బలం ఉన్నవాడిదే రాజ్యం

(అంశం:”రక్షిస్తుందా ఈ బంధం”) 

అంతా బలం ఉన్నవాడిదే రాజ్యం

రచన ::విస్సాప్రగడ పద్మావతి

బలమున్నవాడిదే రాజ్యం అన్నట్లు
ఎంత డబ్బు ఉంటే అంత విలువ
డబ్బున్నవాడు పని మనిషిలా చూసినా దేవుళ్లే
అదే డబ్బు లేనివాళ్ళు ఎంత గౌరవం ఇచ్చిన దెయ్యాలే
విలువ ఇచ్చే వాణ్ణి అణగదొక్కి
డబ్బుకు ప్రాధాన్యత ఇస్తే
నీ పాడిన మోసేది ఆ డబ్బా?
నీ ఆపత్కాలంలో ఆలనాపాలనా చూసేది
నువ్వు నమ్మిన డబ్బా లేక
డబ్బు మనుషులా?
అప్పుడు రక్షిస్తుందా నిన్ను నువ్వు ప్రేమించిన ఆ డబ్బు?
బంధాలను బందీ చేసి
డబ్బుకు విలువ ఇచ్చి
గౌరవ మర్యాదలు లేని ప్రబుద్ధులకి
సింహాసనం వేయమని కాదు
నీ అవసాన దశలో నీ మీద ప్రేమతో సేవ చేయాలి..
నీ వెనుక ఉన్నడబ్బు మీద ప్రేమతో కాదు.
ఇకనైనా డబ్బు మదం వదిలి
నిజమైన ప్రేమను ఆస్వాదించు
ప్రేమకు ప్రాధాన్యం ఇచ్చి
చిరస్థాయిగా నిలిచిపో

You May Also Like

One thought on “బలం ఉన్నవాడిదే రాజ్యం

  1. బాగుంది జీ. అసలు సిసలైన ఆలోచనలని అంతరంగం ప్రశ్నిస్తే ఇదే.
    మీ అంతరంగ భావాన్ని చక్కగా వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!