భరతమాత తల ఎత్తేనా

అంశం: స్వేచ్చా స్వాతంత్ర్యం ఎక్కడ!?

భరతమాత తల ఎత్తేనా
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: దొడ్డపనేని శ్రీవిద్య

భారత మాత స్వేచ్చా వాయువులు పీల్చుకుంటున్న
73 వత్సరాల గణతంత్ర దినోత్సవం లో….

వనితలకి స్వేచ్ఛ ఎక్కడ
అరాచకాల సంస్కృతి నడుస్తున ఈ కాలంలో
నా సోదరీమణులకు స్వతంత్ర్యం ఎక్కడ…

చిన్న పిల్లలను సైతం వదలని
కూర మనస్కుల మధ్య
భావితరాలకు స్వేచ్ఛ ఎక్కడ….

భరత మాత ముద్ధు బిడ్డ లైన రైతన్నలకి స్వేచ్ఛ ఎక్కడ…
సామాన్యులు ఎన్నో సమస్యలతో తల మునకలవుతున్న ఈ రోజుల్లో..
స్వేచ్ఛా స్వాతంత్ర్యం ఎక్కడ…

మానవత్వం నిండి
కుల మత బేధాలెరగక
భిన్నత్వం లో ఏకత్వం లా
సోదర భావంతో
అంతా.. మనమంతా ఒక్కటే అని కలిసి మెలిసి
నడుచు కున్న రోజున
సకల భరతావనికి
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు
వచ్చినట్లే అని…
ఎందరో మహానుభావుల
త్యాగ ఫలం ను
వృధా కానివ్యక ..
సమతా మమతలతో
యువతరం నడుచుకున్న రోజున 73 వత్సరాల
గణతంత్ర సంబరాలు అంబరాన్ని అంటినట్లే
జై హింద్
జై భారత్

You May Also Like

5 thoughts on “భరతమాత తల ఎత్తేనా

 1. నిజమే ఇన్ని ఘోరాలు జరుగు తుంటే స్వేచ్ఛ వచ్చి నట్లేనా మనకీ
  🤦‍♂️🤔🤔🤔👌👍

 2. నిజం చెప్పారు విద్య గారు
  అన్ని సమస్యలతో భారత మాత తల ఏతేనా

  1. ధన్యవాదములు కవిత గారు
   🙏🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!