నేరేడు నెరజాన
దొడ్డపనేని శ్రీ విద్య
వాలుకల్ల చిన్న దానా
వయ్యారాలు ఒలికించుదానా
ఏటి కాడ కొస్తవా
గోటి ముద్ధ తినిపిస్తవా
మలి జాము దాకుంటవా
మంచె కాడ సద్దు చేస్తవా
వాకిలి కాడ కూసుంటవా
వాలు పొద్దు దాకా వన్నెలద్దుతావా
నేరేడు చెట్టు కింద నెరజాన
మదిలో ఎన్నెల్లు పూయిత్తవా
వయ్యారి ఒంపు సొంపుదానా
నను మనువాడ వచ్చినావా
అంద చందాలు అందిత్తవా
అందమైన జాబిలి నీడనుంటవా
కళ్ళలోనే అందమంత దాగున్దే నెరజానా
నీ కోసము పానమిత్తనే కులుకుదానా
నను కాచుకుంటవ వయ్యారిదాన