ప్రేమ తరుణి
రచన: క్రాంతి కుమార్
వసంత ఋతువులా వచ్చావా!
చిరు ఆశలను నాలో చిగురింప చేయడానికి
గ్రీష్మ ఋతువులా వచ్చావా!
నా కన్నీటి బాధలను ఆవిరి చేయడానికి
వర్ష ఋతువులా వచ్చావా!
సంతోష చినుకులతో నన్ను తడిపేయడానికి
శరత్ ఋతువులా వచ్చావా!
వెండి వెన్నెల కాంతిలో నన్ను నిద్రపుచ్చడానికి
హేమంత ఋతువులా వచ్చావా!
చల్లని మంచుని నా మీద కురిపించడానికి
శిశిర ఋతువులా వచ్చావా!
నాలోని అపోహలను ఎండుటాకులా రాల్చడానికి
సరి క్రొత్త ఉత్సాహాలతో వచ్చావా!
నా జీవితంలోకి ప్రేమ వెలుగు నింపడానికి
ఆరు కాలాల్లో ఏడు జన్మల బంధంగా
నాతోనే ఉండిపోవా ప్రియా!!
***