మతిమరుపు మాలోకాలు

అంశం:సస్పెన్స్/ హాస్యం

మతిమరుపు మాలోకాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఎన్.లహరి

ఓ చల్లటి సాయంత్రం. ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరాడు సత్య. దారిలో మాయదారి మతిమరుపుతో ఇల్లు మర్చిపోయి. ఎలాగో అలా తన గూగుల్ మ్యాప్లో సేవ్ చేసుకున్న లొకేషన్ ప్రకారం ఇంటికి చేరి తలుపు కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే తెరిచి ఉన్న తలుపును గమనించి లోపలికి వెళ్ళాడు సత్య.
ఎదురుగా అద్ధం ముందు వయ్యారంగా నిలబడి ఫేసియల్ చేసుకుంటున్న లతను చూసాడు.
నల్లటి చీరలో, స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని ఉందేమో ఆ తెల్లని మేని ఛాయతో మెరుస్తున్న లత నడుము  రారమ్మని పిలిచినట్లు అనిపించింది సత్యకు.
మెల్లగా వెనకనుంచి వెళ్ళి లత నడుము చుట్టు చేతులతో బిగించి. డార్లింగ్ ఈరోజు ఎంత ముద్దొస్తున్నావో తెలుసా అని తన కౌగిలిలో బంధించాడు. అదిరిపడిన లత వెనక్కు తిరిగి.
భలేవారే మీరే ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నారు అని సుతారంగా మంచం మీదకు తోసి, అయినా నేను ఫేషియల్ చేసుకుంటున్న కనిపించడం లేదా? అని కొంటెగా సమాధానం చెప్తూ, ఫ్రెష్ అయ్యి రండి ఇప్పుడే టీ తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళింది,
సత్య కొత్త పెళ్ళికొడుకులా స్నానం చేసి తయారయ్యి లత తెచ్చిన టీ తాగి, డార్లింగ్ ఆ ఫేషియల్ తో ఎంతసేపు ఉంటావ్ గాని వెళ్ళి స్నానం చేసిరా అలా బయటకు లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం అని చెప్పి హాల్ లో పాటలు ఎక్కువ సౌండ్లో పెట్టి బెడ్ రూమ్ లోకి వెళ్ళి కూర్చుంటాడు. అలాగే అని చెప్పి వెళ్ళిన లత స్నానం చేసి తయారు అయ్యి బయటికి వస్తుంది. లత అందాలను తన కవితలతో వర్ణిస్తుంటే లత సిగ్గుతో తమకంలో మునిగిపోయింది
ఇంతలో ఇంటి ముందు ఒక కార్ ఆగింది, అందులో నుంచి పరమానందం దిగాడు. తీసున్న డోర్ లో నుంచి ఇంట్లోకి ప్రవేశించి లత, లత అని గట్టిగా పిలిచాడు ఓసేయ్ లత ఎక్కడున్నావే. ఎక్కడా కనపడదేంటి? అయినా ఈ సౌండ్ ఏంటి ఇంత పెట్టింది అసలే మతిమరుపు మాలోకం ఎక్కడుందో
అని అనుకుని ఆ పాటల సౌండ్ ఆఫ్ చేసి వెతుక్కుంటూ బెడ్ రూమ్ వైపుకు వెళ్ళాడు తలుపు తీసిన పరమానందం గుండెలో సౌండ్ బాక్స్ పగిలిపోయింది. ఓసేయ్ లత అని గట్టిగా అరిచాడు పరమానందం వెంటనే లత ఎవరండీ మీరు అన్నది.
సత్య కోపంగా ఎవడ్రా నువ్వు సరాసరి మా రూములోకి వచ్చావ్ అని అరిచి బయటకు తోసాడు. పరమానందానికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా చితక్కొట్టాడు. బయటకు వచ్చిన లత అది అలా కొట్టండి వెదవను అని అంటుండగా పరమానందం ఓసేయ్ లతా నేనే.. అని అరిచాడు. ఏరా వెదవ  నన్ను ఓసేయ్ అంటావా? అని లోపలికి వెళ్ళి ఎర్రగా కాల్చిన అట్ల కాడతో పరమానందం పిర్ర పైన వాత పెట్టింది.. లబోదిబో మంటూ బయటకు పరిగెత్తాడు పరమానందం. ఇరుగు పొరుగు వారు అక్కడకు చేరుకున్నారు. లత, సత్యలు కూడా బయటకు వచ్చారు ఈలోపు సత్య, “చూడండి ఈ వెదవ ఎవడో మా ఇంట్లోకి దూరి మమ్మల్ని అనరాని మాటలు అంటున్నాడు ” అని చెప్పాడు
సత్యకు వంత పాడుతూ లత కూడా పరమానందం వైపు చూపించి పరమానందం చెవులు తూట్లు పడేలా తిట్టింది. ఇంతలో ఒక పెద్దామె వచ్చి లత చెంప పై ఒక్కటిచ్చి. “ఒసేయ్ మతిమరుపుదాన పరమానందం నీ భర్త. ఏరోజు లేనిది ఇవాళ ఇలా ప్రవర్తిస్తున్నావ్ ఏంటే ” అనగానే అంతా గుర్తొచ్చి అలా నిలబడిపోయింది లత. ఇది విన్న సత్యకు ఒక్కసారిగా బుర్ర తిరిగింది. తన మతిమరుపుతో దారి మర్చిపోయాడని గ్రహించి అక్కడ నుండి తప్పించుకోడానికి ప్రయత్నించాడు. కానీ అక్కడున్న వారు సత్యను పట్టుకుని తల కిందకి, కాళ్ళు పైకి కట్టేసి వేలాడదీశారు. లబోదిబోమన్నా కూడా వినేవారే లేరు. ఈలోపు అటువైపు వచ్చిన సత్య భార్య అతని మతిమరుపు గురించి చెప్పి క్షమించమని చెప్పి వేడుకుని సత్యను విడిపించి తీసుకెళ్లి జీవితంలో ఇంటి దారి మర్చిపోకుండా బడిత పూజ చేసింది. ఆనాటినుండి పరమానందం తన మతిమరుపు భార్య లత కోసం ఉద్యోగానికి వెళ్ళడం మానేసి వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలెట్టాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!