విస్మయపరిచే విచిత్రం

(అంశం::”చిత్రం భలారే విచిత్రం”)

విస్మయపరిచే విచిత్రం 

రచన:: చంద్రకళ. దీకొండ

చక్కటి కళానైపుణ్యంతో అల్లిన
గిజిగాడి గూడు చెట్టుకు వ్రేలాడుతూ…!
అందమైన పక్షుల జంట…
చిరుగాలికి ఊగే గూటిలో హాయిగా ఊయలలూగుతూ…!
ఒక్కో పుల్లా పుడకా ముక్కున కరచి…
నేర్పుతో,ఓర్పుతో పేర్చి…
జిగిబిగిగా అల్లిన గిజిగాడి గూడు…!
చిత్రం…భళారే విచిత్రం…!
సృష్టిలో చిన్న జీవి అయినా…
బాధ్యతతో గూటి భద్రతను
కల్పించిన మగపక్షి…
అపురూపంగా ఆడపక్షిని సంరక్షిస్తూ…!

సృష్టిలో తానే అధికుడననుకునే మానవుడు…
పక్షులకు ఆశ్రయమిచ్చే తరువులను నరికేస్తూ…
బాధ్యతను మరచి…
ఆదరించవలసిన ఆడవారిని
నిరాదరణ పాల్జేస్తూ…
హింసలకు గురిచేస్తూ…
చిత్రం…విస్మయపరిచే విచిత్రం…!!!

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!