ఓ ప్రియసఖి
రచన: పసుమర్తి నాగేశ్వరరావు
నిను నేను చేరువవ్వలేను
నిను చేరువ చేయలేను
నిను ఎవరికి చేరువ చేయలేను
నువు ఎవరికి చేరువైనా ఉండలేను
నీ నిలకడ లేని తనానికి
నీకు నిశ్చలత్వం లేనితనానికి
నీ చపలత్వానికి
నీ సంకుచితత్వానికి
నువుకోరుతున్నావు
నువు కోరుకున్నావు
నువు కోరుకుంటున్నావు
నువు కుదుటగా వుండకున్నావు
నీ హృది మది గది కాదు పదిలం
నీ హృది మది సవ్వడి కాదు మృదులం
నీ హృది మది కాదు నేనేసకలం
నీ హృది మది యే కదా నా కలకలం
నిను నేను కోరుకుంటున్నా
నువు నను కోరుకుంటున్న
ఒకరిని ఒకరు కోరుకుంటున్న
ఒకరికి ఒకరు దగ్గరగా ఉండి దూరమవుతున్న
నీ తీరు మార్చుకో