అర్ధాంగి

అర్ధాంగి

రచయిత:శాంతి కృష్ణ

అందచందాలు అడవికాచిన వెన్నెలవుతున్నా
అనునిత్యం నిన్ను ఆరాధించే రాధను నేను….

నా సర్వస్వం నీవేనంటూ
నీ సర్వస్వం నాకే కావాలని అలిగే సత్యభామ ను నేను…

ప్రతిక్షణం నిను భక్తితో
నిను కలవరించే
రుక్మిణి ని నేను….

ముండ్లపొదలైన పూలబాటైనా
నీ అడుగులో అడుగునై
నీ తొడునీడనై నడిచే సీతను నేను….

అష్టకష్టాలైనా తొణకన బెనకక
అండగా నిలిచే జంభావతిని నేను….

నీ కష్టసుఖాలను అర్ధం చేసుకుని
నీలో సగమై
నీకు అనుగుణంగా మెలిగే ఊర్మిళను నేను…

మన్మథ బాణాలతో నిను
కవ్వించి అలరించే
రతీదేవిని నేను…..

అర్ధాంగినై నిను
అన్నివేళలా అంటిపెట్టుకుని ఉండే
సతీదేవిని నేను….

You May Also Like

One thought on “అర్ధాంగి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!