కలిసి వచ్చిన అదృష్టం

 కలిసి వచ్చిన అదృష్టం

రచన::సుజాత

తూర్పు కొండలనుండి పడమటి కొండలవైపు ఉదయించే రవి భానుడు ఎర్రటి వర్ణంతో పల్లే ప్రజలనుమేలుకొలుపుతున్నాడు అప్పుడే నిద్రలోనుండి లేచి పల్లే ప్రజలు కాలకృత్యాలు తీర్చుకుంటూ ఎవరి పనిలో వాళ్ళు లీనమయ్యారు.ఆవు పాలు పిండడానికి వచ్చాడు వీరయ్య తన ఎజమాని రాకను గమనించిన లేగదూడ అంబా అంటు ఆకలితో అరుస్తుంది. తన తల్లి ఒడికి చేరాలనే ఆత్రుతగా ఎదురు.చూస్తుంది. లేగదూడను విడువగానే పరుగున.వెళ్లి తల్లి చెంతకు. చేరింది లేగదూడ.ఆవు లేగదూడను నాలుకతో ప్రేమగా నిమురుతుంది.అది సంతోషంతో పోదుగును పట్టుకుని పాలు తాగుతు తన ఆకలిని తీర్చుకుంటుంది

అరె సత్తేన్న రాముడు ఇయ్యల మా పొలంలో కలుపు
తియ్యాల వస్తారా అంటూ లింగమ్మ వచ్చింది వస్తాము అక్క నువ్వు నడువే మేము సద్ది కట్టుకుని వస్తాము. సరె బెగిరమే రండి ఎండలు.మండి.పోతున్నాయి. అంటూ వెళ్ళింది.గొండ్ల మందను మేతకు తొలుకు పోతుర్రు కుర్రాళ్లు.ఎవ్వరి పనిలో వాళ్ళు “నిమగ్నమయ్యారు”వెన్నెల అప్పుడే ఒళ్లు విరుచుకుంటు ఒక్కచేత్తో చీపురుకట్ట మరో చేత్తో బకిట్ పట్టుకుని వాకిట్లోకి వచ్చింది కల్లాపు “చల్లడానికి”. ఎందే ఎన్నెల.ఇంత పొందు పోయింది ఇంకా కల్లాపు చల్లలే ఇంత పొందేక్కేదాక ఏమ్ చెసినవే ఒంట్లో సుస్తీ
గాని సేసింద.ఏంది అని అడిగింది.మంగమ్మత్త.

అదేం లేదే అత్త రాత్రి అయ్యా తాగొంచి ఛాన.గొడవ గొడవ చేసిండు అత్త ఎడపని ఆడ్నే పడెసిన అవ్వ ఏంత మొత్తుకున్నా ఇనకపాయె రూపాయి రూపాయి కూడబెట్టిన డబ్బులు అన్ని తాగి తగిలేసే అందుకే పని మేల్లగ చెసిన అవ్వ బాధపడుతుండే ఏం చెయ్యాలా అత్త ఇంత సేపు అయింది.ఏం చేయ్యాలో అర్థం కాకుండే అత్త ఆవ్వ. పిలుస్తుంది. నే ఎలుతానే సరేతల్లి వెళ్లు అంది మంగమ్మత్త

ఎన్నెల అంటు తల్లి రాజమ్మ పిలుస్తుంది. ఆ..ఆ వస్తున్నానే అవ్వ బెగిరమే రావే అంది.రాజమ్మ మీ అయ్యకు సద్ది కొంటపోవాల నేను సద్ది కడుతాను కదే అన్నం వండలేదు కదే అంది తల్లి రాజమ్మ నీకు అంత తొందరే అవ్వ మీ అయ్యకు పొద్దున్నే.సద్ది గావాల చల్లబడి.పొమ్మంటే ఇనడాయే అవ్వ నీకు ఎందుకే.అంత గాబర ఆయిల తాగింది దిగలే ఇంక ఎం తొందర పడుతవు ఎంతైనా నీ అయ్య గాదే పాపం నువ్వు.అట్లే అను అయ్య అట్లనే చేస్తుండు నీ గారాభం ఎక్కువైందే ఎమోనే సరే నువ్వు ఇంట్లోనే ఉండు నేను పట్టుకెళ్త సరేనే బెగిరం ఎళ్లు.

సరే అంటూ చుక్కల రవిక వేసుకుని బొండు కిందినుండి మోకాళ్ళ వరకు జెరి లంగా వేసుకుని దానికి తగ్గ పవిట వేసుకుని ఒయ్యారాలు ఒలకబోస్తూ చేపకనుల లాంటి కళ్లకు కాటుక పెట్టుకుని పోడువైన జడకు జడబొండాలు పెట్టుకుని ఒక చేత్తో జడకుచ్చిల్లను ఆడిస్తూ ఒక గుళ్లలో సద్ది పెట్టుకుని ఒయ్యారంగా పొలంగట్టుపై నడిచి వస్తుంటే పనులు మానేసి అందరు తనవక్కే రెప్పవేయకుండా చూస్తున్నారు ఎంటే.నా సామిరంగా అంతా నా వైపే చూస్తున్నారు ఏం తాతా
నోట్లో దోమలు పడి పోగలవు జాగ్రత్త తాత అంటూ నవ్వింది.ముసిముసిగా నవ్వుకుని మల్లి తన పనిలో నిమగ్నమయ్యాడు.తాత

ఏమే ఎన్నెల నన్ను మనుము ఆడుతావ అన్నాడు మల్లన్న తాత అమ్మమ్మ.సరిపోలే తాత కాటికి కాలు జాపినవు ఇంక.పెళ్లి కావాల తాత అమ్మమ్మను. తొలుకొచ్చి మనుము ఆడుత ఉండు ఒ మనుమరాల
ఊరికనే అన్నానే నా నోట్లో మన్ను పోయకే మనవరాలా అంటూ నవ్వాడు అవును తాత నేను కూడా ఊరికనే అన్నాను “తాత”అంది నవ్వుతు దానికి మామ ఉన్నాడే మామను మనుము అడుతది.అంది సత్యమ్మ పెళ్లి చేసుకుంటాడు పప్పన్నం ఎప్పుడు పెడతావే అంది అవ్వ నిజమే అవ్వ.నా మామ ఉన్నాడు.

అంది సంతోషంతో.మరి పంపన్నం.పెట్టవా మల్ల
మనుమరాల పో అవ్వ అంది సిగ్గుతో మామతో పెళ్లి
అనగానే ఎంత సంతోషం చూడె సత్తి వస్తాడే పిల్ల.నీ మామ అంది మామతో. మనుము.ఆడడం అంటే నాకు ఛాన ఇష్టం చిన్నప్పటి నుండే.మామ నా పెనిమిటి అని నా మనసులో ముద్ర పడిపోయింది.అవ్వ అయ్య కూడ ఎప్పుడు మామ నీ మొగుడు అని ఆట పట్టించేవారు మామ నేను చిన్నప్పటి నుండి ఒకే చోట పెరిగినము ఎన్నో ఆటలు ఆడుకున్నాము వ్యవసాయం పనులు ఉన్నయని పోయిండు నేనంటే మామకు. పాణం అమ్మమ్మకు కూడ ఛాన ఇష్టం.ఇంకేంటి మామను మనుము ఆడాల్సిందే అనుకుంటూ సంతోషంతో అయ్య దగ్గరికి వచ్చింది.

అయ్య సద్ది తెచ్చిన తిను ఏందే.బిడ్డ నువ్వు తెచ్చినవు ఎవరు తెస్తే ఏంది అంది కోపంగా అట్లకాదే బిడ్డ ఎండనబడి ఎందుకు వచ్చినవని కోపంగా ఉంద బిడ్డ రాత్రి. చెసిదానికి కోపం రాద మల్ల నువ్వేమన్న గొప్ప పని చేసినవని.కోపం రాకుండా. ఉంటుంద మరి ఎదో తాగిన ఇంకోసారి తాగను బిడ్డ నీమీద ఒట్టు అన్నాడు ఇదంతా ఇప్పుడెందుకు గానీ తిను అయ్య మల్ల నామీద కోపం పోయింద పోయింది.అయ్య అంది నవ్వుతు.పని కాగానే రా అట్లనే బిడ్డ సరెనట్టు వెళ్లింది.

అవ్వ అయ్యకు ఇచ్చివచ్చిన సరే.నువ్వు ఇంత ఎంగిలి
పడు అంది అమ్మమ్మ ఫోన్ చేసింది. ఎందుకే అవ్వ
ఎందుకు అంటావేంటే మీ మామకు నీకు పెళ్లి ముచ్చట మాట్లాడాలి పెళ్లి సంబంధాలను వస్తున్నాయట నన్ను కాదని ఎవరిని చేసుకుంటాడు మామ అదే బిడ్డా మాటా మంచీ అడిగి రావాలా మీ అయ్య పొయ్యి అడిగి రావాలి నిన్ను కాదని ఎవర్నీ చేసుకోరు బిడ్డ మీ అమ్మమ్మ ఒకటే గాబర పడుతుంది నాకు పాణం మచ్ఛిగ లేదు నా కళ్ల ముందే పెళ్లి జరగాలని గొడవ చేస్తుందట అవునా

అదే ముచ్చటను అడిగి మనోడు అనిపించుకోవాలి
అట్లాగే అయ్య రాని ఎండ్లను తొలుకొచ్ఛాడు ఏమయ్యా మా అమ్మ ఫోన్ చేసింది. నీ బిడ్డను నా తమ్మునికి ఇచ్చి
పెళ్లి చెయ్యాలని ఒకటే తొందర పడుతుంది మా అమ్మకు పాణం కూడ మంచిగా ఉంటలేదు అందుకే
తొందర పడుతుంది.కాని మనం అనుకున్న ముచ్చటనే
కద వాళ్లని రమ్మందాము సరే కబురు పెట్టు అన్నాడు

అమ్మనాన్నలను రమ్మని కబురు పెట్టింది. కబురు పెట్టిన తక్షణమే వచ్చారు.అందరు కుశలప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.అందరికి ముందే తెలిసిన విషయాలు
కనుక పెద్దగా ఆర్భాటాలు లేకుండానే పూలు పండ్లు జరిగిపోయింది. వచ్చే కార్తీక మాసంలో పెళ్లి ముహూర్తాలున్నాయి వెన్నెల సంతోషం ఇంతా అంతా కాదు చాలా సంతోష పడిపోయింది మామను చూడగానే ఎక్కడలేని సిగ్గు వచ్చింది.ఏంటే వెన్నెల
అంత చిక్కిపోయినవు పో మామా నాకు సిగ్గేస్తోంది.
అబ్బో అంత సిగ్గే తన చేతులతో మొహన్ని దాచుకుంది. ఎది నన్ను చూడని నీ సిగ్గుని అంటూ తన రెండు చేతులతో మొహంపై ఉన్న చేతులను తీశాడు
సిగ్గుతో తలవంచుకుంది నీ సిగ్గు చీకట్లో వెన్నెలకురిసినట్టుగా ఉంది.అన్నాడు మామ

అమ్మవెన్నెల మీ మామయ్యను పిలుచుకురా ఆ.
వస్తున్నాను అంది.అప్పుడేన అంటూ కొంగు పట్టుకుని
లాగాడు. చూట్టు తిరుగుతూ తన గుండెలపై వాలింది.
మామ ఒదులు మామ అంది ఆహా వదులను అన్నాడు
ఎందుకు మామ ఈ బుజ్జి పాపయికి ఎం తెలియదు
పాపం పో మామ అన్ని పెళ్లి అయ్యాకే అంటూ
పరిగెత్తింది.ఆ కార్తీక మాసం వచ్చింది పెండ్లి బాజా మోగింది అందరి సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా పెళ్లి జరిగిపోయింది.వెన్నెల అంజి మామా ఇద్దరూ
ఒక్కటయ్యారు వెన్నలరాత్రిలో ఇద్దరు ఒకటై ప్రేమ
కబుర్లతో ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిపోయారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!