సిరా చుక్క

 సిరా చుక్క

రచయిత: పాండురంగాచారి వడ్ల

నేనంటే అసహ్యించుకునే వాళ్ళూ ఉన్నారు..
నల్లటి ముత్యాన్ని అని నెత్తినెక్కించుకునే వాళ్ళూ ఉన్నారు..
నా ప్రేమలో పడి, నేనే వ్యసనంగా బతికిన వాళ్ళూ ఉన్నారు.
నా మత్తులో పడకుండా బతికిపోయాం అనుకునే మూర్ఖులూ ఉన్నారు.
నన్ను అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్న జ్ఞానులూ ఉన్నారు..
తమకి నేను పూర్తిగా అర్థం అయ్యాను, తమకే అంతా తెలుసు అనుకునే అజ్ఞానులూ ఉన్నారు..
కత్తిలా పదునూ ఉందనీ
నాలో విషమూ ఉందనీ
నమ్మేవాళ్లూ ఉన్నారు..
నమ్మని వాళ్ళూ ఉన్నారు..
నాకు భయపడి నన్ను దాచేవాళ్ళూ ఉన్నారు..
నన్నే ఆయుధంగా మలుచుకుని యుద్ధం చేసినవాళ్ళూ ఉన్నారు..
వేయిన్నొక్క అబద్ధాలను నిజమని నమ్మించగల నేర్పూ ఉంది నాకు..
నిజాన్ని నిప్పుల కొలిమిలో కాల్చి వేడెక్కించి సరాసరి గుండెల్లో దింపే ధైర్యమూ ఉంది నాలో..
నేను మరకనంటించనూగలను..
అదే మరకను రూపుమాపనూగలను..

నన్నో స్నేహితుడిగా మార్చుకుంటే, నిన్ను అందలమెక్కించే నేను..
ఒక్క తప్పటడుగు వేశావా??!! అధఃపాతాళానికి తొక్కేయనూగలను.
నిప్పుతో చెలగాటం ఆడినా గాయాలతో బయట పడవచ్చేమో..
నాతో ఆట నీ ఉనికికే ముప్పు.
నా నైజం తెలిసి మసులుకో..
నన్నెలా చూడాలనే నిర్ణయం నీ చేతుల్లో..
నీ తలరాత, అక్షరాలుగా మారే ఈ సిరా చుక్కల్లో..

You May Also Like

3 thoughts on “సిరా చుక్క

  1. సిరా చుక్క గొప్పతనం చాలా బాగా చెప్పావు……. “కత్తి కన్నా కూడా కలం గొప్పది” అంటారు కదా…….. దాన్ని ఉపయోగించడం మన చేతిలోనే ఉంది…..కవిత 👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!