అభిమానం

అభిమానం

రచన: ఐశ్వర్య రెడ్డి

ఏయ్ బుజ్జి …….లే ……..తొందరగాలే……..ఎంతసేపు పడుకుంటావు…..ఇంకా …….
ఎప్పుడో తెల్లారింది టైం  8  అయింది
8:30 కి కాలేజ్ బస్సు  వస్తుంది
రోజు లేటుగా లేవడం టిఫిన్ చేయకుండా
వెళ్లిపోవడం బాగా అలవాటైంది   అంది కాంచన

ఏంటమ్మా పొద్దున్నే ఎప్పుడు చూసినా తిట్టుకుంటూనే లేపుతావు..ఒక్కరోజన్నా నవ్వుకుంటూ లేపావా…. అంది సిందూ

ఏంటి ……..మొద్దులా పడుకుంటే నవ్వుకుంటూ లేపాలా………..సిగ్గు లేదు ఆ మాట అనడానికి నీకు, ఒంటి మీదకు 20 ఏళ్లు వచ్చాయి, ఒక్క రోజన్న తొందరగా లేచి రెడీ అయ్యావా   అంది  కాంచన

అబ్బా ఈ అమ్మా తో పెద్ద గొడవ అయిపోయింది ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తిడుతుంది
నా కల ఎప్పుడు  నేరవెరుతుందో  నా వాడు వచ్చి ఎప్పుడు తీసుకెళ్తాడో…..  మనసులో అనుకుంటూ రెడి  అయింది సింధు

అమ్మ బాక్స్ రెడీ అయిందా వెళ్ళిపోతున్నాను
చెప్పింది సింధు

రెడీ అయింది తీసుకో జాగ్రత్తగా వెళ్ళు తొందరగా ఇంటికి రా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ అక్కడే ఉండి పోకు

,ఆఆఆ ……😬నేను ఫ్రెండ్ తో మాట్లాడుకుంటూ ఉండిపోతే బస్సు డ్రైవర్ నాకోసమే  ఉంటాడు మరి……..తొందరగానే రాక అని తల్లి పై చిర్రు బుర్రులాడుతు బయలుదేరింది సింధు కాలేజికి

బస్సు లో:
హయ్  సిందూ

హయ్ కీర్తన

ఏంటి డల్ గా ఉన్నావ్ ఈరోజు సింధు అడిగింది కీర్తన

ఏమీ లేదు రోజు ఉండేదే మా అమ్మతో పెద్ద చిక్కు వచ్చింది   ఎక్కువ సేపు  పడుకోనివదు, టీవి చూడనివ్వదు ,ఫోన్లో గేమ్స్ ఆడనివ్వదు
ఇంటిలో నాకు సెక్యూరిటీ గార్డ్ లా తయారైంది ఈమధ్య  …….
ఆడపిల్లలంటే చాలు ఎప్పుడు ఇంత  ఇంత    కల్లుఏస్కుని చూస్తూ ఉంటారు

అందుకే కీర్తన నేను ప్రేమించిన మనిషి వచ్చేవరకు ఈ బాధలు పడాల్సిందే……..

కానీ సిందూ  అదంతా నీ కల అంది కీర్తన

కాలేజీ వచ్చింది ఫస్ట్ బస్సు  దిగు కీర్తన
చెప్పింది సింధు

బస్సు దిగి ఒక పక్క నిల్చోని
అయిన
ఎందుకు జరిగదు అన్నీ జరుగుతాయి పవన్ కళ్యాణ్ నా కోసం వస్తాడు చూడు అంది సిందూ

సరే తరువాత    మాట్లాడుకుందాం  ఇక్కడ ఎందుకు ఎవరైనా వింటే నవ్విపోతారు అంది కీర్తన
తరువాత క్లాస్ కి వెళ్లి కూర్చున్నారు.
ఇదే విషయమై ఇద్దరు మాట్లాడుకుంటుండగా  ఇంకో అమ్మాయి సంపూర్ణ వచ్చి…….

ఏంటి స్పెషల్ పొద్దుపొద్దున్నే డిస్కషన్ పెట్టారు
అసలు దేని గురించి …….ఇంత సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు ……..అడిగింది సంపూర్ణ

ఆ చెప్తాను విను దిని సంగతి ……….ఏమైనా అంటే పవన్ కళ్యాణ్ ని ప్రేమిస్తున్నానంటూ అతనొచ్చి నన్ను  పెళ్లి చేసుకుంటాడని కలగంటూ వుంది.

అలా కాదు జరగదు అంటే అసలు వినట్లేదు అని చెప్పింది కీర్తన ……

అప్పుడు సింధూ
నిజమే సంపూర్ణ
ఎందుకంటే నేను  టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు  2001 అప్పుడు ఖుషి సినిమా రిలీజ్ అయింది మా నాన్న మా అమ్మ నేను ముగ్గురం కలిసి వెళ్లి థియేటర్ లో  చూసిన సినిమా

మొదటిసారి పవన్కళ్యాణ్ చూసినప్పుడు ప్రేమంటే ఏంటో నాకు తెలిసింది అతని కళ్ళు ముక్కు మూతి ఆ పర్సనాలిటీ ఎంత బాగున్నాడు
అలా చూడగానే  మైమర్చిపోయాను ఏదో పరవశం కలిగింది నాలో
ఏదో ఆనందం అదే ప్రేమని తెలిసింది తర్వాత నాకు
పవన్కళ్యాణ్ చూసి న ఆ రోజు నుండి  ఎంత ప్రేమించానో మీకు తెలియదు
చూడండి చూడండి …….,ఎన్ని ఫొటోస్ ఉన్నాయో బుక్స్ లో   …….  పేపర్లలో వచ్చిన అన్ని  ఫోటోస్  ని కలెక్ట్ చేసుకున్నాను  అంది సింధు

ఓసి పిచ్చిదాన మెదడు  ఉందా  నీకు……….. ఆయన పెళ్లి అయిపోయింది అంది సంపూర్ణ

ఆ తెలుసు అప్పుడు చాలా బాధపడ్డా నా బాధ దేవుడు కి తెలిసిందో ఏమో ఇద్దరు విడిపోయారు
తర్వాత నాకోసం వస్తే బాగుండు అనుకున్న కానీ రాలేదు నేను ఆయన్ను ప్రేమించాను ఆయన కూడా నన్ను ప్రేమించాలి అని కోరుకుంటున్నాను, దీంట్లో తప్పేముంది ఎందుకంటే ఆయనకు నేను వీరాభిమానిని నేను ఆయన ప్రేమ కోసం ఎదురు చూస్తున్న రాముడి కోసం వేచి  ఉన్న శబరి లా ఆయన కోసమే ఉంటాను ఇలాగే జీవితాంతం…………చెప్పింది సింధు.

అమ్మో దీనికి  పిచ్చి  పిక్స్లో ఉందే బాబు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు దీన్ని చూస్తుంటే ఆలోచించుకోడానికి కూడా అర్హత ఉండాలి కదా ఆయన ఎక్కడ మనం ఎక్కడ  అంది కీర్తన

ఆయన భూమి మీద మనము భూమి మీద ఎందుకు ఎంతోమంది అభిమానులను చెరతీసే మంచి కుటుంబం అది  ……,అంది సిందూ

వాళ్ళు మంచివారే మేము ఏమీ కాదనడం లేదు కానీ అలా ప్రేమించడం తప్పు  అంది సంపూర్ణ

ప్రేమించడం తప్ప అయితే ప్రతి సినిమాలో ప్రేమ….ప్రేమ….ప్రేమ అని చూపెడుతున్నారు
అసలు ప్రేమ లేని సినిమా ఉంటుందా
ప్రతిదీ ప్రేమ ప్రేమ ప్రేమ అనే ఉంది కదా  అంది సిందూ.

ప్రేమిస్తే మన కాలేజీ అబ్బాయిలనో  లేకపోతే ఎవరినైన ఎక్కడైనా ప్రేమించు
పవన్ కళ్యాణ్ ను ప్రేమించడం ఏంటి అంది  సంపూర్ణ.

అయ్యో ఎందుకు ఏమైంది ఎంత అందంగా ఉన్నాడు క్యూట్గా అసలు
ఆయన అంటే  నాకు చాలా ఇష్టం అంది సిగ్గుపడుతూ సిందూ

ఈవినింగ్ అయింది
కాలేజీ నుండి ఇంటికి వెళ్ళిపోయారు

రాత్రి కలలో మళ్ళీ పవన్ కళ్యాణ్ ను ఊహించుకుంది
ఆ కళలో వాల్ల పెళ్లి జరిగిపోయింది …………. కల సాగుతుంది…. ……

తెల్లారింది  మళ్ళీ వాళ్ళ అమ్మ లేపింది……..కాని
ఈసారి వాళ్ళ అమ్మ కాలేజ్ కి వద్దు అంది

ఎందుకంటే సింధుకి పెళ్లి సంబంధం చూసారు. పెళ్లి చేయాలని నిర్ణయించారు

అప్పుడు  సిందూ నాకు తెలియకుండా నా పెళ్లి ఏంటి అసలు మీరు ఎలా నిర్ణయించారు
నాకు కనీసం ఒక్క మాట చెప్పారా
అని అడిగింది అమ్మని

అప్పుడు వాళ్ళ అమ్మ నువ్వు అన్ని మాకు చెప్పే చేస్తున్నావా ,నోరుమూసుకొని పెళ్లికి రెడీ అవు అబ్బాయి వాళ్ళ అమ్మగారు చావుబతుకుల్లో ఉన్నారు, తొందరగా పెళ్లి కావాలని వాళ్ళు అన్నారు నీ ఫోటో చూపించాము వాళ్ళు ఒప్పుకున్నారు డౌరి  కూడా పెద్దగా ఏం లేదు

అబ్బాయి నిన్ను చాలా ఇష్టపడ్డాడు అందుకే వారంలో పెళ్లి అన్నారు, పెద్దగా కొనడానికి కూడా ఏమీ లేవు పెళ్లి బట్టలు కొనుక్కుంటే సరిపోతుంది.
అంతే అది కూడా నేను చేస్తాను  షాపింగ్
నువ్వు కాలేజీ మానేయ్ అని చెప్పింది
బుర్ర గిర్రున తిరిగింది  సిందూ కి,

నేనేమో ఊహించుకున్నాను ఏమవుతుంది అసలు ఏంటి ఇలా అయితే అని ఆలోచించడం మొదలు పెట్టింది తనకేం తోచటంలేదు రోజు లు
గడుస్తున్నాయీ.

సింధు కీర్తన కి ఫోన్ చేసింది
కీర్తన నా పెళ్లి  ఇంకా మూడు రోజుల్లో నే
ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను  పి కె నిపెళ్లి చేసుకుందామని అనుకున్నాను
ఏంటో ఇలా అయిపోయింది

అప్పుడు కీర్తన పిచ్చిదానా పీకే లేడు ఏమీ లేడు హ్యాపీగా పెళ్ళి చేసుకో  పిచ్చి ఆలోచనలు మానేయు
సినిమాలు చూసి ఎంజాయ్ చేయడానికి మాత్రమే అంతే కాని వాళ్ళు జీవితమని ఊహించుకో కు ,
ప్లీజ్ దయచేసి  పిచ్చి ప్రయత్నాలు చేయకుండా మంచిగా పెళ్లి చేసుకో అని చెప్పింది .

మూడు రోజులు అలాగే ఆలోచనలతో గడిచి పోయింది ,
తర్వాత పెళ్లి జరిగింది.

పెళ్లి అయిన తర్వాత భర్తకు దూరంగా ఉండ సాగింది ………
ఆయన పక్కకు వస్తే పారిపోయేది ముట్టుకుంటే భయపడేది ……..
…………………….
అలా రోజులు గడిచిపోతున్నాయి, ఒకరోజు సింధూ కి బాగా జ్వరము వచ్చింది, తన భర్త కంటికి రెప్పలా కాపాడాడు, రాత్రివేళ కూడా మెలకువగా ఉండి మందులు వేసి సింధును మాములు మనిషిని చేసాడు.
ఒక రోజు ఎందుకో సింధుకి తన భర్తను చూస్తే చాలా బాధగా అనిపించింది
ఈయన నన్ను పెళ్లి చేసుకుని  ఏం సుఖపడుతున్నారు
నేను ఎన్ని పిచ్చి పనులు చేసాను
అయినా ఏమి అనటం లేదు చాలా మంచివారు
నేను  అతని ని తప్పుగా అర్థం చేసుకున్నాను
అనుకోని భర్త తో సఖ్యత గా ఉండటం మొదలుపెట్టింది.
పవన్ కళ్యాణ్ కంటే చాలా అందంగా కనిపించడం మొదలు పెట్టారు  తన  భర్త  ,
ఎవరినైతే మనం మనస్ఫూర్తిగా ప్రేమిస్తామో వాళ్ళే మనకు అందరికంటే అందంగా కనిపిస్తారు.

సిందూ జీవితం ఓ దారిలోకి వచ్చింది
కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో చూడ్డం మాత్రం మానలేదు
అంటే ఇప్పటికీ తను పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్
తనకు ముందుగా కొడుకు పుడితే  అతని పేరు పవన్ కళ్యాణ్ అనే  పెట్టుకుంది .తన జీవితం సంతోషంగా సాగింది.

***

You May Also Like

One thought on “అభిమానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!