కథావస్తువు

అంశం: నేనో వస్తువుని

కథావస్తువు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: కొల్లూరు వెంకటరమణమూర్తి

అమ్మానాన్నలకు భారాన్ని
అత్తమామలకు భాద్యతని
భర్తకన్నీ అందించే యంత్రాన్ని
పిల్లలకొక కదిలే ఆటబొమ్మని
తోడబుట్టినోళ్ళకు తగినదాన్ని
స్నేహితురాళ్ళకు సాటిలేనిదాన్ని
కొందరికెందుకూ కొరగానిదాన్ని
మరికొందరికి అణకువైనదాన్ని
నచ్చినవాళ్ళకొక మరబొమ్మని
మెచ్చనివాళ్ళకొక దిష్టిబొమ్మని
అంతరాత్మకు నమ్మకస్తురాల్ని
పరమాత్మునికి మంచి భక్తురాల్ని
నేనొక సాధారణ గృహిణిని
సగటు భరతజాతి మహిళని
అందుకే కదా నేనొక వస్తువుని
ఇలా ఈ కవితకు కథావస్తువుని

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!