు వస్తే మీ సంగతి పట్టించుకోడు అంటూ నూరి పోశారు. దానితో కామాక్షి ఉగ్ర రూపం దాల్చి రోజు కొడుకుకి కొడలిపై నేరాలు చెప్పేది

నీ పెళ్లాన్ని వేరే ఇల్లు తీసుకుని పెట్టుకో అన్నది, డబ్బు సర్దవద్ద అంటే ఆ పిల్లని ఉద్యోగం లో పెట్టు లేదా పిల్లల పెళ్లిళ్లు అయ్యే వరకు పుట్టింట్లో పెట్టీ నేను తెమ్మన్న ప్పడు తీసుకు రా!? తండ్రి కొడుకు కుదుర్చుకుని పెళ్లి చేసుకున్నారు కట్నం లేదు , లాంఛనాలు లేవు ఈ మాత్రం పిల్ల మన వాళ్ళల్లో లేదా ఏమిటి?అని కసురు కొనేది

ఓ నెల చూసాడు పోని అక్కలు అయిన కలిసి వస్తారా అంటే నీ పెళ్లకోసం మేము పెళ్లి చేసుకో వాలా అన్నారు ఇద్దరు మధ్య పోరు మొదలు అయ్యింది

కోడలి నైటీ పంజాబీ కొత్త మోడల్ జాకెట్స్ చీరలు కట్టకూడదు జారీ నేత చీరలు కట్టాలి మొగుడు పెళ్ళాం మాట్లాడు కో కూడదు పిల్లల్ని కనకుడదు ఇలా ఎన్నో రూల్స్ పెట్టించి కోడల్ని ఎలా పంపాలా అనే ప్లాన్లో రోజు గొడవ పడటం ఆఫీస్ నుంచి రాగానే నేరాలు చెప్పడం అలవాటు చేసుకున్నారు తల్లి అక్కల స్వభావం నచ్ఛక భార్యను కష్ట పెట్టడం ఇష్టం లేక పుట్టింటికి టికెట్ కోని పంపేశాడు

కోమలి పెళ్లి తరువాత చాలా మా న సికా వేదన పడింది. ఆడపిల్లలు కూడా పరమ మూర్ఖులు గా ఉన్నారు. ఇంకా చేసేది లేక పుట్టింటికి వెళ్లి పిజి చదివి బ్యాంక్ టెస్ట్కు రాసింది వి ధి బాగుంది జాబ్ వచ్చింది,, మళ్లీ భర్త ఊరు విజయ వా డ లో పోస్టింగ్ వచ్చింది

సరే తల్లి తండ్రి పిల్లను పెట్టుకుని ఉన్నారు వాళ్ళ కొడుకు బొంబాయి లో ఉంటాడు సరే అప్పుడే పెళ్లి అయి పదేళ్లు అయింది ఆ ఇంటినుంచి వచ్చాక పోనే చేస్తే పొడిగా మాట్లాడేవాడు ఇంటికి.చేస్తే పెద్ద రాద్ధాంత మే ఉండేది పోని లే మనకు పెళ్లి ఖర్చు ఉన్నది ఇలా జరిగింది అని సరి పెట్టుకున్నారు

భారత్ దేశం లో సీత పుట్టిన దేశంలో ఒక సారే స్త్రీకి పాణి గ్రహణం అతడే మానసికంగా భర్త ఆర్థిక శారీరక సంభందాలు ఉండకూడదని అత్తింటి వారు ఆజ్ఞ ఎన్నో కుటుంబాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అత్తింటి భాధలే కానీ ఆనందం లేదు దీనికి కారణం పిల్లల పెంపకంలో లోపమే.

కోమలి కాష్ కౌంటర్ ఉండగా ఒక రోజు ఎక్స్కుసే మీ మేడం.అని పిలుపు విని పై కి చూసింది, శ్రీనివాస్ అతను గుర్తు పట్టాడు వెంటనే నవ్వు ఆనందం ముఖంలో కని పించాయి.

ఓ మీరా బావున్నా రా అన్నది కోమలి
ఎన్ని ఏళ్లు అయిందో అయిన కోమలి అప్పటి చలాకి తనం.అందం అలాగే ఉన్నది
శ్రీ నివాస్ మాత్రం భాద్యతలు బెంగల వల్ల తల్లి పెంకి తనం వల్ల మాన సికా వత్తిడి చెంది మర్పువచ్చింది, విడిపోయిన బంధం ఇలా ఎదురు అయింది
ఇవ్వాళ సోషల్ మీడియాలో వీడియో కాల్స్ వాట్స్ ప్ ఫేస్ బుక్ ఇన్స్తోగ్రమ్మ్ ఇలా ఎన్నో అవకాశాలు ఉన్నాయి కానీ ఏవి కామాక్షీ ముందు పని చెయ్యలేదు. అక్కల పెళ్లి చేసుకున్నారు కానీ వాటి జీవితం అంతంత మాత్రం.అని చెప్పాలి శ్రీనివాస్ లో పరివర్తన వచ్చింది..మనం లంచ్ అవట్ లో నితో కొంచెం మాట్లాడాలి అన్నాడు మాటలలో చేతలలో మార్పు కనిపించింది కోమలి సరే అలాగే నేను మీ మాట ఎప్పుడు కాదన లేదు అన్నది

అవును నాకు తెలుసు నా ఇంటి పరిస్తితులో నేను నిన్ను బాధ పెట్టాను కానీ ఇప్పుడు పాశ్చాత్య ప పడుతున్నాను
అన్నాడు

ఛీ అల అనుకోవద్దు మీరు నన్ను ఇష్టపడి చేసుకున్నారు. మీ ఇంట్లో సుఖం లేదు కాబట్టి నన్ను పుట్టింటికి పంపారు
మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేస్తారు అని ఆశా పడేదాన్ని కానీ నేను చేస్తే మీ వాళ్ళు కోపడేవారు ఎది ఏమైనా నేను ఎప్పుడు మీ దానినే ఇంటికి రండి అని ఆఫీస్ లో పర్మిషన్ తీసుకుని ఇద్దరు వారి వారి స్కూటర్ లాపై ఇంటికి వెళ్ళారు
తల్లి తండ్రి లోపలికి ఆహ్వానించి భోజనం టైమ్ అన్నం తిను అంటూ కంచాలు ఇద్దరికీ భోజనం టేబుల్ పై వచ్చించారు

ఇలా ఆప్యాయంగా తిని ఎన్నో రోజులు అయింది భార్య భర్త కలిపి తిన్నారు అత్త గారు వడ్డించారు, ఆ తరువాత నుంచి ప్రతి ఆదివారం శ్రీ నివాస్ వచ్చి వెళ్ళేవాడు అక్కలు ఇప్పుడు కూడా నిప్పులు గక్కారు. పెద్దల మాట పక్కన పెట్టారు
జీవితం ఒక్కసారే అసలు తనకి ఇన్ని గొడవలతో పిల్లను ఎవరూ చేస్తారు ?
అక్కల మాట తల్లి తండ్రి మాట పక్కన పెట్టేసి తన జీవితం.తను చూసుకున్న తరువాత వాళ్ళు లబో దిబో.మన్న మీకు నెలకి కొంత జీతం ఇస్తాను నేను నా భరధగ్గరక్ వె డ తాను అని స్వీయ నిర్ణయంతో తన అనుబంధాన్ని బలపర్చుకున్నాడు.
నానాటి బ్రతుకు నాటకము అన్ని శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన, ఎమ్మెస్ గళంలో శ్రావ్యంగా వినిపిస్తోంది జీవితం అంతే కదా భార్య భర్తల బంధం అంత్యంత అపురూపం ఏవైనా స్పర్ధలు వచ్చినా సర్ధ్కోమని పెద్దలు చెప్పాలి పెద్దలే గొడవలు పెడితే ఎలా? స్వార్థం వదిలి ఎదూరింటి ఆడపిల్ల మనింటికి వచ్చి నప్పుడు జాగ్రత్తగా ప్రేమగా చూస్తే వారు , వారి కుటుంబం అంతా కూడా వదిలి వచ్చింది కదా కుటుంబ వృద్ధికి పిల్లల్ని అందంగా ఆనందం గా తీర్చి దిద్దే బాధ్యత పెద్దలపై ఉన్నది.
శాంతి శుభమ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!