క్షమించు తల్లి

క్షమించు తల్లి 
                            (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)       

రచన : తిరుపతి కృష్ణ వేణి

అమ్మా! సుజీ! అంటూ ప్రేమగా పిలిచారు నాన్న.
నాన్నా ! నాకు ఏదో చెప్పాలని చూస్తున్నారు.!
అని! మనసులోనే అనుకొని, హా! ఏమిటీ నాన్న ! అన్నాను. ఒకసారి ఇలా వస్తావా! అమ్మా! నీతో ఓ, విషయం మాట్లాడాలి అన్నారు నాన్న! తనతో చెప్పాలిసిన విషయాన్ని గత రెండు రోజులుగా, అమ్మా నాన్నలు చర్చించుకుంటున్న విషయం తనకు తెలుసు. అది ముందుగానే వూహించిన సుజీ!, చెప్పండి నాన్న అంటూ వచ్చింది. హా! ఏమీ లేదమ్మా! నీ పెళ్లి విషయం గురించి,! మన దూరపు బంధువుల ద్వారా ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాడట. మంచి సంబంధం అంటున్నారు. నీకు ఇష్టం అయితే అబ్బాయి వాళ్ళతో ఒకసారి మాట్లాడుదాం! ఏమంటావు, తల్లీ? అన్నారు. ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాన్న! పర్మినెంట్ జాబ్ లో సెటిల్ అయిన తరువాతనే పెళ్లి. ముందు నా కాళ్ళమీద నేను నిలబడాలి. అప్పటి వరకూ పెళ్ళి చేసుకునే ప్రసక్తే లేదు? అంటూ సుజీ, నాన్నకు చెప్పింది. అలా అంటే ఎలా తల్లీ! ఆడపిల్ల అన్నాక ఎప్పుడోవొకప్పుడు పెళ్ళి చేసి పంపించక తప్పదు. అప్పటి వరకూ వచ్చిన సంబంధం మన కొరకు ఆగుతుందా ! ఉద్యోగం చేస్తున్న అబ్బాయి. పోతే ఇంత మంచి సంబంధం దొరుకుతుందా, చెప్పు! అంది అమ్మ రేవతి. ఇంతలో బయట నుండి వచ్చి అప్పుడే ఇంట్లో అడుగు పెడుతున్న నరసింహం గారి చిన్న కూతురు ప్రియా! ఆగక పోతే పోనీ అమ్మా ! వాళ్ళని ఎవరు ఆగమన్నారు?
ఆ ఒక్క అబ్బాయే వున్నాడా! లోకంలో అంది.
అది కాదే ప్రియా! అబ్బాయి చాలా మంచోడు అంటున్నారు. పైగా ఉద్యోగం చేస్తున్నాడు. తప్పిపొతే మళ్ళా అట్లాంటి సంబంధం దొరకదు కదా? అంది అమ్మ! మంచోడు! మంచోడు అంటున్నావు? మంచోడు అని నీకు తెలుసా? అంది ప్రియ కాస్త కోపంగా! మనకు తెలిసిన మధ్యవర్తులు చెప్పారే! ఓసి ! పిచ్చి అమ్మా! సంబంధం కుదిర్చే వాళ్ళు అలాగే చెప్పుతారు. అక్క గాని, నేను గాని స్వతహాగా మా కాళ్ళమీద మేము, నిలబడే వరకూ పెళ్ళి చేసుకోకూడదు! అని ఎప్పుడో నిర్ణయించు కున్నాము. ప్రియా కాస్త గడుసైన పిల్ల. ఏదైనా, తనకు నచ్చని విషయాన్ని ఖచ్చితంగా వద్దని చెప్తుంది. ఎవరు ఏమి అనుకున్నా పట్టించుకోదు.!ప్రతీ రోజు అబ్బాయి తరుపు, మధ్యవర్తుల నుండి పెళ్లి విషయం ఏం! ఆలోచించారు? అని ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇంట్లో పెళ్ళి ప్రస్తావన తప్ప మాట్లాడటానికి మరో టాపిక్కే లేకుండా పోయింది. పై గా అమ్మకు చుట్టు ప్రక్కల అమ్మలక్కల చెప్పుడు మాటలు ఎక్కువైనాయి. “మంచి సంబంధం అంటున్నారు. వదులుకోవద్దు. ఒక అమ్మాయికి చేస్తే రెండవ అమ్మాయికి కాస్త సర్దుకున్నాక చేయొచ్చు! వచ్చిన సంబధం వదులుకోవద్దు. పిల్లలు వద్దనే అంటారు. వాళ్ళకేం తెలుసు? మనమే నిర్ణయం తీసుకొని వాళ్లను ఒప్పించాలి, అని అంటున్నారు .
రేవతీ నరసింహం గార్లకు ఏమీ చెయ్యాలో పాలుపోవడం లేదు. అమ్మాయిని ఒప్పించటమా ? లేక సంబంధం వదులు కోవడమా? అని తర్జన, భర్జన పడుతున్నారు. ఆఖరికి నరసింహం గారు ఒక నిర్ణయానికి వచ్చి భార్యతో చూడు
రేవతీ ! వాళ్ళు చిన్న పిల్లలు మంచి చెడ్డలు ఆలోచించే వివేకం వాళ్లకు లేదు మనమే వాళ్ళకి నయానో! భయానో! నచ్చచెప్పి ఒప్పించాలి.
అంతే గానీ వాళ్ళ ఇష్టానికి వదిలేస్తే ఇలానే వుంటుంది. మనం తల్లి, దండ్రులం! నిత్యం వాళ్ళ బాగుకోరే వాళ్ళం, వాళ్ళకు కీడు తలపెట్టే వాళ్ళం కాదు కదా! ఈ సంబంధం అయితే అమ్మాయి సుఖ, సంతోషాలతో వుంటుంది అని, నా ఉద్దేశ్యం! ఈ రోజుల్లో చదువుకున్న యువకులు చాలా మంది సరి అయిన ఉద్యోగాలు దొరకక రోడ్ల మీద అవారాగా తిరగటం చూస్తున్నాము.
అలాంటిది ఒక ఉద్యోగి మన అమ్మాయిని ఏరి కోరి పెళ్ళి చేసుకుంటాను అని, ముందుకొస్తే వదులు కోవడం భావ్యం కాదు.! అని దానికి అర్థం అయ్యేలా చెప్పు. ఈ సంబంధం పోగొట్టుకుంటే తరువాత బాధపడాల్సి వస్తుంది అన్నాడు భార్యతో, నర్సింహంగారు. వింటున్నావా? సుజీ! నాన్న చెప్పేమాట అంది అమ్మ రేవతి. ప్లీజ్! అమ్మా! నన్ను ఇబ్బంది పెట్టకండి. నాకు ఇప్పుడే చేసుకోవాలని లేదు! మీరే నన్ను అర్థం చేసుకోండి. ఎందుకు అంత తొందరపడు తున్నారు? నా మాటకూడా వినండి! అని, బతిమాలుతూ చెప్పింది సుజీ!. అలా నెల రోజులుగా ఇంట్లో అమ్మా, నాన్నలు ఆ సంబంధం వదులుకోవటం ఇష్టంలేక, ఆలోచనలతో సతమతమై పోతున్నారు. ఇప్పుడిప్పడే సంతోషంగా గడుస్తుంది! అనుకున్న ఇల్లు తరచూ అమ్మా, నాన్నల గొడవలతో మళ్ళీ గతంలో లాగా మారింది. అమ్మ మాత్రం పెళ్ళికి ఒప్పించటానికి బుజ్జగిస్తూ, బ్రతిమాలుతూ, చెప్తూనే ఉంది. కానీ! సుజిత మాత్రం ససేమిరా వద్దు అని, పెళ్లి విషయాన్ని దాట వేస్తూ వస్తుంది. సహనం కోల్పోయిన అమ్మ రేవతి ఒక రోజు కోపంతో సుజీ పై చెయ్ కూడా చేసుకుంది.అమ్మ కొడుతుందని ఊహించని సుజిత చాలా బాధ పడింది. ఎంత అయినా అమ్మా కూడ ఆడదే కదా నాన్నమాట వినాలసిందే కదా!ఎంతో ప్రేమగా ఉండే అమ్మా, నాన్నలు ముభావంగా ఉంటున్నారు. మనసులో బాధ పడుతున్నట్లు కనిపిస్తున్నారు.భోజనం కూడ సరిగా చేయటం లేదు. ఇదంతా ఆలోచిస్తుంటే ఏమిటీ ఆడపిల్ల బ్రతుకు!స్వేచ్ఛ లేని జీవితం మేనా ? ఆమె అభిప్రాయానికి విలువే లేదా? అమె ఇష్టాఇష్టాల గురించి ఆలోచించే వారే లేరా ?అని మనసులో బాధ పడసాగింది. ఎంతకూ సుజికి నిద్ర రావటం లేదు! ఆలోచించే కొద్దీ దుఃఖం పొంగుక వస్తూంది.ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉంది సుజి. గడచిన సంఘటనలు ఒక్కొక్కటిగా సుజీ మనసును చుట్టు ముట్టాయి. సుజి ! చిన్నతనం లో అమ్మా, నాన్నలు ఏదో ఒక విషయంలో నిత్యం గొడవ పడుతూ ఉండేవారు. చెల్లి ప్రియా, తను బిక్కు, బిక్కుమంటూ నాన్నకు కనిపించకుండా ఓ మూలన కూర్చొని నాన్న ఎప్పుడు బయటకు వెళ్తాడా ? అని ఎదురు చూస్తూ గడిపే వాళ్లం.
నాన్న తరచూ తాగి వచ్చి ఏదో ఒక విషయంలో అమ్మతో గొడవ పడుతుండే వాడు. ఆయన తాగటం అమ్మ రేవతికి అసలు ఇష్టం వుండేది కాదు.పొరపాటున ఆయన తాగకుండా ఇంటికి వస్తే ఆ రోజు అందరికి పండగ లాగే ఉండేది. చాలా సంతోషంగా గడిపే వాళ్ళం.అలాంటి సమయంలో నాన్నకు కొన్ని మంచి మాటలు చెప్పటానికి ప్రయత్నించేది అమ్మ రేవతి, పిల్లలు పెద్ద వాళ్ళు అవుతున్నారు. పైగా ఆడ పిల్లలు. వాళ్ళని బాగా చూసుకోవాలి. పెద్ద చదువులు చదివించాలి. ఘనంగా పెళ్ళిళ్ళు, పేరంటాలు చెయ్యాలి. బాధ్యత అన్నదే లేకుండా వచ్చిన డబ్బులన్నీ మీతాగుడికే తగలెస్తే పిల్లల భవిష్యత్ ఏమిటి? ఒక్కసారైనా ఆలోచించారా ? ఆడపిల్లలు అంటే ఎదిగే కొద్దీ బోలెడన్ని ఖర్చులు కూడా ఉంటాయి. డబ్బు బాగా పొదుపు చేయాలి. ఇక ముందైనా ఆ మాయదారి తాగుడు మానేసి కాస్త బాధ్యతగల తండ్రిగా ఆలోచించండి. నరసింహం గారు చిన్న ప్రభుత్వ ఉద్యోగి. భార్య హౌస్ వైఫ్. మధ్య తరగతి కుటుంబం పైగా ఇద్దరూ ఆడపిల్లలే అవటం మూలంగా భార్య పిల్లల గురించి వారి భవిష్యత్ గురించి తరచూ చెప్తున్న మంచిమాటల మూలంగా రాను రాను నరసింహం గారిలో మార్పు రాసాగింది.
పిల్లలచదువులపై శ్రద్ద చూపేవాడు. డిగ్రీలు చేయించి ఒకరిని బి.ఎడ్ ఒకరిని టీ.టీ.సీ చేయించారు. ఇద్దరూ విద్యా వాలంటీర్లు గా పని చేస్తూ తండ్రికి తోడ్పాటు అందిస్తున్నారు.
నరసింహం గారిలో వచ్చిన మార్పుకు భార్యా, పిల్లలు ఎంతో సంతోషించారు. ఇప్పటికైనా అన్నీ సర్దుకొని అందరం సంతోషంగా ఉన్నామని సుజీ, ప్రియలు తెగ సంబరపడ సాగారు. రోజులు సరదాగా గడచిపోతున్నాయి. ఇప్పుడు వారికి ప్రతి రోజూ పండుగలాగానే సాగిపోతూంది. చూస్తుండగానే సుజి, ప్రియాలు పెద్దవాళ్ళు అయ్యారు. అప్పటి నుండి ఆయన పిల్లల మీద వారి చదువుల మీద శ్రద్ధ చూపేవారు. చిన్నతనంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో !
పోనీలే! ఇప్పటికైన అంతా సర్దుకొని అందరం సంతోషంగా ఉన్నామని ప్రియ, సుజి లు తెగ సంబర పడిపోయారు. రోజూ అందరూ కలసి కాసేపు కబుర్లు చెప్పుకోవడం కలిసి భోజనము చేయటం, ఇలా ఎంతో సరదాగ గడిసి పోతుంది కాలం.ఈ మధ్య ఇంటికి ఎవరో! ఒకరు చుట్టాలు రావడం పెళ్ళి సంబంధాల విషయం, అంటూ, ఆ మాటా! ఈమాటా! ఏవో! కొన్ని వూసుపోనీ కబుర్లు చెప్పటం, చేసేవారు. వాళ్ళు వెళ్ళిన తరువాత అమ్మ, నాన్న లు ఆ విషయాలు చర్చించుకోవడం, వకవేళ మంచి సంబంధం కుదిరితే ఎలాగైనా అమ్మాయిని ఒప్పించాలి. అని పెళ్లి గురించి ఆలోచించ సాగారు. అలా మొదలైన పెళ్లి సంబంధం సమస్య , ఇంట్లోఅందరికి తలపోటుగా తయారైంది.
నావల్ల అమ్మా, నాన్న లు బాధ పడకూడదు. నేను పెళ్ళికి ఒప్పుకుంటే వాళ్ళు సంతోషంగా వుంటారు. నాకు ఇష్టం లేకున్నా అమ్మా, నాన్నలకొరకు తలవంచాలసిందే! వాళ్ళు సంతోషంగా వుండటమే నాకు కావాలి. చెల్లి ప్రియా నేను ఎన్నో అనుకున్నాం. మంచిగా చదువు కున్నాము. జాబ్ చేసి కొంత కాలం అమ్మ, నాన్న లకు అండగా వుండాలి ఇంట్లో అన్నీ సమకూర్చుకోవాలి, ఆ తరువాతే పెళ్ళిళ్ళు చేసుకుందాము అని.
కానీ అదంతా సాధ్యం కాదని అర్థం అయింది.
ఆడ పిల్లలు గా పుట్టడమే తల్లిదండ్రులకు పెద్ద భారం. అలాంటప్పుడు వారు చెప్పినట్లు వింటేనే
వారికి వూరట కలిగించిన దాన్ని అవుతాను. ఆడపిల్లగా పుట్టినందుకు, మగవాడిలా తనకంటూ ఓ ఇష్టం అనేది వుండదు. ఈ రోజు తల్లి దండ్రుల మాట అయితే! రేపు చేసుకున్న వాడి మాట వినాలి
అంతే గదా! ఆడపిల్ల జీవితం! తలవంచక తప్పదు.
సుజీ మనసులోనే పెళ్లి చేసుకొనుటకు నిర్ణయించుకుంది. ఆ విషయమే చెల్లి ప్రియా కి కూడా చెప్పింది. అందుకు ప్రియా ససేమిరా! అంది. ఉదయమే అమ్మ మరలా అడిగింది! ఏమీ ఆలోచించావు? నాన్నకు ఏమీ చెప్పాలి? అని, ఇక చేసేదేమీ లేక అతి కష్టం మీదఅన్యమనస్కంగానే, సరే! మీ ఇష్టం అమ్మా అంది సుజి. అమ్మా , నాన్న ల ఆనందానికి అవధుల్లేవు. మా బంగారు తల్లీ! మా మాట ఎప్పుడూ కాదనదు. మమ్మల్ని బాగా అర్ధం చేసుకుంటుంది. అని మురిసి పోయారు.
పెళ్ళిచూపులకు ఏర్పాట్లు చేద్దాము అన్నాడు నాన్న. తెలిసిన వారందరికీ, మా పెద్ద పెద్దమ్మాయి పెళ్ళి కుదిరింది అల్లుడు గారు హైదరాబాద్ లో బ్యాంక్ లో ఉద్యోగం అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. పోనీలే! అమ్మా, నాన్నలు చాలా సంతోషంగా వున్నారు. నిజంగానే నా సంతోషమే వాళ్ళ సంతోషం కదా! అని తనను తాను సముదాయించు కుంది సుజీ. ఒక మంచి రోజు చూసి హడావుడిగా పెళ్ళి చూపులు ఏర్పాటు చేశారు. కావలసిన వారందరిని పిలిచారు.పెళ్ళి కొడుకు ఓ మాదిరిగా వున్నాడు. ముఖంలో ఏ మాత్రం కళా, కాంతి లేదు. అమ్మాయి మాత్రం కుందనపు బొమ్మలా ఉంది అని కొందరు! ఇద్ధరికి ఏ మాత్రం పొంతన లేదు, అని మరికొందరు అమ్మలక్కలు చెవులు కొరుక్కున్నారు. హా! రంగుదేముంది అమ్మా! బుద్ధి మంచిది అయి ఉండాలి గాని, అయినా అబ్బాయి బ్యాంక్ ఉద్యోగి అంటే! మాటలా! పిల్ల సుఖ పడుతుంది. అందుకే ఒప్పుకున్నారు. అని మరి కొందరు గుసగుస లాడారు. అనుకున్నట్లు గానే ఆ నెలలోనే నిచ్చితార్థం పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగిపోయాయి . అల్లుడికి కట్న, కానుకలు అమ్మాయికి బంగారము ఇంట్లోకి కావాలసిన సామాగ్రి ఏలోటూ లేకుండా అన్నీ బాగానే సమకూర్చారు. మగపిల్లాడు లేని లోటు లేకుండా అల్లున్నే కొడుకులా చూసుకోవాలి అని తెగ సంబర పడ్డారు అత్త , మామలు! పెళ్ళి అయిన వారంలో పెళ్ళి కొడుకు సురేష్ హైదరాబాద్ లోని, హయత్ నగర్లో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. సుజి ! అమ్మ, నాన్న లతో మొట్ట మొదటి సారిగా హైదరాబాద్ మహా నగరం లో అడుగు పెట్టింది. అమ్మ ఇల్లంతా సర్ధి పెట్టింది. కూతురికి తగు జాగ్రత్తలు చెప్పి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో! అల్లుడూ! నీకు ఏ అవసరము వచ్చినా మొహమాట పడకుండా అడగమని, అల్లుడైన కొడుకైనా, నువ్వేనని,
కళ్ళ నీళ్ళు పెట్టుకొని విడువలేక విడువలేక కుమార్తెను విడిచి ఇంటికి బయలు దేరారు రేవతి నరసింహం దంపతులు. అలా ఆరు నెలలు గడిచాయి. సురేష్ ఉదయాన్నే లేచి ఏడుగంటల కల్లా డ్యూటీకి వెళ్ళి మళ్ళా నైట్ ఎనిమిది గంటల కు తిరిగి వచ్చేవాడు. ఇక పగలంతా సుజి ఒక్కతే ఇంట్లో వుండేది. అప్పుడప్పుడు పండగలు, పబ్బాలకు ఇంటికి వెళ్ళి వస్తుండే వారు. అత్త, మామలు అల్లుడిని కాలు కింద పెట్టనిచ్చే వారు కాదు. సకల మర్యాదలు చేసేవారు. అలాగే సెలవు రోజుల్లో ఏ సినిమాలకో అబ్బాయి బ్యాంక్ ఉద్యోగి అంటే మాటలా! పిల్ల సుఖ పడుతుంది. అందుకే ఒప్పుకున్నారు. అని మరి కొందరు గుసగుస లాడారు. అనుకున్నట్లు గానే ఆ నెలలోనే నిచ్చితార్థం పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగిపోయాయి. అల్లుడికి కట్న, కానుకలు అమ్మాయికి బంగారము ఇంట్లోకి కావాలసిన సామాగ్రి ఏ లోటూ లేకుండా అన్నీ బాగానే సమకూర్చారు. మగ పిల్లాడు లేని లోటు లేకుండా అల్లున్నే కొడుకులా చూసుకోవాలి అని తెగ సంబర పడ్డారు. అత్త , మామలు పెళ్ళి అయిన వారంలో పెళ్ళి కొడుకు సురేష్ హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు . సుజి అమ్మ, నాన్న లతో మొట్ట మొదటి సారిగా హైదరాబాద్ మహా నగరం లో అడుగు పెట్టింది. అమ్మ ఇల్లంతా సర్ధి పెట్టింది. కూతురికి తగు జాగ్రత్తలు చెప్పి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో! అల్లుడూ నీకు ఏ అవసరము వచ్చినా మొహమాట పడకుండా అడగమని అల్లుడైన కొడుకైనా నువ్వేనని కళ్ళ నీళ్ళు పెట్టుకొని విడువ లేక విడువలేక విడిచి ఇంటికి బయలు దేరారు . రేవతి నరసింహం దంపతులు అలా ఆరు నెలలు గడిచాయి. సురేష్ ఉదయాన్నే లేచి ఏడు గంటల కల్లా డ్యూటీకి వెళ్ళి మళ్ళా నైట్ ఎనిమిది గంటల కు తిరిగి వస్తాడు.
ఇక పగలంతా సుజి ఒక్కతే ఇంట్లో వుంటుంది. అప్పుడప్పుడు పండగలు, పబ్బాలకు ఇంటికి వెళ్ళి వస్తుండే వారు. అత్త, మామలు అల్లుడిని కాలు కింద పెట్టనిచ్చే వారు కాదు. సకల మర్యాదలు చేసేవారు. అలాగే సెలవు రోజుల్లో ఏ సినిమాలకో, షికార్లకో రెస్టారెంట్లకో, వెళ్తుండే వారు. ఉదయాన్నే భర్తకు బాక్స్ పెట్టి ఆఫీసుకు
పంపించిన తరువాత సాయంత్రం వరకు ఖాళీగానే వుండాల్సి వస్తుంది. ఇంత చదువుకొని ఏమీ చెయ్యలేక పోతున్నాను అనే బాధ మాత్రం సుజిని వెంటాడుతూనే ఉంది. ఇంటి దగ్గర వుంటే ప్రతి రోజూ స్కూల్ కి వెళ్లేదాన్ని.ఇలా ఆలోసిస్తూ కూర్చున్న సుజితకు అసలు ఈయన బ్యాంక్ దగ్గరలో ఇల్లు తీసుకుంటే బాగుండేది కదా! ఇంత దూరంలో ఎందుకు తీసుకున్నట్లు పైగా,
ఈ ఆరునెలల కాలంలో ఆయన శాలరీ ఎంత? ఏమిటి? అని కూడా నాకు తెలియదు. సురేష్ ఎప్పుడూ చెప్పలేదు. అప్పుడప్పుడు ఏదో అవసరమని, అమ్మా, నాన్న ఇచ్చిన డబ్బులు,నా దగ్గరవే తీసుకొనే వాడు. ఓ రెండు నెలల క్రితం ఎవరో స్నేహితుడు కష్టంలో వున్నాడని, అతనికి నా సహాయం ఎంతైనా అవసరం అని,అంత డబ్బు నాదగ్గరలేదు. నీ నగలు బ్యాంక్ లో పెట్టి అతని అవసరానికి ఇస్తే మళ్ళీ త్వరలోనే విడిపిస్తాడు. అతను నాకు మంచి స్నేహితుడు అని చెప్పాడు.
ఈ విషయాన్ని మీ అమ్మా, నాన్న లకు చెప్పొద్దులే! త్వరలోనే విడిపించుదాం అన్నాడు. అప్పుడు బ్యాంక్ లో పెట్టిన బంగారు నగలు ఇప్పటివరకు విడిపించలేదు. జీతం డబ్బులు ఏం జేస్తున్నాడో తెలియదు? ఇంతకీ ఈయన జాబ్ చేస్తున్నాడా! లేదా? లేక అబద్ధం చెప్పాడా? శాలరీ వస్తే ఇంటి ఖర్చులకు నా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటున్నాడు? ఫ్రెండ్ పేరు చెప్పి గోల్డ్ ఎక్కడ పెట్టాడు?ఆ ఫ్రెండ్ ఎవరు? ఇలా పగలంతా ఒక్కతే ఆలోచనలో మునిగి పోయేది. తనదగ్గర ఏదో దాస్తున్నాడని మొదటి సారిగా సుజికి సురేష్ పై అనుమాన మొదలైంది. ఎప్పుడైతే అనుమానం మొదలైందో! సుజి బుర్ర వేడెక్కి పోతుంది.
అలా రకరకాల ఆలోచనలతో, నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. కాలింగ్ బెల్ మ్రోగడంతో అయ్యో! చాలా టైమ్ అయినట్లు ఉంది. ఇంత మొద్దు నిద్ర పోయానేంటి? ఈయన గారు వచ్చినట్లుగా ఉంది.
ఇప్పుడే ఈయనను ఏమీ, అడగకూడదు?
ఇది కేవలం నా అనుమానం మాత్రమే, అనుకుంటూ, త్వర, త్వరగా వెళ్ళి తలుపు తీసింది. వచ్చిన వ్యక్తిని చూసి, కట్టలు తెంచుకువస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక పోయింది సుజి.! అమ్మా! అంటూ బావురుమంది.
కూతురు అలా ఏడుస్తుంటే ఎదో జరిగి వుంటుంది అనుకొని, ఏమైంది తల్లీ! అల్లుడు గారు ఏమైనా, ఇబ్బంది పెడుతున్నాడా ! చెప్పు తల్లీ! అంటూ తల్లి కూడ ఏడ్చింది. అదేమి లేదమ్మా! నువ్వు వస్తావని అసలు ఊహించలేదు. సడన్ గానిన్ను చూసే సరికి నాకు ఏడ్పు వచ్చింది. అంతే! అంది సుజి. హమ్మయ్యా! అంతేనా! వీళ్ళు ఇద్దరు బాగానే
వున్నారు. అని మనసులోనే అనుకొని గుండె నిండా గాలి పీల్చుకుంది రేవతి. అప్పుడే తన భర్త మీద వచ్చిన అనుమానాన్ని అమ్మకు చెప్పకూడదు.! అసలే , అల్లుడంటే విపరీతమైన ప్రేమా, ఆప్యాయతలు ఎక్కువ! ఈ విషయం అప్పుడే వాళ్ళతో చెప్పి వాళ్ళ సంతోషాన్ని ఎందుకు పాడుచేయాలి. అని మనసులోనే అనుకుంటూ! అవునమ్మా ! చెప్పా, పెట్టకుండా, ఇంత ఆకస్మాత్తు గా, ఒక్క దానివి, ఏలా వచ్చావు.? నాన్న చెల్లి నిన్ను ఒక్కదాన్ని ఎలా పంపించారు? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంది, అమ్మను చూసిన ఆనందంలో సుజి. ఎప్పుడూ ఇంట్లో నుండి బయటకు వెళ్లని అమ్మ తను ఎలా వచ్చిందో!
నాన్న , చెల్లి ఎలా పంపించారో ! అంతా పూస గుచ్చినట్లు చెప్తూ, అల్లుడి గురించి అడిగింది.
ఈ రోజే ఎందుకో ఆలస్యం అయింది అమ్మా! ఆయనగురించి ఎదురు చూస్తూ నిద్రలోకి వెళ్లాను. ఈ లోగా నువ్వు వచ్చావు అంది. రోజూ ఎనిమిది గంటలకల్లా వచ్చే సురేష్ రాత్రి పది గంటలైనా రాకపోయే సరికి సుజికి ఒకింత ఆందోళన మొదలైంది. ఈయనగారు ఇంకా, రాలేదేమిటీ ? ఎదైనా పని ఉంటే ఫోన్ అయినా చెయ్యొచ్చు కదా! తనే ఫోన్ చేసి, అమ్మ వచ్చింది అని, చెప్పుదామంటే, ఆయన ఫోన్ స్వచ్ఆప్ వస్తోంది. పాపం ! అమ్మ అల్లుడి గురించి చూసి, చూసీ ఇంకా రాలేదు. రోజూ ఇలాగే వస్తాడా? అని కాస్త ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రయాణ బడలిక వల్ల నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. రాత్రి సమయం గడిసే కొద్దీ, సుజి గుండెళ్ళో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఒక ప్రక్క కోపం! మరో ప్రక్క భయం మొదలైంది. రాత్రి ఒంటిగంట సమయంలో కాలింగ్ బెల్ మ్రోగింది. భయపడుతూనే తలుపు తీయాలా ? వద్దా? అనుకుంటూ తలుపు దగ్గరకు వెల్లింది సుజి.అంతలోనే మళ్ళా అనుమానం వచ్చింది ఈయనా! లేక ఎవరైనా! దొంగలా? అసలే ఇది హైదరాబాద్ మహా నగరం! భర్తకు ఫోన్ చేసింది సుజి. ఫోన్ స్వచ్ ఆప్ వస్తుంది. ఒక్కదాన్నే తలుపు తీయటం అంత మంచిది కాదేమో! అనుకొని ఎందుకైనా మంచిది అని అమ్మని కూడా లేపింది. అల్లుడు ఇంకా రాలేదా? తల్లీ! అంటూనే లేచింది. అదే పనిగా బెల్ మ్రోగడంతో అల్లుడు వచ్చాడేమో ! వెళ్ళి తలుపు తియ్యి తల్లీ! అంది అమ్మ. నాకు భయం వేస్తుంది అమ్మా! అంటూ తన అనుమానం వ్యక్తం చేసింది సుజి. అయ్యో! తల్లీ! అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది రేవతి.
తలుపు తీసిన అత్తగారిని చూసి ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాడు సురేష్. వెంటనే సర్దుకొని మీరెప్పుడు వచ్చారు? అనుకుంటూ! సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. ఆయన ప్రవర్తనలో మార్పును గమనించిన రేవతికి మనసులో ఆలోచనలు మొదలయ్యాయి. వీళ్ళు ఇద్దరూ మంచిగానే ఉంటున్నారా ? లేక గొడవలు పడుతున్నారా?
పిల్లని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా ? రోజూ ఇలాగే వస్తాడా ? లేక ఈ రోజే ఇలా వచ్చాడా ?కూతురు ఏన్ని కష్టాలు పడుతుందో ! అని పలు రకాల ఆలోచనలతో ఆ రాత్రి అసలు నిద్ర పట్టలేదు రేవతి కి. ఉదయమే లేచి ఆఫీసుకి రెడీ అవుతున్న అల్లుడిని పలకరిస్తూ ! చూడు అల్లుడు ! మీరు ఎలా వున్నారో! ఏమిటో! అని ఒకటే దిగులుగా అనిపించి, ఓ సారి చూసి పోదామని వచ్చాను.
ఈ రోజు నేను వెళతాను. మళ్ళీ నువ్వు ఏ రాత్రికి వస్తావో! ఏమో? అందుకే చెపుతున్నా! కాస్తా పెందలాడే వస్తావుండు. ఇంట్లో అమ్మాయి ఒక్కతే వుంటుంది గదా! అసలే రోజులు బాగా లేవు.
రాత్రి నేను వున్నాను కాబట్టి సరిపోయింది.
అది ఎంత భయపడిందో ! తెలుసా? అయినా! బ్యాంక్ కి దగ్గరలో ఇల్లు తీసుకుంటే బాగుండేదేమో ? ఇంత దూరం నుండీ వెళ్ళటం రావడం నీకు కష్టమే కదా! అని నెమ్మదిగా మందలించింది అత్తగారు. సరే అత్తయ్యా! సాయంకాలం త్వరగానే వస్తాను. ఈ రోజు ఉండండి. నేను వచ్చిన తరువాత వెలుదురు గానీ అని హడావుడిగా వెళ్ళిపోయాడు సురేష్.
అలా వెళ్లిన సురేష్ వస్తానన్న టైమ్ కి రాక పోగా ఫోన్ కూడా చెయ్యలేదు. అల్లుడి విషయం ఏదో తేడాగానే వుంది. అనేది గమనించిన రేవతి అసలు వీళ్ళిద్దరి మధ్యా ఏమీ జరుగు తుందో ! కూతుర్ని నెమ్మదిగా అడిగి తెలుసుకోవాలి. నేను రావడం మంచిదే అయింది. అమ్మాయి మీద చెడుగా కలగన్న దగ్గర నుండి నా మనసు మనసులో లేదు. ఈ రోజు కూడా సురేష్ ముందు రోజు లాగానే,
రాత్రి ఒంటిగంటకు వచ్చాడు. ఏంటి! అల్లుడు, ఇంత టైమ్ అయింది.? నేను వెళ్తానని చెప్పాను కదా! ఓ ఫోన్ లేదు ఏమీ లేదు?. ఉదయం ఎక్కితే ఇప్పటికీ ఇంటికి వెళ్ళిపోయే దాన్ని కదా! అంది రేవతి. నాకు ఎన్నో పనులు ఉంటాయి.
బ్యాంక్ లో వర్క్ ఎక్కువగా ఉంది. వున్న ఫలంగా రావాలి అంటే ఎలా, కుదురుతుంది?
ఇప్పుడు వెళ్తానంటే చెప్పండి, కారు మాట్లాడతాను అన్నాడు, సురేష్ వద్దులే బాబు పొద్దున్నే బస్సు లో వెళతాను. అంది రేవతి. మీ అమ్మాయి సుజిని కూడ తీసుకొని వెళ్ళండి కాస్త పనివత్తిడి తగ్గిన తర్వాత పండుగ నాటికి వస్తాను అన్నాడు సురేష్. సుజీని కూడా ఇంటికి తీసుకువెళ్ళండి అనగానే సుజీ మనసులో చాలా సంతోషం కలిగింది. అమ్మాయిని తీసుకొనే వెళ్ళాలి! అల్లుని విషయం కూడ ఏదో తేడాగానే కనపడుతున్నది అని అనుకున్న రేవతి ముందు ఇక్కడి నుండి మంచి తనంగానే వెళ్ళాలి. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏమీ జరుగుతుందో ! ఇంటికి వెళ్లిన తర్వాత కూతుర్ని అడిగి తెలుసుకోవాలి. ఉదయాన్నే లేచి డ్రస్ లు అమ్మ బ్యాగ్ లో కొన్ని సర్దుకుంది సుజీ! సురేష్ కి బాక్స్ పెట్టి సురేష్ బ్యాంక్ కి, నేను, అమ్మ బస్ స్టేషన్ కి వెళ్ళాము. అమ్మ సురేష్ కు మరీ మరీ చెప్పింది. వారం ఆగి, సంక్రాంతికి పండుగకు తప్పనిసరిగా రమ్మని! అలాగే “త్వరగా రండీ “వెంటనే తిరిగి వచ్చేద్దాము అంది సుజీ! మేము ఇంటికి వెళ్ళి వారం రోజులు గడిచిపోయాయి. ఏ ఒక్క రోజు సురేష్ నుండి ఫోన్ రాలేదు. నాకు ఏమీ చెయ్యాలో అర్ధం కావడంలేదు. అమ్మ, నాన్న లు అసలు ఏమి జరిగిందో! చెప్పమని గుచ్చి, గుచ్చి అడుగుతున్నారు. నేను పగలంతా అమ్మ, నాన్నల ముందు ఎంతో సంతోషంగా ఉన్నట్టు నటించ సాగాను. సురేష్ ఈ రోజు మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నాడని అందర్నీ అడిగాడు అని సర్ధి చెపుతూ వచ్చాను. కానీ! ఫ్రెండ్ లాంటి చెల్లీ ప్రియాకి మాత్రం అబద్దం చెప్పలేక పోయాను.
చెల్లి సురేష్ పై తనకు వున్న అనుమానం నిజమైందని గ్రహించింది. పగలంతా అందరితో సరదాగా ఉండి రాత్రి అందరూ పడుకున్న తరువాత మౌనంగా ఏడుస్తుండే దాన్ని .
రాత్రి సమయంలో భర్త కు మెసేజెస్ చేసినా, ఫోన్ చేసినాఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదు? నేను సురేష్ గురించి నిజం దాస్తున్నాను అని, ఏదో మోసం జరిగింది అని, అమ్మ రేవతి గ్రహించింది.
తను అక్కడి పరిస్థితిని కళ్ళారా చూసింది కనుక.
రేవతి ఇప్పుడు బాధ పడసాగింది. “తన కూతురు పెళ్ళి ఇప్పుడే వద్దూ,! అని ఎంత మొత్తుకున్నా, వినకుండాపెళ్లిచేసాము. మద్యవర్తుల మాటలు విని నిజానిజాలు తెలుసుకోకుండా! అబ్బాయి మంచోడని,! మేమే దాని జీవితం నాశనం చేసిన వాళ్ళం అయ్యాము. అని మనసులోనే కుమిలిపోసాగింది . ఇంకా విషయం తెలియని నాన్న అల్లుడు ఫోన్ చేశాడా! ఎప్పుడు వస్తాడో! అడుగు! ఇలా అడుగుతున్నాడే! గానీ అల్లుడు మీద ఏ మాత్రం చెడు అభిప్రాయం ఆయనకు కలగటం లేదు. అలాంటి నాన్నకి నీ అల్లుడు మనందరినీ మోసం చేశాడు అని ఎలా చెప్పాలి? చెపితే ఆయన తట్టు కుంటారా? గుడ్డి నమ్మకంతో ఏమి చూడకుండా తొందరపడి పెళ్లి కుదుర్చుకున్నాము. ఇలా పలు రకాల ఆలోచనలతో ఎవరికి వాళ్ళమే ఆలోచించ లేక పిచ్చి వాళ్ళం అయిపోతున్నాము . ఒక్క నాన్న తప్ప. అల్లుడికి ఏదో పని ఉంటం వలన రాలేక పోయింటాడు. వస్తాడులే అనుకునే వాడు. అల్లుడి మీద ఆయనకు అపారమైన నమ్మకం. అలా రోజులు గడిచిపోతున్నాయి. పండుగ కూడా జరిగి పొయింది. వస్తానన్న అల్లుడు రాలేదు. ఫోన్ కూడా చెయ్యలేదు. నేను సరిగా భోజనం కూడా చేయలేక పోతున్నాను. కడుపుకు అన్నం లేదు కంటికి నిద్ర లేదు? ఎవరికి చెప్పుకోవాలో! తెలియటం లేదు? ఏదో మోసానికి గురి ఐనాము అని మాత్రం నాకు పూర్తిగా అవగాహనకు వచ్చింది.
ఇప్పటికే, చుట్టు ప్రక్కల అమ్మలక్కలు అందరూ గుసగుస లాడుకుంటున్నారు. మీ అమ్మాయి వచ్చి చాలా రోజులు అయింది. మీ అల్లుడు పండక్కి రానట్టు వున్నాడు. ఏమైనా! గొడవలా? ఇలా రకరకాలుగా మాట్లాడు తున్నారు. నాన్నకి నీ అల్లుడు మనందరినీ మోసం చేశాడు అనిచెప్పాలి? చెపితే ఆయన తట్టునమ్మకంతో ఏమి చూడకుండా తొందరపడి పెళ్లి కుదుర్చుకున్నాము. ఇలా పలు రకాల ఆలోచనలతో ఎవరికి వాళ్ళమే పిచ్చి వాళ్ళం అయిపోతున్నాము. ఒక్క నాన్న తప్ప. అల్లుడికి ఏదో పని ఉంటం వలన రాలేక పోయింటాడు. వస్తాడులే! అనుకునే వాడు. అల్లుడి మీద ఆయనకు అపారమైన నమ్మకంఅల్లుడు పండుగకు రాక, కనీసం ఫోన్ కూడా చేయక పోయేసరికి నరసింహం గారికి కూడా అనుమానం మొదలైంది. ఒకరోజు సుజిని కూర్చోపెట్టి ఏమి జరిగిందో! అంతా తెలుసుకున్నారు. తాకట్టు పెట్టిన నగలు వారంలో తెచ్చి ఇస్తానన్నా, నెలలు గడిచినా ఇంత వరకూ తేలేదని, జీతం సొమ్ము ఒక్కసారి కూడా చూపించ లేదని. మీ బ్యాంక్ కు వకసారి తీసుక వెళ్ళండి అన్నా మాట్లాడలేదని నెలనెలా . అద్దె కూడా సరిగా ఇవ్వటం లేదని ఓనర్ ఆంటీ వాళ్ళు చెప్పారు. ఇలా అన్ని విషయాలు కూతురు ద్వారా విన్న నరసింహం గారు మోసం జరిగిందని గ్రహించి గుండెలవిసేలా! ఏడ్చారు. ఇంతలో
చిన్న కూతురు చిట్టి వచ్చి ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? లక్షల రూపాలు నష్టపోయాము. నగలు, పెట్టిన వస్తువులు, ఆయన దగ్గరకు చేర్చాము. ఇంకా ఏమి మిగిలింది మనకు!
ఆ రోజే అక్క, నేను చెప్పాము మా, కాళ్ళ మీద మేము నిలబడాలి! అంతవరకు, పెళ్ళి వద్దూ, అంటే ఒక్కరంటే ఒక్కరు మా మాట వింటే గదా ! అంది చెల్లి ప్రియా ఎంతో, ఆవేదనగా! ఇప్పుడు ఏడ్చి లాభం లేదు. ఇంత చదువుకొని అందరం అతని చేతిలో మోసపోయాము తరువాత అతనికి ఎలా బుద్ధి చెప్పాలో! ఆలోచించండి. ఏడుస్తూ కూర్చుంటే మరోసారి మోసపోయినట్లే! ధైర్యంగా, ఈ సమస్యకు పరిష్కారం ఆలోసిద్ధాం. నెలలు గడుస్తున్నా , అల్లుని దగ్గర నుండి ఎటువంటి సమాధానం లేదు. నరసింహం గారు చేసిన పెద్ద తప్పు ఏంటి అంటే? పెళ్ళికి ముందు అబ్బాయి పని చేసే బ్యాంక్ ఎక్కడ? జీతం ఎంత? ఉద్యోగం
పర్మినెంటా కాదా? మొదలైన విషయాలన్నీ తెలుసుకోకుండా మధ్యవర్తుల మాటలు నమ్మి పెళ్ళికి ఒప్పుకోవటమే? ఇప్పుడు అన్యాయంగా కూతురు గొంతు కోశాను, అని బాధ పడుతున్నారు.
బయటకు చెప్పుకుంటే ఎక్కడ పరువు పోతుందో అని ఎవరికీ చెప్పలేక, సమస్యను పరిష్కరించు కోలేక, కుమిలిపోతు న్నారు బయట కనిపిస్తే ఎవరేమి ప్రశ్నిస్తారో ! అని బయటికి కూడా కనిపించకుండా ఇంట్లోనే బాధ పడ సాగారు అమ్మా, నాన్నలు, నేను రోజు రోజుకు నీరసించి పోసాగాను.
నా బాధను చూచి నాన్న తట్టుకోలేక పోయొవాడు. బ్రతిమాలి అన్నం తినిపించేవాడు. నా కాళ్ళ దగ్గర కూర్చోని కాళ్ళు వత్తుతూ, తలవత్తుతూ, నన్ను అంటిపెట్టుకొని ధైర్యము చెపుతూ, నేను ఎంత పొరపాటు చేశాను తల్లి! నేను చేసిన తప్పుకు నా కూతురు శిక్ష అనుభవిస్తుంది. నన్ను క్షమించు తల్లీ,! అని బాధ పడేవాడు. ఎలాగైనా నీ జీవితాన్ని నేనే సరిదిద్దాలి! నువ్వు ధైర్యంగా వుండాలి అమ్మా! ఈ నాన్న వున్నంత కాలం నీకు అన్యాయం జరగనివ్వడు.
నేనే అల్లుడితో మాట్లాడతాను. ఏమి కావాలో , తెలుసుకొని, అడిగింది ఇచ్చి నీ కాపురం నిలపెడతాను తల్లి! అని దైర్యం చెప్పాడు.
నా కూతురు జీవితం కన్నా , నాకు ఏది ముఖ్యం కాదు. నేనే తీసుకొని వెళ్ళి అల్లుడి దగ్గర దించివస్తాను అనే వాడు తెలిసిన వారిని తీసుకొని అబ్బాయి ఇంటికి వెళ్ళి మాట్లాడారు. సురేష్ తల్లిదండ్రులు ఏ మాత్రం బాధ్యత లేకుండా మాట్లాడారు. సురేష్ పెళ్లి అయివెళ్లిన దగ్గరనుండి మాకు ఫోన్ చేయటంగాని, ఇంటికి రావటం గాని లేదు. ఎక్కడ ఉన్నాడో తెలియదు, అని చెప్పారు. పెళ్లి పెద్దలు చిన్నగా తప్పించుకున్నారు. ఊర్లో
వారికుటుంబం గురించి ఆ అబ్బాయి గురించి ఆరా తీయగా వాడు ఊర్లు పట్టుకొని తిరుగు
తుంటాడు. అప్పుడప్పుడు కనపడతాడు కానీ ఎవరితో మాట్లాడడు. వాడి ఉద్యోగం సంగతి కూడ ఎవరికీ తెలియదు. పెద్ద మోసగాడు. ఎక్కడ ఉంటాడో కూడా ఎవరికి సరిగా తెలియదు అన్నారు. నరసింహం గారు జరిగిన మోసం తెలుసుకొని నిస్సహాయంగా ఇంటి ముఖం పట్టారు. కేసు పెడితే పరువు పోతుంది. ఏమి చేయాలి? మరో ఆరునెలలు గడిచాయి. పెళ్ళి రోజు వచ్చింది. ఆ రోజంతా సుజీ ఫోన్ చేస్తూనే ఉంది. మనసు మారి ఫోన్ తీస్తాడేమోనని! ఎన్ని సార్లు చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఎదైనా కొత్త నెంబర్ తో ఫోన్ వస్తే, అందరూ ఉరుకులు, పరుగులతో వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసే వారు. ఎవరి ఫోన్ నెంబర్ నుండైనా
చేస్తున్నాడేమో! అని కానీ ఆ రోజంతా ఎటువంటి ఫోన్ రాకపోయే సరికి అసలు ఎలా, మర్చిపోయాడు? ఈ రోజు పెళ్ళిరోజు కూడా గుర్తు లేదా? వారంలో వస్తానన్నాడు. ఎంత నమ్మ బలికాడు? రాకపోతే రాకపోయే! ఫోన్అయినా
చెయ్యొచ్చు కదా! అని ఆ రాత్రంతా ఏడ్చుకుంటూ గడిపాము ఇంట్లో నలుగురు పరిస్థితి అంతే? ప్రియా మాత్రం వాళ్ళ బావ సురేష్ గురించి
ఎంక్వైరీ చేస్తూనే ఉంది. ఏమైవుంటాడు! ఏదైనా ప్రమాదంలో ఉన్నాడా! అసలు వున్నాడా ? లేడా? ఎందుకు మమ్ముల్ని ఇలా వేధిస్తున్నాడు. చాలా మందిని ఎంక్వయిరీ చేయటం మొదలు పెట్టింది. సురేష్ కు ఒక దూరపు బంధువు ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుంది. తిరుగు బోతు ఐన సురేష్ కు ఏదో రకంగా పెళ్లి చేస్తే తర్వాత వాడే మారుతాడుఅని, మధ్యవర్తుల ద్వారా నమ్మ బలికించి పెళ్లి కుదుర్చుకున్నారట. పెళ్లి జరిగితే మనిషి మారుతాడు. నెమ్మదిగా వాడే ఏదో ఉద్యోగం సంపాదించు కుంటాడు. చేతిలో డబ్బు ఉంటుంది కాబట్టి అనుకున్నారు. కానీ పెళ్లి జరిగినా వాని బుద్దిలో మార్పు రాలేదు. అందరిని మోసం చేసాడు.
వాడికి ఏ బ్యాంక్ ఉద్యోగం లేదు. అంతా మోసం ఆ మోసాన్ని మీ అక్క గ్రహించి నట్లు తెలిసుకొని ఇక మీకు కనపడకుండా ముఖం చాటేసాడు. వాడు పెద్ద మోసగాడు. అని చెప్పాడు. ఒక్కసారి ప్రియ కుప్పకూలీ పోయింది. పెళ్లి కొడుకు గుణగణాలు, వాడి ఉద్యోగం వివరాలు. కుటుంబ నేపథ్యం తెలుసుకోకుండా ఆడపిల్లలకు పెళ్లి కుదుర్చు కొని కొందరు అమాయక తల్లి దండ్రులు మోసపోతున్నారని పేపర్లో చూసాము గాని నిజంగానే అమ్మా, నాన్నలు మోసపోయారు. అది వారి అమాయకత్వం. నాన్న చేసిన పెద్ద తప్పు.
చాలా బాధగా ఇంటికి చేరింది ప్రియ. అందరిని కూర్చో పెట్టి అక్క విషయంలో తాము మోసపోయిన విషయం తెలియజేసింది. అందరూ గొల్లు మని ఏడ్చారు. మనం అధైర్యపడకుండా వాడికి ఎలాగయినా బుద్ది చెప్పాలి. అక్కకు, అమ్మా నాన్నలకు ధైర్యం చెప్పింది ప్రియ. ఆ రాత్రి సుజీ అన్నం తినకుండా పడుకుంది. నాన్న బజారుకు వెళ్ళివస్తానని చెప్పి బయటకు వెళ్ళాడు.
అమ్మ ఇంటి పనుల్లో ఉంది. ప్రియ నాతోనే ఉండి అన్నం తినమని, బ్రతిమిలాడుతూంది. ఇంతలోబయటకు వెళ్లిన నాన్న వచ్చారు. అమ్మను అడిగారు. పిల్లలు భోజనం చేశారా! అని,
లేదని చెప్పింది రేవతి. పడుకున్న సుజీ కాళ్ళు నొక్కుతూ నానీ!అంతా నా తప్పు అమ్మా? నన్ను క్షమించు తల్లి! లేచి భోజనం చేయి తల్లి. నువ్వు తింటేనే నేను తింటాను. అంటూ సుజీ కాళ్ళ దగ్గర పడుకున్నాడు. చాలా సేపు గడచింది.
ఎంత సేపు పడుకుంటారు. అందరూ భోజనానికి లేవండి అని అమ్మ పిలిచింది. ప్రియకూడా లేచి నాన్నాను పిలిచింది. ఎంతకూ నాన్న లేవక పోవటంతో సుజీ కంగారు పడుతూ నాన్న లెగునాన్న అని గట్టిగా పిలిచింది నాన్న ఎంతకూ లేవటం లేదు. నాన్నకు ఏదో జరిగిందని అమ్మ పెద్దగా అరచింది. చెల్లి నేను నాన్నను కదుపుతూ పెద్దగా
ఏడుస్తున్నాము. చుట్టు ప్రక్కల వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరో డాక్టర్ ను తీసుక వచ్చారు. డాక్టర్ చూసి గుండె పోటు వచ్చింది అని చెప్పారు. నాన్న శాశ్వత నిద్రలోకి జారిపోయారు. ఇల్లంతా రోదనలతో నిండిపోయింది. నెలలు గడుస్తున్నా , అల్లుని దగ్గర నుండి ఎటువంటి సమాధానం లేదు. నరసింహం గారు చేసిన పెద్ద తప్పు ఏంటి అంటే? పెళ్ళికి ముందు అబ్బాయి పని చేసే బ్యాంక్ ఎక్కడ? జీతం ఎంత? ఉద్యోగం
పర్మినెంటా కాదా? మొదలైన విషయాలన్నీ తెలుసుకోకుండా మధ్యవర్తుల మాటలు నమ్మి పెళ్ళికి ఒప్పుకోవటమే?

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!