కాపురంలో కల్లోలం

కాపురంలో కల్లోలం

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

ఏంటి మావ! కనీసం ఈ గంజి నీళ్లు అన్నా తాగకుండా అలా పడుకుండిపోయావ్?

ఏంటో నే లచ్చి,  ఏం తినాలనిపియట్లేదు?  పొద్దెక్కినప్పటి  నుంచీ ఒకటే ఒళ్ళు నొప్పులు,  జ్వరం గాని వచ్చిందేమో తెలియలేదే.

నీ ఒళ్ళు నొప్పులు తీర్చాలంటే నేనున్నాగా మావ. నీకెందుకు అంత దిగులు.  వెల్లకిలా పడుకో. ఆ మంచం మీద..  నేను వచ్చి నూనె మర్దన చేత్తాను.

నిజమేనే లచ్చి,  నువ్వు  అలా నూనె మర్దనా చేస్తుంటే,  అలిసొస్తే ఆయిల్ పెడతా….  మూడు వస్తే ముద్దులు పెడతా… అన్న పాట గుర్తుకొస్తాదే.

నువ్వు అలా జుట్టు మెలిపెట్టి , చీర కొంగు దోపి, కుచ్చెళ్ళు మొత్తం పైకెత్తి పెట్టుకుని, మంచం పైన ఉన్న నా  పైకి ఒంగి,  అలా నూనె పెడుతుంటే,  నీ అందాలన్నీ నన్ను చూసి ఊరిస్తాయే నా ముద్దుగుమ్మ.

తొందరగా రాయే, ఆ పని ముగించుకుని నాకు నూనె మర్డించు అంటూ..  ఏదో వస్తూ తెచ్చుకున్న మందులు వేసుకుని పడుకున్నాడు.

అసలే ఒళ్లంతా నొప్పులు అంటున్నాడు.  ఆ ఒళ్ళు నొప్పులు తో ఆ పొలం పనులు ఏం చేసుంటాడు. ఇంకా పొద్దున్నుంచి  ఆ మత్తులోనే మునిగితేలుతున్నాడెమో. అందుకే ఆ మాటలు ముద్దుగా, ముద్దగా వస్తున్నాయి అంటూ నిట్టూర్చింది లక్ష్మి.

ఇంకా చేసేదేమీలేక, పిల్లలిద్దరికీ తొందర తొందరగా బువ్వ తినిపించి ఆళ్లతో పాటే  ఆళ్ల కాడే ఆలాగే పడకేసింది.

అర్ధరాత్రి వేళ లచ్చి లచ్చి అన్నా సూరయ్య పిలుపుకి మగతగా లేచి,  అతని దగ్గరికి వెళ్ళింది.

ఏంటే మర్ధన చేయమన్నా కదా!!! అట్ట  మొద్దు నిద్ర పోతున్నావు అని ఒక్కసారి కసిరాడు.

నేను బువ్వ తినే సరికి,  నువ్వు మంచి నిద్రలో ఉన్నావయ్యా …అందుకే లేపలేదు.  ఇదిగో ఈ చల్ల తాగు లోపల ఉన్న మత్తు కొంచెం తగ్గిద్ది.

గబగబా రెండు గుంటకల్లో  చల్ల తాగేశాడు.  లచ్చి నూనె సీసా తెచ్చింది.

ఏమయ్యా ఓంటో బాగోకపోతే ఇంటికాడ కొచ్చెయ్యక,  ఎందుకయ్యా ఆ నాటుసారా తాగుతావు.  ఇప్పుడు చూడు ఏమైందో!

సొమ్ములు ఇయ్యాల కాకపోతే రేపు సంపాయించుకోవచ్చు అంటూ మందలిస్తూనే, తన అర చేతిలోకి నూనె తీసుకొని గుండెల మీద రాయడం మొదలు పెట్టింది.

ఆ నూనె చల్లదనానికి, ఆ చేతి స్పర్శకి,  అసలే మత్తులో ఉన్న సూరయ్య ఆమె మాటలకు సమాధానం ఇచ్చే స్థితిని ఎప్పుడో దాటిపోయాడు.

అమాంతం లచ్చిమిని మీదకు లాక్కున్నాడు. ముద్దులతో ముంచెత్తాడు.  సూరయ్య చేతులు తనకు తెలియకుండానే లచ్చిమి అందమైన శరీరాన్ని ఎక్కడో తాకాయి.

ఏంటయ్యా ఇది?  అసలే జ్వరం అంటివి అని మందలించ పోయింది లచ్చిమి.  అవేమీ వినే స్థితిలో లేడు సూరయ్య.

ఆమె నోటిని తన నోటితో బందించేసాడు.  మాటరాని మౌనం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది.

పేదోడికి కడుపునిండా ఆకలి తీరే మార్గం ఇది ఒకటే కదా!!! అది ఇద్దరికీ తెలిసిన విషయమే. అందుకే ఇద్దరు ఎవరి సర్దుబాటులో వాళ్ళు ఉన్నారు. ఒకరికొకరు ఉన్నారు.

ఆ స్పర్శకి అలవాటుపడిపోయిన లచ్చిమి,  పూర్తిగా అతని సొంతమైపోయింది.

ఇద్దరు ఆకలి తీరే సరికి సుమారు ఒక ఒక అరగంట గడిచింది. చవటలు చిందే శరీరాలతో,  అలసిపోయిన మనసులతో ఒక వైపు,  ఆ కుక్కి మంచంలోనే ఇరుక్కుని పడుకున్నారు.

శరీరాలు ఆకలి తీర్చుకున్న తర్వాత కడుపు ఆకలి గుర్తు రావడం సహజం.

మావ రేపటికి కూడు కి గింజలు లేవయ్యా.. పిల్లగాళ్లు ఆకలికి వార్వ లేరయ్యా… ఏదో ఒకటి చేసి రేపటికి గింజలు  ఎత్తుకు రావాలి.

ఈ రోగం కుదర నీయవే లచ్చి,  నీకు నీ పిల్ల గాళ్ళకి నిలువెత్తు సిరి పోత్తాను అన్నాడు నవ్వుతూ.

ఆ సిరిలు, మేడలు మాకొద్దు  లేవయ్యా.  తింటానికి గింజలు ఎత్తుకురా చాలు.  ( ఇద్దరూ ఎవరి పడుకునే చోటుకు వారు చేరారు. నిద్ర పోయారు.)

తెల్లవారేసరికి వీధి అంతా హడావిడిగా ఉండేసరికి, లచ్చి సూరయ్య గుడిసె లో నుంచి బయటకు వచ్చారు.  ఎవరో సూరయ్యకు జ్వరంగా ఉందని గవర్నమెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు..  కరోనా వ్యాధి వీళ్ళ ఇంటి ముందు ఆగింది.

సూరయ్య ను  వ్యాన్లో  ఎక్కించుకున్నారు.  లచ్చిమి లబోదిబోమంటూ ఉంది.

ఎడవబాకే లచ్చిమి. మన గుడెపోళ్ల అందరం నీకు లేమా ఏడవబాకు అంటూ ఓదార్చ సాగారు ఊరి జనం.

ఇదిగో యే లచ్చి,  ఈ బియ్యం ఉంచు.

ఇదిగో యే లచ్చి ఈ పప్పులు ఉంచు.

ఇదిగో యే లచ్చి ఈ కూరలు ఉంచు..

నువ్వేమో అడుగు బయట పెట్టవు. ఏ కూలి పనికి రావు. ఆడు నిన్ను ఓ ముద్దు గుమ్మ లాగా అపురూపంగా చూసుకుంటాడు. ఇప్పుడు ఎలాగో ఏమో!!!

ఆ సూరి గాడు ఎప్పుడు వస్తాడో తెలియదు.  పిల్లగాళ్ల ను  సాకాలి.  ఏదో  మా వంతు గా ఉడతా భక్తి సాయం అనుకుని అందుకో అంటూ హితవు పలికారు.

చేసేదిలేక అవన్నీ తీసుకొని ఏడుస్తూనే ఇంట్లో పెట్టుకుంది.  సూరయ్య మాత్రం తిరిగి ఎప్పటికీ రాలేదు.  ముందు అడిగితే అది కరోనా నే . 14 రోజుల్లో పంపిస్తామన్నారు.  తరువాత తగ్గలేదని చెప్పారు.  తర్వాత చనిపోయాడు అన్నారు.

ఆ సూరయ్య చనిపోయిన తర్వాత ఆ కుటుంబం మొత్తానికి,  ఆ వీధిలో సూరయ్య తో సన్నిహితంగా ఉండే మరికొందరికి కరోనా టెస్ట్ చేశారు.  అదేమీ విడ్డూరమో కానీ అందరికీ నెగిటివ్ గానే వచ్చింది. కరోనా లేదని తేలింది.  కానీ సూరయ్య చేసిన పాపమో,  ఏమోగానీ తనను అలా వెంటాడింది.

చివరిగా శవాన్ని  చూసే అవకాశం కూడా ఎవరికీ  లేదన్నారు.  ఏమీ చేయలేని లచ్చి మాత్రం ఇరుగుపొరుగు సాయంతో జీవితాన్ని నెట్టుకొస్తోంది..

ఎందాకా సాగుతుందో ఓ లచ్చి…. నా ముద్దుగుమ్మ.  నీ పయనం.  ఎప్పటికి  అంతమవుతుందో అంటూ
సూరయ్య  పై నుంచి వాళ్ళని కనిపెట్టుకుని ఉన్నాడు.

చేసేదేమీలేక లక్ష్మి కాయకష్టం చేస్తూ,  అలవాటు లేని జీవన పయనం చేస్తూ,  పిల్లల కోసం బతుకు ఈడుస్తోంది.

ఈ కరోనా మహమ్మారి వల్ల నాశనం అయిపోయిన జీవితాలు ఇంకెన్నో. కొందరికి ప్రాణనష్టం,  కొందరికి ఆర్థికపరంగా నష్టం. ఎంతోమందికి మానసిక నష్టం కలిగించిన ఈ మహమ్మారి ఆటలు ఇంకా ఎన్నాళ్లో  వేచి చూడాలి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!