అంశం: నేనో వస్తువుని
స్మార్ట్ ఫోన్
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: సావిత్రి తోట “జాహ్నవి”
నేనో వస్తువునీ అని పోరపాటున కూడా తలవకండి.
ఈ లోకపు గుండెకాయను నేను.
నేను లేని ప్రపంచమే లేదు నేడు.
ఏ సమాచారం కావాలన్న…
హితులు, సన్నిహితులు ఎవరి బాగోగులు తెలుసుకోవాలన్న…
కొత్తదారిలో ఏ అడ్డంకులు లేకుండా ముందుకు దూసుకుపోవాలన్న…
ఇల్లు కదలకుండానే కావాల్సిన సమస్తం కాళ్ల దగ్గరకు రప్పించుకోవాలన్న…
చివరికీ నీ జీవితానికి సరిపడే సంపాదన కావాలన్న…
నా తలుచుకుంటే చాలు.
సమస్తం మీ ఒడిలో ధారపోస్తాను.
కథలు,కబుర్లు, ఫజీల తో మీ మెదడుకు మేతనందిస్తాను.
స్నేహితులు, బంధువులు చెంత లేరన్న దిగులే అస్సలోద్దు.
వారిని మరిపించే వైబ్సెట్స్, ఆప్స్ ద్వారా చక్కటి కాలక్షేపం అందిస్తాను.
అతిగా ఉపయోగిస్తే,
మనిషివన్న మాట మరిపిస్తాను…
పిచ్చాసుపత్రికి కూడా పంపిస్తాను…
హ్హా… హ్హా…హ్హా…