స్వప్నిక సొంత ఇల్లు

స్వప్నిక సొంత ఇల్లు

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

స్వప్నిక చాలా అందంగా ఉంటుంది అంతా కన్న అందమైన కలలు కంటుంది
వంట వార్పు అత్తగారు చేస్తుంది పై పని మాత్రం స్వప్నిక చేస్తుంది

ఎందుకు అత్తయ్యా నేను చేస్తా.అంటే వద్దు నువ్వు నీ మొగుడి పనులు పిల్లల పనులు చూసుకో చాలు
ఇప్పటికీ ఓపిక ఉన్నంతలో నేను వండి పెడతాను నువ్వు పిల్లాలవి రాము క్యారేజీ సర్ధూ అంటారు మామగారు బ్యాంక్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యారు.

బావగారు ఆస్ట్రేలియాలో ఉన్నారు అడబడుచూ. కెనడాలో ఉంది
ఇండియాలో ఉన్నది వీళ్ళే అందుకు చిన్న కొడుకు వసంత రామ్ దగ్గర ఉన్నారు ప్రక్క పల్లెలో ఇల్లు ఉంది

బ్యాంక్ మనెజర్ చేసినా వీటిలో ఇల్లు కొనలేదు ఎప్పటి కప్పుడు ఖర్చులు బ్యాంక్ కాలనీ లో ఇల్లు ఇచ్చేటప్పుడు అవన్నీ ఊరికి బాగా దూరం అని వద్దను కొని.వదిలేశారు ఇంకా ట్రాన్స్ఫర్ లు పిల్లల చదువులతో ఎక్కడి కక్కడ మంచి ఇల్లు బ్యాంక్ క్వర్తెట్ మాదిరి ఇచ్చేవారు దానితో
వాళ్ళకి ఇల్లు కొనే అవసరం ఆలోచించే అవకాశం లేక పోయింది. చదువులు పెద్దవి దానితో సరిపోయింది ..
స్వప్నిక అత్తగారికి. మడి ఆచారం ఎక్కువ.అందుకు
కోడలు వంటకు దూరం అవుతుంది…వంట పెత్తనం అత్తగారిధి .అందరికీ రకరకాల రుచులు కావాలి రోజూ పప్పుకూర ముద్ద కూర..పచ్చడి పులుసు ఉండాలి.ఇంకా ఊరగాయలు.పొడులు.అప్పడాలు వడియాలు ఇవి ఆస్థాన విద్వాంసులు . ఏదోఒకటి. ఎవరికి కావలసినవి వారు తింటారు.

ఎదిగే పిల్లలకు బలంగా పెట్టాలి అంటూ నెయ్యి పెరుగు
బాగా వాడకము..

ఇలా సంపూర్ణ ఆరోగ్య సూత్రాలతో పిల్లలకి వండి పెట్టేది మనుమలకి. అదే పద్ధతి వంట ఇల్లే మన ఆరోగ్య శాల అని.చెప్పింది. నిజమే ఇల్లు కూడా అతి పరిశుభ్రంగా ఉండాలి వంట సరకుల డబ్బాలు పాత్రలు.అన్ని శుభ్రంగా నెలలో ఒకసారి చక్కగా కడిగించి తుడిపించి ఎండపెట్టి డబ్బాలు సర్దేది

ఏ వయసు ముచ్చట ఆ వయసులో జరగాలి అని ఆడపిల్లకు డిగ్రీ కాగానే అన్నకొడుకు అచ్యుత్కి ఇచ్చి చేశారు వాళ్ళని కంపెనీ వారు విదేశాలకు పంపారు రెండు పురుళ్లకి వెళ్లి పోసి వచ్చింది.
అప్పుడు అత్తగారు తల్లి వచ్చి.అల్లుడికి వసంతరామ్ కి వండి పెట్టింది..బావగారు అప్పటికే ఆస్ట్రేలియా లో ఉన్నారు….
ఇంకా ఊరగాయలు అప్పడాలు వడియాలు చల్ల మిరప కాయలు ఇవన్నీ బాగా పెట్టీ వేదే సి పిల్లలకి పంపేవారు
చేసిన చెయ్యి అందుకు వంటింటి రాణిగా అమే ఉండి పోయింది

స్వప్నిక చిన్నప్పటి నుంచి పెద్ద ఇంట్లో పెరిగింది అన్నయ్యలు గారంగా చూసేవారు .ఎప్పుడు పట్టు లంగాలు కట్టేది తండ్రి పేరున్న ఇంజనీర్ .అంతా ఎంతో చక్కగా ఉండేవారు. చదువు. కాగానే వసంత రామ్ నీ తండ్రి చూసి బాగున్నాడు పిల్లాడు అంటూ పెళ్లి చేసేశాడు వసంత్ ఒక కంపెనీ ల్లో ఇంజనీర్.తల్లి తండ్రికి గారాల కొడుకు .అందుకే. వాళ్ళు స్వప్నిక.దగ్గర ఉన్నారు
అన్నగారు లు ఇద్దరు మంచి ఇళ్ళు కట్టుకున్నారు తండ్రి తల్లి వేరే ఉంటారు.వాళ్ళకి.రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది పొలాలు ఉన్నాయి. ఏ లోటూ లేదు.

స్వప్నిక సొంతిల్లు తాము కొనాలి లేక కట్టు కోవాలి.
తన వాళ్ళు ఏమే మీ ఆయన ఇంజనీర్ ఇంకా.సొంత ఇల్లు కట్టుకో లేదా పిల్లలు ఎదిగితే వారి చదువు పెళ్లిళ్లు.సరిపోతాయి నువ్వు సుఖపడేదెప్పుడు అంటారు

ఇల్లు కడితే వాస్తు బాగుండాలి.మంచిగా సిటీ దగ్గర కొనుక్కో అంతే గాని ఊరు అవతల కొనుక్కో వద్దు అన్ని దూరం అవుతాయి . ఎంత కారున్న దూరం వద్దు సూది  పిన్ని కావాలన్న కారులో వెళ్ళాలి. అలా పెట్టుకోకు మగాళ్లకి ఇబ్బంది నీ తిన్న నీవు.షాపింగ్.చేసేలా ఉండాలి.
పిల్లలకి ఎది కావాలన్న చక్కగా.వాళ్ళు వెళ్లి తెచ్చుకునే లా ఉండాలి అంటూ సలహా లిస్తారు.
మరి కొందరయితే…ఎక్కడో అక్కడ నా అన్న ఇల్లు ఉండాలి వాసం మనదయితే .గ్రాసం అదే.వస్తుంది అని తొందర. చేస్తారు.

ఎది.ఏమైనా ఇల్లు అనేది ఇటెళ్ళి పాధికి నచ్చేలా ఉండాలి.ఎవరైనా ఇంటికి వచ్చి నాలుగు రోజులు ఉంటే సరి పోవాలి.
కొంటే పెద్ద ఇల్లు కొనాలి అని అత్తగారు అంటారు

సరే పిల్లలు ఎదుగుతున్నారు బామ్మ తాత మ డీ.తగ్గుతోంది
రామ్ ఆలోచించాడు

వాళ్ళు ఉన్న ప్రాంతం వాళ్ళకి అలవాటు అందుకే అక్కడ ఓ పాత ఇల్లు పడగొట్టి అపార్ట్మెంట్ కడుతున్నారు
అందులో ఎవరికి చెప్పకుండా
రెండు ప్లాట్స్ కలిపి పుచ్చుకున్నాడు .నాలుగు బెడ్ రూమ్లు పిల్లకి వేరు తల్లి తండ్రికి వేరు ఇండియా వచ్చిన అన్నయ ఆక్క ఫ్యామిలీకి ఇలా ఆలోచించి విశాలంగా ఉన్న ఇల్లు బుక్ చేశాడు .కట్టుబడి మొదలు ఈ విషయం ఎవరికి చెప్పలేదు రెండు మూడు సార్లు స్వప్నిక మన దగ్గర్లో ఉంది కొనండి అంది సరే చూస్తాను అనేవాడు ఈ సారి తల్లి. కూడా పిల్ల పెద్దది అవుతోంది. ఇల్లు కొనాలిరా రామ్ అంటుంది
నాన్నగారు నీకు డబ్బు అవసరం అయితే నేను చూసుకుంటాను అందరికీ కొత్త ఇల్లు కావా లనే కోరిక ఎక్కువ ఐయిన్ ది మీ అమ్మ ఎనాడు అడగ లేదు కానీ నీ భార్య.చాలా కాలంగా అడుగుతోంది ..వాళ్ళ వాళ్ళు అంతా ఇక్కడ ప్లాట్స్ కొన్నారు
అందుకే ఆమెకి ప్లాట్స్ పై మోజు అన్నారు
అయితే ఇంత వరకు సొంత ఇల్లు అంటే మొక్కలు కింద ఇల్లు అయితే మంచిదని
బ్రమలో ఉన్నారు కాని ఇప్పటి ధరలు బట్టి కింద ఇల్లు కంటే అపార్ట్మెంట్ మేలు అని నిర్ణ.యించుకుని ఇల్లు కొన్నారు
కట్టు బడికి రెండు. ఏళ్ళు పట్టింది .స్వప్నిక మటుకు. ప్రతి ఆదివారం ఇంటి విషయం తెస్తూనే ఉంది వసంత్ మటుకు .తొందరలో నిన్ను సొంత ఇంటిలో ఉంటావు అంటూ గడిపాడు సరే కట్టుబడి పూర్తి అయింది .

స్వప్నిక అంటూ ఓ రోజు పుట్టినరోజు వస్తోంది నీకు మంచి కానుక తేస్త అన్నాడు
నాకు అన్ని ఉన్నాయి .ఇంకా ఏమి తెస్తారు.అంది బుంగ మూతి పెడుతూ రేపు.పుట్టిన రోజు చూస్తావు అన్నాడు

సరే పుట్టినరోజు రానే వచ్చింది .పూజ టిఫిన్లు అయ్యాక స్వప్నిక ఇలా రానమ్మ అని మామగారు పిలిచారు సరే అని వెళ్ళింది
రాత్రే కొత్త చీ ర భర్త తెచ్చాడు

అక్షింతలు పట్టుకు రా అని అత్తగారు పిలిచింది ఏమిటో అనుకుంటూ ఆసక్తిగా ఉంది భర్త ఎదో కవర్ తెచ్చి ఉన్నాడు.

ఆ కవర్ మామగారికి ఇచ్చాడు స్వప్నిక ఇలా రా అని కోడలు చేతిలో ఆ కవర్ పెట్టారు అత్త గారు తాళం గుత్తి చేతి లో పెట్టింది

ఇదేమిటి ఇప్పుడు నాకు ఎందుకు అన్నది

అదికాదు ఇంతకాలం నేను చూసాను ఇప్పుడు కొత్త ఇంటుక్కి నువ్వే రాణి వి అంటూ చెప్పింది.
ఇదిగో ఇవే కోతైంటి.దస్తావేజులు బీరువాలో జాగర్త పెట్టు
మాఘ మాసంలో గృహ ప్రవేశం అన్నారు

ఆశ్చర్య పోవడం స్వప్నిక వంతు ఐయ్యింది .

మా వృద్ధాప్యం నీ చేతిలో వెళ్లి పోవాలి నీకు ఇల్లు సుఖం గా ఉంటే గాని పని చెయ్యలేవు పిల్లలు నీకు ఎదుగు తున్నారు మీ జీవితాలు వేరు అందుకు తగినట్టుగా ఇల్లు కొన్నాము అని మామగారు అత్తగారు నవ్వారు వసంత రామ్ ప్రేమగా చూసాడు.
పుట్టినరోజు ఎంతో ఆనందంగా.ఉంది. పిల్లలు సంతోష పడ్డారు
నానాటీ బ్రతుకు నాటకము శ్రీ వేంకటేశ అమృత కీర్తన శోభ రాజు గళంలో వినిపించింది..
వృద్దాప్యంలో పిల్లలు మన మల తో గడపటం ఓ ఆనందం ఓ అనుభూతి కదా అది కొందరికే పరిమితమా ఆలోచించండి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!