నా ఊరు
రచన: శిరీష వూటూరి
నా ఊరు
గలగల గోదారి నా ఊరు
కమ్మని కోయిల పాట నా ఊరు
మరిపించే మట్టి వాసన నా ఊరు
చల్లగాలి పిల్ల తెమ్మెర నా ఊరు
స్వచ్చమైన పాలనురగ నా ఊరు
ఆత్మీయ స్పర్శ నా ఊరు
పచ్చని పైరు నా ఊరు
మట్టి మనుషుల నిర్మలత్వం
నా ఊరు
నిండుకుండలాంటి గాంభీర్యం
నా ఊరు
మంచిమనసుల మానవత్వం
నా ఊరు
ప్రతి ఇంటి ముందు పచ్చగా
మెరిసే పెద్దగడప నా ఊరు
ఐక్యతను చాటే అందమైన
అరవిరిసిన పూల తోట
నా ఊరు
అచ్చమైన అమ్మ ప్రేమ నా ఊరు
నాన్నలాంటి వెన్న ముద్ద నా ఊరు
ఇన్ని లక్షల విలువైన లక్షణాలున్న
లక్షెట్టిపేట నా ఊరు
అది నా ఊరు, నాకు
ఎన్నో మధుర జ్ఞాపకాలు
పంచిన నా ఊసుల సెలయేరు……