వకుళోదయం

వకుళోదయం

రచన: దొడ్డపనేని శ్రీ విద్య

వసంతఋతువు లో కోకిల గానం మధురం గా వినపడుతున్న వేళ
రమేష్, సురేష్ హుషారుగా పార్క్ లో కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. వారు ఒకే అపార్ట్మెంట్ లో ఉంటారు.
మంచి స్నేహితులు. ఒకరి అనుభవాలు ఒకరు పంచు కోవటం వాళ్ళకి అలవాటు
ఆ రోజు కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా, ఆ పార్క్ లో ఓ చెట్టు మొదట్లో ఓ అందమైన పసిపాప ఉండటం గమనించారు. వాళ్లద్దరూ దగ్గరగా వెళ్ళారు. ఆ పసిపాప తరుపు వాళ్లు ఎవరైనా ఉన్నారా అని చుట్టూ చూసారు. ఎవరూ కనపడ లేదు. ఏం చెయ్యటమా అని ఆలోచిస్తూ రమేష్ ఇలా అంటాడు. ఈ పార్క్ సిబ్బందికి సమాచారం అందిద్దాం సురేష్ అని సలహా ఇస్తాడు. సురేష్ మాత్రం ఎందుకో ముభావంగా ఉండటం గమనించిన రమేష్, రేయ్ ఏ0 చేద్దాం అంటే అలా ఆలోచిస్తావేమిటిరా? ఏదో ఒకటి చెప్పు అని అడుగుతాడు. సురేష్ ఆలోచనల నుంచి తేరుకుని, రమేష్ ఏ ఇంటి బిడ్డో…. భాధగా ఉందిరా. ఎందుకు ఇలా వదిలేస్తారో కదా? పిల్లలు లేక ఎంత మంది బాధ పడుతుంటారో కదా అని మనసులో అనుకున్నది బయటకు చెప్పేస్తాడు. అవును రా మరి ఇప్పుడు ఏ0 చెద్దాం అది చెప్పు ఆఫీస్ కి టైమ్ అవుతుంది అని తొందర పెడతాడు.

సురేష్ విరచిత వదనంతో రమేష్ నీకు తెలుసుగా వకుళ (తన భార్య) కి మొన్న జరిగిన ఆక్సిడెంట్‌ లో పిల్లలు పుట్టరు అని చెప్పారు. వకుళ ఎంతో బాధ పడింది. రోజు రోజుకు దిగులు తో మంచం ఎక్కే లాగుంది అని చెపుతాడు. అవును తెలుసు.
అయితే ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకురా అంటూ తొందర పెడతాడు రమేష్.
రేయ్ రమేష్, నేను ఈ పసికందును ఇంటికి తీసుకు వెళదాము అనుకుంటన్న అని అంటాడు.
అంతే రమేష్ తుళ్ళి పడతాడు సురేష్ మాటలకి. సురేష్ మీ అమ్మగారి గురించి తెలుసు కదా. ఆమె ఒప్పుకుంటారా? అసలే పాత కాలం వాళ్ళు.
వకుళ ని నిన్ను నానా విధములగా ఆడి పోసుకుంటారు. మరో సారి ఆలోచించు అని గదమాఇస్తాడు.
ముందు వకుళ అభిప్రాయం తెలుసుకో సురేష్ అని హెచ్చరిస్తాడు రమేష్.
వకుళ ఒప్పుకుంటుంది రమేష్. తన గురించి నాకు బాగా తెలుసు. తను ఇలాంటి అభ్యదయ భావాలు ఉండటం వలనే నేను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తను నేను చేసిన ఈ పనికి చాలా సంతోషిస్తుంది అని నచ్చ చెపుతాడు. సరే మీ ఇష్టం. మీకిష్టమైతే ఇంక సమస్యే లేదు. కానీ ఇంకొంచం సేపు చూద్దామా? పాప తరుపు వాళ్ళు వస్తారేమో అని రమేష్ అంటాడు.
సరే అని కొంచం సేపు అక్కడే ఉండి ఎదురు చూస్తారు. కానీ ఎవ్వరు రారు. ఇంక ఆలస్యం చేయకుండా ఆ పాపను ఎత్తుకొని పార్క్ బయటకు వస్తారు.
ఇద్దరూ ఎవరి ఆలోచనలో వారు ఉంటారు.
దారి పొడవునా ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు.
అపార్ట్మెంట్ ఆవరణ లోకి అడుగు పెడతారు.

కొంత మంది వారిని విచిత్రంగా చూస్తారు.
అవేవి పట్టించు కోకుండా వడి వడిగా అడుగులు వేస్తూ ముందుకు కదులుతారు.
సురేష్ తన ఇంటి కాలింగ్ బెల్ కొడతాడు. వకుళ మీద నమ్మకం ఉన్నా , ఏమంటుందో అని ఓ మూల చిన్న సందేహం.
తలుపు తీయగానే ఎదురుగా నవ్వుతూ వచ్చిన వకుళ సురేష్ చేతిలోని పసికందును చూసి ఆశ్చర్య పోతుంది.
మెల్లగా ఇంట్లోకి నడిచి అసలు విషయం మెల్లగా చెబుతాడు.
చాలా మంచి పని చేసారు అండీ అని భర్తను చూసి మురిసి పోతుంది. నేను లేచిన ఉదయం చాలా మంచిది. మనం పిల్లలు లేక బాధ పడుతున్నాము. వేరొకరికి పిల్లలు భారమై వదిలి వెళుతున్నారు. విధి ఎంత విచిత్రం కదండీ అని అంటూ పాపకి కావలసిన సామగ్రి తెమ్మిని, ఆఫీస్ కి శలవు పెట్టమని చెప్పి వంటగది లోకి పాపకి పాలు పట్టటం కోసం అడుగులు వేస్తుంది.

రమేష్ ఇదంతా చూసి వాళ్ళిద్దరికీ ఓ నమస్కారం చేసి నిజంగా నువ్వు నా స్నేహితుడు అవటం నా అదృష్టం రా.
నేనైతే ఇలా చేయలేక పోయే వాడిని.
బాగుండాలి మీలాంటి మంచి వాళ్ళు అనుకుంటూ తన ఇంట్లోకి నడుస్తాడు.

వసంత ఋతువు లోని కోకిల కూడా ఈ సన్నివేశం చూసి ఇంకా మధురంగా గానం చేస్తూ తన గూటికి చేరుతుంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!