అంశం: స్వేచ్చా స్వాతంత్ర్యం ఎక్కడ!?
ప్రజాస్వామ్యమా ఏది నీ చిరునామా?!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు
ప్రజాస్వామ్యమా ఏది నీ చిరునామా?!
రౌడిమూకలరణరంగము
రుధిరధారలతో రహదారులు
దోపిడిదారుల వీరవీహారం
దురాచారాల దుష్టజనం
ప్రజాస్వామ్యమా ఏది నీచిరునామా?!
నకిలినోట్లతో వ్యాపారం
కల్తీసరకులతో వారపుసంతలు
కుతంత్రపు రాజకీయాలు
కలుషితనీటితో నదీనదాలు
వంతెనలున్నా వరదలు
రహదారులన్ని గుంతలు
నరకివేయబడిన తరువులు
కబ్జాచేయబడిన చెరువులు
ఇదే ఇదే స్వేచ్ఛాస్వాతంత్ర్యమా!?
ప్రజాస్వామ్యమా!ఏది నీచిరునామా?!.