(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)
నా కల
రచయిత :: నాగమణి
నల్లని మబ్బులు
జల్లులు కురవాలి,
అవని అంతా
పచ్చదనం నిండాలి,
తరులు, గిరులు
సురక్షితం గ ఉండాలి,
చేఱువులు, సెలయేరులు,
దాహానికి అమృత మవ్వాలి,
పీల్చే గాలి గుండెల నిండి
ఆయుష్షును పెంచాలి,
పుడమిన పుట్టిన
ప్రతి శిశువుకు
బొజ్జలు నిండుగ ఉండాలి,
రైతన్నల కష్టం ఫలించి
గాదెలు నిండుగ ఉండాలి,
వెరసి
కాలుష్యం, కల్మషం లేని,
భువిని, మనిషిని
కన్నుల నిండుగ
చూడాలను “నా కల”
ఆకాశానికి నిచ్చెనా….