అడవిలో తిరిగే ఆట బొమ్మను

అంశం: నేనో వస్తువుని

అడవిలో తిరిగే ఆట బొమ్మను
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: కె.గీతాశైలజ

పుట్టిన నాటినుండి ఎదగనీయరే
మొదటి తరం రెండోతరమంటూ గిల్లేస్తూనే ఉంటారు.
అయినా బావను పంటిబిగువున భరిస్తాను
నేను చివుకుతూనే చిగురిస్తాను
పక్కలకు పెరుగుతూ గుబురుగా తయారవుతూ
మీకు నయనానందాన్ని కలిగిస్తూ పచ్చదపు ధరహాసాన్ని చిందిస్తూ
విరిసీ విరియని పూవులతో పలకరించి హాయిగా నవ్వుతాను
కోరికలు లేని నాజీవనం పరోపకారమే పరమధర్మమంటు సాగుతున్నా
నేనింత మేలుచేకూరుస్తున్నా నన్నే తిట్టి కొట్టి పారద్రోలుతారేమి
మీకోసమే నాజీవనం ఆకుల మొదలు కాడం తల్లివేరువరకూ
ఆట వస్తువులా చూస్తారేమి ఆదుకొనేవారే లేకపోగా
ఎవరికోరకీ త్యాగం మీకోసమేకదా అర్ధంచేసుకోరే
వేళాపాళా లేని వర్షాలు కరవు కటకాలతో
కఠినమైన రోగాలతో కలకలం సృష్టిస్తున్నా నన్ను
పట్టించుకోరే
అవునులే ఊరికే వచ్చేదానికి విలువలేదెన్నడు
ఇకనైనా మేలుకొనండి
తనువంతా తరిగి పోతున్నా చెలిమినై మీకోసం
నేవస్తువునై మీతోనే చేరిఉంటున్నా
చుక్కనీరు చిలకరించిన చాలు చిగురులై చుట్టుకుంటున్నా
అడవిలో తిరిగే ఆటబొమ్మనై ఆదరించిన చాలు ఆత్మీయంగా అల్లుకుపోతూ
తరువులను గురువులుగా కొలిచి తరిగిపోకుండా చూడండి ఇకనైనా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!