జీవితంలో వసంతం

జీవితంలో వసంతం

రేపాక రఘునందన్

వివాహ బంధమే
ఆమెకు తోడూ నీడ
అయిన వారందర్నీ
వదిలి అత్తవారింటికి విచ్చేసిన
నవ వధువుకు ఆత్మీయతల
బంధాలు… అత్తమామల
ప్రేమపూరిత అనునయాలు… అండై నిలిస్తేనే
ఆమె జీవితంలో వసంతం….
ఆనందాల హరివిల్లులు
అనుభవాల జ్ఞాపకాలు
ఆమె మనో పుస్తకంలో
చెరగని చిరునామాలవుతాయి…
తోడుగా నిలిచిన భర్త క్షేమమే
ఆమెకు శ్రీరామరక్ష కావాలని
ఆమె ఆకాంక్ష…
ఒక వాగ్దానం వరమై
ఒక ఉనికి హృదయ గవాక్షమై
ఒకే మనసు రెండు తనువులుగా
ఒకే మనిషి కష్టసుఖాల్లో తోడుంటే
ఆమెకు నిత్యం పచ్చని చేల వింజామరలే…..
భాషకందని మధుర భావనలే…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!