అభయ కవచం

(అంశం:”రక్షిస్తుందా ఈ బంధం”) 

అభయ కవచం 

రచన ::మొహమ్మద్. అఫ్సర వలీషా

నా ఆశల పల్లకివి నీవే
నా ఊహల రెక్కలు నీవే
నా లో ఉత్సాహం నింపే కెరటానివి నీవే….

ఊపిరాడని ఊసులతో ఉరకలెత్తించే ఉత్సాహానివి నీవే
నిలువెల్లాసంతోషాల సాగరంలో ముంచెత్తే ఆనంద కడలివి నీవే…..

నా కన్నుల లోగిలిలో దోబూచులాడే కనుపాపవా
నీ మురిపాలతో నన్ను అంబరాన చైతన్య గీతికలు పాడిస్తావు….

నీ సొగసైన మాటలతో
మనసంతా అందమైన ముగ్గులతో అలికేస్తావు ….

నాకనిపిస్తుంది ఇది ఇది భ్రమా లేక భ్రాంతి నా
ఈ బంధం కలకాలం నను
రక్షిస్తుందా అభయ కవచమై….

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!