ప్రణయ దేవత కోసం

ప్రణయ దేవత కోసం

రచన: వాడపర్తి వెంకటరమణ

నడిరేయి…
నా ప్రణయ దేవత కోసం
కొన్ని ప్రేమ భావాల్ని గుండెల్లో నింపుకుని
ఆ బాటలో పయనిస్తున్నాను
వెన్నెల పుష్పం విచ్చుకుందేమో
పిండారబోసినట్లుంది త్రోవంతా
దూరానెక్కడో ఆకాశంలో
తళుకు తళుకున మెరుస్తున్న తారకలు
తొందర పెడుతున్నాయి
త్వరగా ప్రేయసి కౌగిలిలోకి చేరుకొమ్మని
దారమ్మట పరుచుకున్న గడ్డి పూలు
తుషార స్నానం చేసినట్లున్నాయి
తాజాగా మెరుస్తూ తలలూపుతూ
ఆసాంతం ఆహ్లాదపరుస్తున్నాయి
అక్కడెక్కడో పాటల చెట్టుపైనుండి
ఏ గంధర్వ పిట్టో వీనులవిందుగా
ప్రణయ గీతాలు ఆలపిస్తూ
నాలో ఏవో ప్రకంపనలు రేకెత్తిస్తోంది
ఇంకాస్త ముందుకు అడుగేస్తున్నా…
అదాటున మెలకువ వచ్చింది
భుజంపై శ్రీమతి చేయి కనిపించింది
రసాత్మకమైన కల చెదిరింది!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!