సంచలన ఆదర్శవాది

సంచలన ఆదర్శవాది
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

వ్యాసకర్త: చంద్రకళ. దీకొండ

“హరిశ్చంద్ర”నాటకంలో
భార్యని అమ్మినందుకు హరిశ్చంద్రుని తన్నే సన్నివేశం సృష్టించిన నైతిక తీవ్రవాది

సమాజంలో కనపడని
అన్యాయాలపై ధ్వజమెత్తి
ఛాందస భావాల పాతగోడల్ని
పగులగొట్టిన ఆదర్శవాది…!

తల్లి, చెల్లెళ్ళ సమస్యలతో ప్రభావితమై
స్త్రీల జీవితాలే ఇతివృత్తాలుగా
“వారికి మెదడుంది…జ్ఞానం ఇవ్వాలం”టూ
సూర్యోదయాన్ని చూచి నవ్వే
వ్యవధి లేని నారీలోకం గురించి…
కుక్కలు,కోతులు, ఎలుగుబంట్లుగా మారి
భార్యపై,పిల్లలపై తమ ప్రతాపం చూపే భర్తల గురించి…

ఆధిపత్య కులాల
అహంభావం గురించి
“ఉరిమి,చీల్చి,చెండాడి”…
మంచికో, చెడ్డకో జీవితాన్ని చూపిన”సారస్వతాన్ని
“మైదానం,బ్రాహ్మణీకం,
దైవమిచ్చిన భార్య,సుశీల”
వంటి కథల్లో,నవలల్లో ప్రదర్శింపజేసి
“స్త్రీ మాటలో, చూపులో
నిప్పు వలె ఉండాలి.కొంచెం సందిచ్చినా పూర్తిగా అణగదొక్కుతారు”అంటూ
ఉన్నతమైన స్త్రీ స్వేచ్ఛకై తపించి…
అంతా వింతగా చూసినా…
భార్యను సైకిల్ పై కాలేజీలో దింపి,
మోసపోయిన స్త్రీలకు ఆశ్రయమిచ్చిన సంఘసంస్కర్త…!

లేతవయసులోనే ఇతిహాస,
పురాణాల పఠనం గావించి…
లోకరీతిని తెలిపే మ్యూజింగ్స్
లిఖించి…
అరుణాచలంలో భగవద్గీతకు వ్యాఖ్యానం రచించిన ఆధ్యాత్మిక మేధావి…!

తన సంతానం గురించి
పట్టించుకోకపోయినా…
“పిల్లల శిక్షణ”రచించి…
భరించలేని బాధ,తీవ్రతతో
స్త్రీలోలత్వంతో, వ్యామోహంతో
“కవిత్వంపై తృష్ణతో కంటనీరు”
తెచ్చుకున్న సౌందర్యపిపాసి

బహిరంగంగా చదవటానికి భయపడినా…
భయంకరాకర్షణ కలిగించి
ఎందరు వద్దని మొత్తుకున్నా
ఎగబడి చదివేలా…
సమాజంలో సంచలనం
కలిగించే భావాలను,
ప్రణయతత్వాన్ని,
తన రచనల్లో తనదైన శైలిలో,
భాషలో వెల్లడిస్తో పోయి
సమాజం నుంచి
వెలివేయబడిన
“దేవుడు కూడా లేని ఒంటరి

“దౌర్బల్యాలున్నా విశిష్ట గుణాలున్న వ్యక్తి”
హిపోక్రసీ నెదిరించిన
అనన్య రచనాశక్తి
గుడిపాటి వెంకటాచలం గారిది…!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!