వ్యామోహం

వ్యామోహం

రచన::సుశీల రమేష్.M

మోహన్ రాధ వీరికి ఐదేళ్ల బాబు రోహిత్. చూడచక్కని చిన్న కుటుంబం. లాక్ డౌన్ వలన సిటీ నుండి సొంతూరికి వెళ్ళిపోయారు. రాధ చిన్ననాటి స్నేహితుడు కృష్ణ పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నారు.
రాధ ఇక్కడే ఊళ్లోనే ఉంటుంది అని తెలిసి చూడడానికి వచ్చాడు రాధా వాళ్ళ ఇంటికి కృష్ణ.

కృష్ణ వచ్చేసరికి మోహన్ ఇంట్లోనే ఉన్నాడు. కృష్ణ ని మోహన్ కి పరిచయం చేసింది రాధా. ఏవండీ నా చేత చెంప దెబ్బ తిన్నాడు కృష్ణ. అప్పట్లో నా ఫ్రెండు వెనుక పడుతున్నాడని నేనే కొట్టాను కృష్ణ ని అని చెప్తుంది రాధా. మహాతల్లి ఆ దెబ్బ గుర్తు చెయ్యకు ఇప్పటికీ పెళ్లి చేసుకోవాలన్న భయంగానే ఉంది అంటాడు కృష్ణ తన చంప పై చేయి వేసుకొని. ఆ మాటకు మోహన్ నవ్వుతాడు .

కృష్ణ నీకు తెలిసిన బైక్ సర్వీసింగ్ సెంటర్ ఉంటే చెప్పు మా వారు మెకానిక్ అని అంటుంది రాధ.
అవునా నాకు తెలిసిన సర్వీసింగ్ సెంటర్ ఉంది రా మోహన్ ఇప్పుడే అడుగుతాను అంటాడు కృష్ణ.
తన బైక్ పై తీసుకెళ్లి సర్వీసింగ్ సెంటర్లో మెకానిక్ గా కుదిర్చాడు కృష్ణ. అప్పుడప్పుడు రాధ వాళ్ళింటికి భోజనానికి వస్తున్నాడు కృష్ణ.

కృష్ణ చూపు రాధ పై పడింది. రాధ కూడా కృష్ణ వ్యామోహంలో పడి పోయింది. మోహన్ లేనప్పుడు కూడా కృష్ణ ఇంటికి వస్తున్నాడు.
అప్పుడప్పుడు బాబు చెప్తున్నా కూడా మోహన్ పట్టించుకోలేదు.
కృష్ణ వ్యామోహంలో పడిన రాధా బాబును పట్టించుకోవడం మానేసింది. కృష్ణ ఇంటికి రాగానే బాబు ను బయట ఆడుకోమని చెప్పేది. బాబు వెళ్ళనంటే చితక్కొట్టే ది.

ఒక రోజు సాయంత్రం మోహన్ ఇంటికొచ్చేసరికి బాబు కాలికి గాయాలున్నాయి. ఆ గాయం ఏంటి నాన్న రోహిత్ అని అడిగేసరికి ,. రోహిత్ ను నోరెత్తనీయకుండా రాధా గబగబా వచ్చి వెధవ వేలెడంత లేడు ఇంట్లో డబ్బులు నాకు తెలియకుండా తీసుకెళ్ళి కొనుక్కొని తింటున్నాడు అని అబద్ధం చెప్పింది రాధ. మోహన్ తో. తప్పు నాన్న అమ్మని అడిగి తీసుకోవాలి డబ్బులు ఇంకెప్పుడు అలా చేయకూడదు అని మోహన్ అనేసరికి, రోహిత్ ఏడుస్తూ కాదు నాన్న కృష్ణ అంకుల్ వచ్చినప్పుడల్లా నన్ను బయటకి వెళ్ళు అంటుంది అంటుంది అమ్మ, కృష్ణ అంకుల్ వచ్చిన సంగతి నాన్న కు చెప్పకు అని చెప్పింది అమ్మ. నేను బయటకి వెళ్ళానన్నానని‌ నన్ను కొట్టింది అమ్మ. అని చెప్పాడు అమాయకంగా ఏడుస్తూ రోహిత్ ‌ తండ్రి మోహన్ తో.

ఏంటి రాధా కొత్త అలవాట్లు అని అడిగాడు మోహన్ రాధని.
అయ్యో మీరు అనవసరంగా ఏదో ఊహించుకుని నన్ను అపార్థం చేసుకుంటున్నారు కాసేపు మాట్లాడి వెళ్లిపోతున్నాడు కృష్ణ అంతేకానీ మా మధ్య ఎలాంటి సంబంధం లేదు
అంటూ తడబడుతూ చెప్తుంది కానీ రాధా బాబు వంక గుర్రుగా చూస్తుంది. చాల్లే ఆపు నీ నటన పసిపిల్లలు అబద్ధం చెప్తారా ఇంకోసారి కృష్ణ ఇంటికి వస్తే నీ మర్యాద దక్కదు జాగ్రత్త అని హెచ్చరిస్తాడు మోహన్ రాధనీ.

పిల్లి పాల గిన్నెలో తలదూర్చి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడడం లేదు గమనించడం లేదు అనుకుంటుందట ఎప్పటి వరకు ఎవరో ఒకరు చూసి నడుం విర గొట్టే వరకు. ఈ రోజుల్లో వ్యామోహంలో పడి ఉన్న ఆడవాళ్ళు కూడా ఇలాగే ఉన్నారు.

మర్నాడు రోహిత్ అంగన్వాడి కి వెళ్ళాడు. వంటినిండా వాతలు తేలి ఉండటం చూసిన టీచర్, రోహిత్ నీ దగ్గరకు పిలిచి వంటినిండా ఆ వాతలు ఏంటి నాన్న అని అడిగింది.
ఆ పసివాడు రోహిత్ జరిగిందంతా చెప్పాడు. ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అనిపించింది టీచర్ సరితకు.

రోహిత్ ని తీసుకెళ్లడానికి వచ్చిన మోహన్ తో , చూడండి మోహన్ గారు ఆ పసివాడిని అలా గొడ్డును బాదినట్టు బాదుతుంటే మీరు మౌనంగా ఉండడం ఎంతవరకు సమంజసం. కొంచమన్నా కనికరం లేకుండా అలా ఎలా కొట్టింది తనుఅసలు కన్నతల్లేనా మీరు మౌనంగా ఉన్నా నేను ఒక టీచర్ గా మౌనంగా ఉండలేను బాబు మీకు బరువైతే నాకు ఇవ్వండి నేను చూసుకుంటాను నాకు ఎవరూ లేరు. మరోసారి ఇలా బాబును కొడితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఆ తర్వాత మీరు నన్ను ఏమన్నా సరే అంటుంది సరిత.

బాబుతో ఇంటికి వెళ్ళిన మోహన్ రాధతో గొడవ పడతాడు, కోపంలో రాధ మీద చేయి చేసుకుంటాడు మోహన్. అయినా కూడా రాధ పద్ధతిలో మార్పు లేదు. అసలు భర్త దగ్గర లేనిది పరాయి మగవాడి దగ్గర ఏముంది. “భర్తను మోసం చేసే బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా,” “తాళి ని ఎగతాళి చేస్తూ, పొద్దున్నే లేచిదేవుడికి పూజలు చేస్తూ ప్రాతివత్యం వెలగ పెట్టే ఆడవాళ్లు ఎందుకు ఆలోచించలేక పోతున్నారు.” అసలు భర్తను మోసం చేస్తే వాళ్లకు వచ్చే లాభమేంటి?”

“తమను తామే మోసం చేసుకుంటూ వ్యామోహంలో పడి కుటుంబాన్ని కూడా మోసం చేస్తున్నారు దానివల్ల వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ.”

పిల్లల్ని తీసుకెళ్లడానికి అంగన్వాడి కి పిల్లలు తల్లిదండ్రులు ఎవరూ రాకపోవడంతో, సరిత పిల్లలందరినీ వెంట పెట్టుకొని వాళ్ళ వాళ్ళ ఇంటిదగ్గర అప్ప చెప్పి వస్తుంది.
ఆఖరిగా రోహిత్ ఇంటి పక్క లక్ష్మి వాళ్ళ ఇంటికి ఆమె పిల్లల్ని తీసుకు వచ్చింది. అక్కడికి వచ్చేసరికి సరితకు రోహిత్ కేకలు వినబడుతున్నాయి.

రోహిత్ అరుపులు విన్న సరిత పక్కింటి లక్ష్మి ఇద్దరూ రోహిత్ వాళ్ళ కిటికీ లో నుండి లోపలి కి తొంగి చూశారు. లోపల రోహిత్ చేతులు కాళ్ళు కదలకుండా పట్టుకున్నాడు కృష్ణ. రాధా అగ్గి మోడు తో రోహిత్ ఛాతి నుండి పొట్ట భాగం, తొడల మీద వాతలు పెడుతుంది. ఆ నిప్పు తగలగానే పసివాడు లేత చర్మంపై చర్మం కాలిపోయి పొరలుగా విడిపోయి, లోపల మాంసం తో సహా కాలిపోతుంటే బాబు బాధ వర్ణనాతీతం, దయనీయంగా భీకరంగా అరుస్తున్న అరుపులకు అది కన్నతల్లా లేక రాక్షసి కి మరో రూపమా అనిపించకమానదు చూసినవారికి.

ఇక సరితా లక్ష్మి ఆలస్యం చేస్తే బాబు ప్రాణాలు పోతాయేమోనని తలుపులు తోసుకుని లోపలికి వచ్చేసారు ఇద్దరు. రాధా వాళ్ళిద్దరినీ చూసి ఏయ్ లోపలికి ఎందుకు వచ్చారని అడుగుతుండ గానే సరిత తన బలమంతా ఉపయోగించి లాగిపెట్టి చెంప చెల్లుమనిపించింది రాధకు. ఆ దెబ్బకు వెళ్లి ఆమడ దూరంలో పడింది రాధా పడిన దాన్ని పడినట్టు చేతులు కట్టేసింది లక్ష్మి.
అలాగే ఇద్దరూ కృష్ణ ను కూడా కట్టేశారు. రెప్పపాటులో చేసేసారు ఇదంతా లక్ష్మీ సరిత. పోలీసులకు ఫోన్ చేసింది సరిత . వాళ్లు వచ్చే లేపు లక్ష్మి నువ్వు ఇక్కడే ఉండి మోహన్ గారికి ఫలానా హాస్పిటల్కి రమ్మని చెప్పు నేను బాబును తీసుకెళ్తానని చెప్పింది. సరిత బాబు ని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళింది.
రోహిత్ ఏడవలేక మూలుగుతుంటే సరిత గుండె తల్లడిల్లి పోతుంది. డాక్టర్ ఏమైంది అని అడిగారు. ఏం చెప్తాను డాక్టర్ కన్నతల్లి నిర్వాకం అని చెప్పింది సరిత. పోలీస్ కంప్లైంట్ చేశారా అడిగాడు డాక్టర్.
చేశాను డాక్టర్ వస్తుంటారు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని బతిమాలుతోంది సరిత. ఆ పసి వాడి బాధను చూడలేక డాక్టర్ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు.

కాసేపటికి మోహన్ వచ్చాడు. అప్పటి వరకూ తన దుఃఖాన్ని ఆపుకున్న సరిత మోహన్ ని చూసి ఏడ్చేసింది. కాసేపు ఏడ్చిన తర్వాత
నేను చెప్పిన రోజే మీరు జాగ్రత్త పడి ఉంటే ఈ రోజు ఇంత వరకు వచ్చేది కాదు. అంటుంది సరిత. బాబు ఎక్కడ అని గద్గద స్వరంతో అడుగుతాడు మోహన్. ఐసీయూలో ఉన్నాడంటూ చూపిస్తుంది సరిత. తన కొడుకు కాలిన గాయాల ను చూసి న మోహన్ కళ్ళలో నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి తనకు తెలియకుండానే. సరిత ఓదార్చడం వలన తేరుకున్నాడు మోహన్.

ఇంటి దగ్గర పోలీసులు రాధను కృష్ణను అరెస్టు చేసి తీసుకెళ్లారు.

హాస్పటల్ లో ఉన్నన్ని రోజులు రోహిత్ ను సరిత చూసుకుంది. డిశ్చార్జ్ చేశాక రోహిత్ ను తన ఇంటికి తీసుకెళ్లింది సరిత.

రోహిత్ పట్ల సరిత ప్రేమ ను చూశాక సంవత్సరం తర్వాత సరితను పెళ్లి చేసుకున్నాడు మోహన్. రోహిత్ సరితను అమ్మ అని పిలుస్తున్నాడు.

కడుపు తీపి లేని కన్నతల్లి రాధ వెర్రి వ్యామోహంలో పడి తన నూరేళ్ల జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుని ఎవరూ లేని అనాధలా కారాగారంలో శిక్ష ను అనుభవిస్తుంది.

ఎవరూ లేక పోయినా తన కడుపున పుట్టకపోయినా సరిత రోహిత్ చేత అమ్మ అని పిలుచుకుంటుంది. ఆడదంటే కరుణామయి,‌ ప్రేమకు ప్రతిరూపం అని నిరూపించుకుంది సరిత. ఫలితంగా తనకు ఈ రోజు నూరేళ్ళ జీవితం దొరికిందని చెప్పాలి . మరి మీరేమంటారు.

వ్యామోహంలో పడిన ఒక ఆడది తన భర్తను తన కన్న బిడ్డను చిన్న చూపు చూసింది, మరో ఆడది తనలో ఉన్న ప్రేమను పంచి రోహిత్ ను మోహన్ ను అక్కునచేర్చుకుంది.

******

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!