చెంచా వేదన

అంశం: నేనొక వస్తువుని

చెంచా వేదన
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: రాధ ఓడూరి

చంటిగాడి అన్నప్రాశనకు నేనే
చిన్నదాని ఉగ్గుకు నేనే
పప్పన్నానికి నాతోనే పని నేయ్యికి
ఊరగాయ బద్దకీ నాతోనే పని
ఇంటిల్లిపాదీ దగ్గు మందుకూ నేనే
అలాంటి నన్ను…!
సూపు గిన్నెలో  తిప్పుతూ
వళ్ళంతా హూనం చేస్తూ
ఏకబీకి చీకి పారేసి
అవసరాలకు ఉపయోగపడిన నన్ను
నేనొక వస్తువుని అనుకోక
ఎందుకూ పనిరాని వెధవతో పోలుస్తూ
చెంచాగాడు
అని అంటారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!